నిద్రలేమి ఆరోగ్యంపైనే కాదు అందంపైనా కూడా ప్రభావం చూపుతుంది…

మంచి నిద్ర మీ రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. సరిగ్గా నిద్రపోకపోవడం మీ రోజంతా పాడుచేయడమే కాకుండా మీ చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. తెల్లవారుజామున నిద్రలేచి వాడిపోయిన మొహంతో రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదా అని అందరూ అడుగుతుండడం చాలా సార్లు జరుగుతుంది. మీకు తగినంత నిద్ర రాకపోతే, దాని ప్రతిబింబం మీ ముఖంపై స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. కాబట్టి, మీకు మంచి నిద్ర లేకపోతే అది మీ ముఖ సౌందర్యాన్ని ఎలా పాడు చేస్తుందో […]

Share:

మంచి నిద్ర మీ రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. సరిగ్గా నిద్రపోకపోవడం మీ రోజంతా పాడుచేయడమే కాకుండా మీ చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. తెల్లవారుజామున నిద్రలేచి వాడిపోయిన మొహంతో రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదా అని అందరూ అడుగుతుండడం చాలా సార్లు జరుగుతుంది. మీకు తగినంత నిద్ర రాకపోతే, దాని ప్రతిబింబం మీ ముఖంపై స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. కాబట్టి, మీకు మంచి నిద్ర లేకపోతే అది మీ ముఖ సౌందర్యాన్ని ఎలా పాడు చేస్తుందో తెలుసుకుందాం…

చర్మంలో డల్ నెస్ ఏర్పడడం

మీరు రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే, మొదట ముఖం మీద నీరసం కనిపిస్తుంది. చర్మం నల్లగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఎన్ని కాస్మెటిక్స్ వాడినా ముఖం డల్ గా కనిపిస్తుంది.

చర్మంలో డ్రైనెస్ అలాగే ఉండడం

మనం నిద్రపోతున్నప్పుడు, దెబ్బతిన్న చర్మాన్ని సరిచేయడానికి మన చర్మ కణాలు పనిచేస్తాయి. అటువంటి పరిస్థితిలో చర్మం యొక్క ఆయిల్ గ్రంధుల నుండి నూనె విడుదలవుతుంది. మనం నిద్ర నుండి మేల్కొన్నప్పుడు, అది ముఖంపై ఆయిల్ గ్లోగా పనిచేస్తుంది. మీరు సరిగ్గా నిద్రపోకపోతే, మీ చర్మం పొడిగా కనిపిస్తుంది.

కళ్ళ కింద నలుపు

సహజంగానే.. మీరు సరిగ్గా నిద్రపోకపోతే, మీ కళ్ళపై గ్లో ఉండదు. దాని కారణంగా అక్కడి చర్మం నల్లగా మారుతుంది. కళ్ళలో అలసట వల్ల కూడా ఇలా జరుగుతుంది.

కళ్ళు ఉబ్బడం

చాలా మంది తమ కళ్ళ కింద చర్మం ఉబ్బిపోతుందని ఫిర్యాదు చేస్తూ ఉంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఈ వాపు వస్తుంది.

ముఖం మీద ఫైన్ లైన్స్

చర్మానికి సరైన విశ్రాంతి లభించకపోతే.. చర్మ కణాలు దానిని రిపేర్ చేయకపోతే, అప్పుడు చర్మంలో ఫైన్ లైన్ కనిపించడానికి సమయం పట్టదు. ముఖంపై ఫైన్ లైన్స్ ఏర్పడటానికి అనేక కారణాలు ఉండవచ్చు, కానీ సరిగ్గా నిద్రపోకపోవడం కూడా ఒక పెద్ద కారణం కావచ్చు.

ముఖ ఉద్రిక్తత

మనకు సరైన నిద్ర లేకపోతే, మన మెదడు నెమ్మదిగా పని చేస్తుంది. ఇది మన చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. మన చర్మం ఒత్తిడికి గురవుతుంది. దాని గ్లోని కోల్పోతుంది.

ముఖం మీద మొటిమలు

చాలా సార్లు, నిద్ర లేకపోవడం వల్ల చర్మంపై ప్రభావం ముఖం మీద మొటిమలు రావడం కూడా ఒకటి. మన శరీరానికి మనం తిన్న ఆహారం పట్టనప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది.

చర్మంపై ముడతలు కనబడడం

మనం 6 నుండి 7 గంటల పాటు మంచి నిద్రను తీసుకోకపోతే చర్మంపై ఫైన్ లైన్స్ తో పాటు ముడతలు కూడా రావడం ప్రారంభమవుతాయి. అటువంటి పరిస్థితిలో మనం సమయానికి ముందే వృద్ధాప్యంగా కనిపించడం ప్రారంభిస్తాము.

నిద్ర బాగా ఉంటే శరీరంలో కొల్లాజెన్ స్థాయి అలాగే ఉంటుంది. మీరు గాఢమైన నిద్రను తీసుకుంటే.. ఈ కొల్లాజెన్ శరీర చర్మంలో తేమ, అందాన్ని కాపాడుతుంది. కొల్లాజెన్ యొక్క ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఇది చర్మాన్ని మెరిసేలా మరియు ఆరోగ్యంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఈ ముఖ్యమైన ప్రోటీన్ చర్మానికి స్థితిస్థాపకతను అందిస్తుంది. ఇది యవ్వనంగా మరియు ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇది స్కిన్ మాయిశ్చరైజింగ్ గుణాలను కలిగి ఉంటుంది.

నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం.. పెద్దలు ప్రతి రాత్రి 7 నుండి 9 గంటలు నిద్రపోవాలి. వారు క్రమం తప్పకుండా మంచి నిద్రను పొందినట్లయితే.. అది చర్మంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.