వాలెంటైన్స్ డే రోజున ఇచ్చే గులాబీల రంగు దేన్ని సూచిస్తుంది? ఏ రంగు గులాబీ దేన్ని సూచిస్తుందో తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులకు ప్రత్యేకమైన రోజులలో ఒకటి రోజ్ డే. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన దీన్ని జరుపుకుంటారు. ఈ రోజుతో వాలెంటైన్స్ వీక్ మొదలవుతుంది. ఈ రోజున, ప్రేమికులు తమ జీవిత భాగస్వాములకు గులాబీలను బహుమతిగా ఇవ్వడం ద్వారా వారి ప్రేమను మరియు ఆప్యాయతను వ్యక్తం చేస్తారు. లవ్​లో ఉన్న కపుల్ మరియు రిలేషన్​షిప్​లో ఉన్న కపుల్ ఎవరు కూడా రోజ్​ డేను అస్సలుకే మిస్ అవ్వకూడదని అనుకుంటారు. ఈ రోజు కోసం ఎప్పటి […]

Share:

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులకు ప్రత్యేకమైన రోజులలో ఒకటి రోజ్ డే. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన దీన్ని జరుపుకుంటారు. ఈ రోజుతో వాలెంటైన్స్ వీక్ మొదలవుతుంది. ఈ రోజున, ప్రేమికులు తమ జీవిత భాగస్వాములకు గులాబీలను బహుమతిగా ఇవ్వడం ద్వారా వారి ప్రేమను మరియు ఆప్యాయతను వ్యక్తం చేస్తారు. లవ్​లో ఉన్న కపుల్ మరియు రిలేషన్​షిప్​లో ఉన్న కపుల్ ఎవరు కూడా రోజ్​ డేను అస్సలుకే మిస్ అవ్వకూడదని అనుకుంటారు. ఈ రోజు కోసం ఎప్పటి నుంచో ఏర్పాట్లను కూడా చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రత్యేకమైన రోజున తమను ప్రేమించే వారిని సర్ ​ప్రైజ్ చేయాలని భావిస్తారు. 

మీ పార్ట్ నర్ పట్ల మీకున్న ప్రేమను చూపించడానికి గులాబీలను బహుమతిగా ఇవ్వడం ఒక అద్భుతమైన మార్గం. మీరు ఏదైనా రొమాంటిక్‌గా ఉండే బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నారా? లేదా మీ పార్ట్ నర్‌‌‌‌కి ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని కలిగించడానికి ఏదైనా ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే మీరు గులాబీలను ఎంచుకోవచ్చు. గులాబీలున్న కార్డ్‌ల నుండి గులాబీ సువాసనలు వెదజల్లే కొవ్వొత్తుల వరకు, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో ఏవి ఎంచుకున్నా ఈ ప్రత్యేకమైన రోజున మీ ప్రియమైన వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రశంసించేలా చేస్తాయి.

ఒక్కో రంగు గులాబీ ఒక్కో రకమైన భావాన్ని సూచిస్తుంది. ఏ భావాన్ని సూచించడానికి ఏ రంగు గులాబీ ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎరుపు రంగు గులాబీ (రెడ్ రోజ్):

మీరు ప్రేమను వ్యక్తపరచాలనుకుంటే, ఎరుపు రంగు గులాబీ ఇవ్వడం మంచిది. ఎరుపు గులాబీ ప్రేమకు చిహ్నం. ప్రేమికుల రోజున, మీరు ఎరుపు గులాబీలను ఇవ్వడం ద్వారా మీ ప్రేమను తెలియజేయవచ్చు. రోజ్ డే నాడు, మీ భావాలతో ఒక నోట్‌ వ్రాసి, దానితో పాటు ఎర్ర గులాబీని బహుమతిగా ఇవ్వండి. 

పసుపు రంగు గులాబీ:

పసుపు రంగు గులాబీ ఇస్తే మీరు వారితో స్నేహం చేయాలని ఇష్టపడుతున్నారని అర్థం.. అయితే, పసుపు రంగు గులాబీ స్నేహానికి, ఉత్సాహానికి చిహ్నంగా చెప్తారు. అందుకే ఎవరితోనైనా స్నేహం చేయాలనుకుంటే పసుపు గులాబీని ఇచ్చి ఆ రిలేషన్‌షిప్‌ స్టార్ట్ చేయచ్చు.

తెల్ల గులాబీ:

తెల్ల గులాబీ శాంతికి, స్వచ్ఛతకు చిహ్నం. ఎవరితోనైనా మీ సంబంధాలు చెడిపోయి, ఆ సంబంధాలను మునుపటిలా ప్రేమతో నింపాలని మీరు అనుకుంటుంటే, వారికి తెల్ల గులాబీలను బహుమతిగా ఇవ్వండి. వారితో మీ సంబంధం మళ్లీ స్నేహాన్ని కొనసాగించవచ్చు

పింక్ రోజ్:

ఇది గౌరవం, ఆరాధన, ప్రశంసలకు కూడా చిహ్నం. మీరు ఎవరినైనా మెచ్చుకోవాలనుకుంటే లేదా గౌరవంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటే, మీరు రోజ్ డే నాడు వారికి పింక్ కలర్ గులాబీలను ఇవ్వవచ్చు. మీకు సహాయం చేసే స్నేహితులు, ఉపాధ్యాయులు మరియు అమ్మా నాన్నలకు పింక్ కలర్ గులాబీలను ఇవ్వడం ద్వారా కూడా మీ భావాలను వ్యక్తపరచవచ్చు.

ఉప్పు, కర్పూరం చూడటానికి ఒకేలా ఉన్నా దేని ప్రత్యేకత దానికి ప్రత్యేకం. అలాగే గులాబీ రంగుల్లో కూడా అనేక రంగులు ఉంటాయి. ఈ ఆర్టికల్ లో మీకు గులాబీ రంగుల గురించి, అవి వేటిని సూచిస్తాయో తెలుసుకున్నారు కదా. అయితే, ఈ సారి రోజ్ డేకి మీ ప్రియమైన వారికి గులాబీలను బహుమతిగా పంపి వాళ్ళ మనసులు దోచేయండి.