భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి 2023 గురించి తెలుసుకోండి

హిందూ మతంలో, ఏకాదశి తిథి ఎంతో పవిత్రం. శ్రీహరి శరీరం నుండి ఏకాదశీ తిథి పుట్టిందని, అందువల్ల అది ఆ శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన తిథి అని అంటారు. ఈ తిథి తిథులన్నింటిలోకెల్లా ఉత్తమమైనది, అత్యంత పవిత్రమైన తిథిగా చెప్పబడింది. మాఘమాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అంటారు. భూమి ఏకాదశి మరియు భీష్మ ఏకాదశి అని కూడా పిలువబడే ఈ జయ ఏకాదశి నాడు విష్ణువును పూజించి ఉపవాసం ఉంటారు. విష్ణు […]

Share:

హిందూ మతంలో, ఏకాదశి తిథి ఎంతో పవిత్రం. శ్రీహరి శరీరం నుండి ఏకాదశీ తిథి పుట్టిందని, అందువల్ల అది ఆ శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన తిథి అని అంటారు. ఈ తిథి తిథులన్నింటిలోకెల్లా ఉత్తమమైనది, అత్యంత పవిత్రమైన తిథిగా చెప్పబడింది. మాఘమాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అంటారు. భూమి ఏకాదశి మరియు భీష్మ ఏకాదశి అని కూడా పిలువబడే ఈ జయ ఏకాదశి నాడు విష్ణువును పూజించి ఉపవాసం ఉంటారు. విష్ణు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ తిథిని జరుపుకుంటారు. చాలా పవిత్రతతో ఉంటారు. 

ఈ సంవత్సరం ఫిబ్రవరి 1, 2023 న జయ ఏకాదశి వచ్చింది. ఫిబ్రవరి 1 రోజున భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి కాబట్టి, ఆ మరుసటి రోజు ద్వాదశిని భీష్మ ద్వాదశిగా పిలుస్తారు. జయ ఏకాదశి తిథి జనవరి 31 అర్ధరాత్రి నుండి ప్రారంభం అయింది అంటే.. ఇది బుధవారం, అర్థరాత్రి 1:53 గంటలకు ప్రారంభమై గురువారం రాత్రి 2.01 గంటల వరకు ఉంది.

ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. ఈ రోజున ఉపవాసం చేయడం వలన పూర్వ జన్మలో చేసిన పాపాలతో సహా అన్ని పాపాలూ తొలగిపోతాయి. ఈ రోజున ఉపవాసం చేస్తే అశ్వమేధ యాగం వంటి గొప్ప యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి అనేక మంది ఈ తిథి రోజు ఉపవాసం చేసేందుకు మొగ్గు చూపుతారు. తమకు ఎటువంటి పాపం ఉండకూడదని భావిస్తూ ఉంటారు. 

‘జయ ఏకాదశి’ ప్రాముఖ్యత

పద్మ పురాణం ప్రకారం, జయ ఏకాదశి రోజున మాల్యవాన్ అనే గంధర్వుడు, పుష్పవతి అనే అప్సరస స్వర్గంలో నృత్యం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నప్పుడు మోహానికి గురయ్యి, వారి నృత్యం, గానం లయ తప్పాయి. దీనితో ఆగ్రహించిన ఇంద్రుడు వారిద్దరినీ శపించాడు. మాల్యవాన్, పుష్పవతులను పిశాచాలుగా మార్చి హిమాలయాలకు పంపారు. వారికి తిండిలేక చలికి నిద్ర పట్టలేదు. వాళ్ళిద్దరూ బాధలో ఉండటం వల్ల ఆకలి వేయలేదు. అందువల్ల ఉపవాసం ఉన్నారు. అలా వారికి తెలియకుండానే జయ ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం వల్ల వారు తమ స్వీయ రూపాన్ని తిరిగి  పొందగలిగారు. కావున ఆ రోజున అందరూ ఉపవాసం ఉండాలని నిర్ణయించుకుంటారు. 

ఈ భీష్మ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని సక్రమంగా పూజించాలి. ఈ రోజు స్నానం చేసిన తర్వాత, విష్ణువు కోసం ఉపవాసం చేసి  నీరు సమర్పించాలి. పండ్లు, పసుపు, పువ్వులలో పూజ చేయాలి. ఈ రోజున ఎవరైతే  విష్ణువుకు ఇష్టమైన తులసీ దళాలతో పూజ చేస్తారో, వారికి ధనధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయి. ఆ తరువాత, హారతి ఇచ్చి, జయ ఏకాదశి కథను విని, రోజంతా హరి నామస్మరణతో గడపాలి. ఆ రోజున దీనులకు, పేదవారికి ఆహారం, దుస్తులు మొదలైనవాటిని దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది.