రాత్రిపూట కాలు నొప్పి వస్తుంటే చాలా అసౌకర్యంగా ఉంటుంది.

ఇలా జరగకుండా చేయాలంటే ఏమి చేయాలో చూద్దాం. విపరీతమైన శారీరక శ్రమ, డీహైడ్రేషన్ల కారణంగా కాలు తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వేసవిలో, కొన్ని మందులు లేదా ఆరోగ్య సమస్యలు కూడా దాని వెనుక ఉండవచ్చు.  రాత్రిపూట వచ్చే కాలు నొప్పిని చార్లీ హార్స్ అని కూడా అంటారు. ఇది ఒక సాధారణ సమస్య, ఎక్కువగా పనిచేయడం వల్ల మీకు కాలు నొప్పి వచ్చినట్లయితే, వ్యాయామాల సమయంలో స్ట్రెచ్ చేయడం లేదా బాగా నీళ్ళు త్రాగటం […]

Share:

ఇలా జరగకుండా చేయాలంటే ఏమి చేయాలో చూద్దాం. విపరీతమైన శారీరక శ్రమ, డీహైడ్రేషన్ల కారణంగా కాలు తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వేసవిలో, కొన్ని మందులు లేదా ఆరోగ్య సమస్యలు కూడా దాని వెనుక ఉండవచ్చు. 

రాత్రిపూట వచ్చే కాలు నొప్పిని చార్లీ హార్స్ అని కూడా అంటారు. ఇది ఒక సాధారణ సమస్య, ఎక్కువగా పనిచేయడం వల్ల మీకు కాలు నొప్పి వచ్చినట్లయితే, వ్యాయామాల సమయంలో స్ట్రెచ్ చేయడం లేదా బాగా నీళ్ళు త్రాగటం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు. ఉపశమనం కోసం హీటింగ్ ప్యాడ్ లేదా కూలింగ్ ప్యాడ్‌లను అప్లై చేయవచ్చు.

రాత్రిపూట వచ్చే కాలు నొప్పి చాలా అరుదేమీ కాదు. కారణాలు బాగా తెలియవు కానీ,  చాలా సార్లు కొందరిలో.. ముఖ్యంగా వేసవిలో ఎక్కువసేపు వ్యాయామం చేయడం లేదా శారీరక శ్రమ కారణంగా కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది. డీహైడ్రేషన్, వయస్సు, గర్భం దాల్చడం, కొన్ని వైద్య సమస్యలు లేదా కొన్ని మందులను చాలా రోజులపాటు తీసుకోవడం వల్ల కండరాల తిమ్మిరి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. టెండినైటిస్, ఇన్సఫిసియెన్సీ ఫ్రాక్చర్స్, సిరల వెరికోసిటీ, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్, గౌట్ లేదా ఎలక్ట్రోలైట్ డిస్‌ఫంక్షన్, జీవక్రియ వంటి కొన్ని అసాధారణ కారణాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా భరించలేనంత నొప్పి ఉన్నవారి విషయంలో వీటిని విస్మరించకూడదు.

కాలు తిమ్మిరి అంటే ఏమిటి?

కొన్ని సెకన్లు లేదా నిమిషాల పాటు కొనసాగే బాధాకరమైన కండరాల నొప్పులే కాళ్ల తిమ్మిర్లు. అవి మీ నిద్ర, వ్యాయామంతో పాటు జీవన శైలిపై ప్రభావం చూపుతాయి. కొన్ని అనారోగ్యాలకు వాడే మందులు కూడా వాటికి కారణమవుతాయి. వీటిని నివారించడానికి ఎన్నో రకాల నివారణ చర్యలు ఉన్నాయి. మీకు ఎప్పుడు తిమ్మిరిగా ఉన్నా, కండరాలను స్ట్రెచ్ చేయడం, హీటింగ్ ప్యాడ్ లేదా కూలింగ్ ప్యాడ్‌లను అప్లై చేయడం, ప్రభావిత ప్రాంతాన్ని మసాజ్ చేయడం వంటివి చేయడానికి ప్రయత్నించండి. కాళ్ల తిమ్మిర్లు పదునైన, అసంకల్పిత కండరాల నొప్పులు, ఇవి సాధారణంగా పిక్కలు. పాదం, తొడలలో వస్తాయి. ఈ తిమ్మిరులను ‘చార్లీ హార్సెస్’ అని కూడా అంటారు. ‘ తిమ్మిరి కారణంగా మీ కాలు చాలా నొప్పిగా ఉండవచ్చు లేదా ఎంతో ఇబ్బందిగా ఉండవచ్చు. తిమ్మిర్లు అసౌకర్యంగా ఉన్నప్పటికీ, వాటి వల్ల పెద్దగా హాని ఉండదు.

రాత్రిపూట వచ్చే కాళ్ల తిమ్మిరులను, నొప్పిని తగ్గించుకొనేందుకు చిట్కాలు

  • రాత్రిపూట వచ్చే కాళ్ల తిమ్మిరులను తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన నివారణ మార్గాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
  • వ్యాయామం లేదా ఉద్యోగం చేసే సమయంలో శరీరాన్ని స్ట్రెచ్ చేయడం, ఎక్కువ నీరు త్రాగటం దీన్ని నిరోధించడంలో సహాయపడతాయి.
  • హీటింగ్ ప్యాడ్‌లు కాలిని ఫ్లెక్షిబుల్ గా చేస్తాయి, అయితే ఐస్ ప్యాక్ వాపు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
  • ఈ చిట్కాల వల్ల సమస్య తగ్గకపోతే, నాప్రోక్సెన్ కాంబి ఫ్లామ్ వంటి మందులు చాలా బాగా సహాయపడతాయి. చాలా సందర్భాలలో, చార్లీ హార్స్ కొన్ని నిమిషాల్లోనే సులువుగా తగ్గిపోతుంది.