బెండకాయ ఆలు పల్లీకారం కర్రీ

బెండకాయలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. బెండకాయ కూర తింటే లెక్కలు బాగా వస్తాయని అంటారు. అంతే కాదు బెండకాయ మోకాళ్ళ మధ్య జిగురును పట్టి ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఇన్ని మంచి లక్షణాలున్న బెండకాయ తినాలంటే మాత్రం పిల్లలు మారాం చేస్తుంటారు. నిజానికి వీటితో బెండకాయ వేపుడు, బెండకాయ పులుసు, గుత్తి బెండకాయ ఇలా బెండకాయతో ఎన్నో రకాల కూరలను చేయవచ్చు. అయితే ఇవన్నీ కూడా చేసేసి బోర్ కొట్టినప్పుడు ఇలాంటి వెరైటీ రెసిపీ ట్రై […]

Share:

బెండకాయలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.

బెండకాయ కూర తింటే లెక్కలు బాగా వస్తాయని అంటారు. అంతే కాదు బెండకాయ మోకాళ్ళ మధ్య జిగురును పట్టి ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఇన్ని మంచి లక్షణాలున్న బెండకాయ తినాలంటే మాత్రం పిల్లలు మారాం చేస్తుంటారు. నిజానికి వీటితో బెండకాయ వేపుడు, బెండకాయ పులుసు, గుత్తి బెండకాయ ఇలా బెండకాయతో ఎన్నో రకాల కూరలను చేయవచ్చు. అయితే ఇవన్నీ కూడా చేసేసి బోర్ కొట్టినప్పుడు ఇలాంటి వెరైటీ రెసిపీ ట్రై చేయండి. దీన్ని అన్నంతోనైనా, చపాతీతోనైనా తినవచ్చు. పిల్లలు లొట్టలు వేస్తూ తింటారు. పెద్దల పొగడ్తలు మీ సొంతమవుతాయి.

కావలసిన పదార్థాలు

అర(½) కిలో కడిగి తరిగి పెట్టుకున్న లేత బెండకాయలు 

పావు (¼) కిలో కడిగి తరిగి పెట్టుకున్న ఆలుగడ్డలు 

2 ఉల్లిపాయలు

3 టొమాటోలతో తయారు చేసిన ఫ్యూరీ 

100 గ్రా. పల్లీలు

3-4 ఎండు మిరపకాయలు

ఒక టీ స్పూన్ జీలకర్ర

ఒక టీ స్పూన్ వేపిన ధనియాల పొడి

ఒక టీ స్పూన్ వేపిన జీలకర్ర పొడి

ఒక టీ స్పూన్ కారం

రుచికి సరిపడా ఉప్పు

నాలు రెబ్బల కరివేపాకు

ఒక టేబుల్ స్పూన్ నూనె

చిటికెడు పసుపు

తయారు చేసే విధానం

ముందుగా స్టవ్ వెలిగించి, కడాయి పెట్టి, దానిలో ఒక కప్పు పల్లీలు, రెండు ఎండు మిరపకాయలు వేసి వేయించి, తీసేసి, చల్లారిన తరువాత మిక్సీలో వేసి పల్లీ కారం పొడి తయారు చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నూనె వేసి, వేడి చేసి నూనె మరిగాక, అందులో బెండకాయ ముక్కలు వేసి దోరగా వేయించుకొని పక్కన ఉంచాలి. ఆ తరువాత అదే కడాయిలో ఆలుగడ్డ ముక్కలు వేసి దోరగా వేయించుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసి, దానిలో జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ తరువాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.  ఇప్పుడు దీనిలో తయారుచేసి పెట్టుకున్న పల్లీ కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి ఒక అర గ్లాసెడు నీళ్లు పోసి నూనె పైకి తేలేవరకు హైలో పెట్టి ఉంచాలి. దీనిలో టొమాటో ఫ్యూరీ వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసి, వేయించి పెట్టుకున్న కూరగాయ ముక్కలను కలిపి, చిటికెడు పసుపు వేసి, మరి కొద్దిగా నీరు చల్లి, ఒక ఐదు నిమిషాలపాటు మూతపెట్టి మగ్గనివ్వాలి. చివరగా తరిగిన కొత్తిమీర తరుగు వేసి దింపేస్తే, బెండకాయ పల్లీ కారం రెడీ. 

ఈ కూర రుచిగా ఉండటమే కాకుండా, దీనిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇది ప్రోటీన్ రిచ్ రెసిపీ. మరి మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో మాకు చెప్పండి.

టొమాటో ప్యూరీ తయారీ విధానం:

నాలుగు టమాటాలు తీసుకొని చిన్న గాట్లు పెట్టి నూనెలో వేసి మగ్గించుకోవాలి. అవి మగ్గాక వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. అవి చల్లారిన తరువాత టొమాటో తొక్కలను తీసేయాలి. ఆ తరువాత ఆ టమాటాలను మిక్సర్ లో వేసి ఫ్యూరీ తయారుచేసి పెట్టుకోవాలి.