కిడ్నీలో రాళ్ళా? ఈ జాగ్రత్తలు పాటించండి

కిడ్నీలు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం మన బాధ్యత ఎందుకంటే… శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటి పనితీరులో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడినా ఇబ్బందులు తప్పవు. సున్నితమైన మూత్రపిండాలను రక్షించడానికి ఎక్కువ నీరు త్రాగాలి. కిడ్నీలో రాళ్ళు రావడం బాధాకరంగా ఉంటుంది. అయితే రాళ్ళు ఉన్నట్లు ముందుగానే తెలుసుకుంటే సాధారణంగా శాశ్వత నష్టం జరగదు. మీ పరిస్థితిని […]

Share:

కిడ్నీలు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం మన బాధ్యత

ఎందుకంటే… శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటి పనితీరులో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడినా ఇబ్బందులు తప్పవు. సున్నితమైన మూత్రపిండాలను రక్షించడానికి ఎక్కువ నీరు త్రాగాలి.

కిడ్నీలో రాళ్ళు రావడం బాధాకరంగా ఉంటుంది. అయితే రాళ్ళు ఉన్నట్లు ముందుగానే తెలుసుకుంటే సాధారణంగా శాశ్వత నష్టం జరగదు. మీ పరిస్థితిని బట్టి, కిడ్నీ స్టోన్‌ పడిపోయే సమయంలో నొప్పి మందులు తీసుకోవడం, చాలా నీరు త్రాగడం కంటే మీకు మరేమీ అవసరం లేదు. అయితే కొన్ని ఇతర సందర్భాలలో- ఉదాహరణకు, మూత్ర నాళంలో రాళ్ళు పేరుకుపోయినా, యూరినరీ ఇన్ఫెక్షన్‌ ఉన్నా.. శస్త్రచికిత్స అవసరం కావచ్చు.

తక్కువ నీరు తాగేవారిలో కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రాళ్ళు వివిధ పరిమాణాలలో వస్తాయి. లవణాలు, ఖనిజాలు, కాల్షియం, యూరిక్ యాసిడ్ కిడ్నీలో పేరుకుపోయి గట్టి రాళ్ళుగా రూపాంతరం చెందుతాయి. వీటినే కిడ్నీ స్టోన్స్ అంటారు. కిడ్నీ స్టోన్స్ మూత్ర విసర్జనలో సమస్యలను కలిగిస్తాయి. చిన్న రాళ్ళు మూత్రం ద్వారా వెళ్ళటం పెద్ద సమస్య కాదు. కానీ పెద్ద రాళ్ళు పోయేటప్పుడు మాత్రమే తీవ్రమైన నొప్పి వస్తుంది. 

మరి, కిడ్నీలో రాళ్ళను ఎలా గుర్తించాలి?

  • మీకు నడుము వైపు లేదా వెనుక భాగంలో తరచుగా నొప్పి ఉంటే, మీరు మూత్రపిండాల్లో రాళ్ళను అనుమానించాలి, వైద్యుడిని సంప్రదించాలి.
  • మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి వచ్చినా, మంట వచ్చినా కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతున్నట్లు గుర్తించాలి.
  • మూత్రంలో రక్తం వస్తూ ఉంటే, మీరు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. ఇది మూత్రపిండాల్లో రాళ్ళు లేదా ఇతర తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు.
  • అత్యవసరంగా మూత్ర విసర్జన చేయడం కిడ్నీలో రాళ్ళకు సంకేతంగా భావించాలి.
  • మూత్రంలో దుర్వాసన వస్తుంటే కిడ్నీలో రాళ్ళ సమస్యగా అనుమానించాలి.

కిడ్నీలో రాళ్ళను శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు. అయితే, కొన్ని సహజ పద్ధతులు కూడా రాళ్ళను బయటకు పంపుతాయి. కనుక..

ఎక్కువ నీరు త్రాగండి: 

మీరు ఎంత ఎక్కువ నీరు తాగితే, మీ కిడ్నీలకు అంత మంచిది. ఇది కిడ్నీలు ఖనిజాలు, ఇతర మలినాలను విసర్జించడం సులభం చేస్తుంది. మూత్రపిండాలకు హాని కలిగించే అనవసర వ్యర్థాలను బయటకు పంపడానికి నీరు సహాయపడుతుంది. కిడ్నీలో రాళ్ళతో బాధపడేవారు మూత్రం ద్వారా రాళ్ళను బయటకు తీయడానికి నీటిని తాగుతారు. రోజూ 7-8 గ్లాసుల నీరు త్రాగాలి.

యాపిల్ సిడార్ వెనిగర్: 

ఇందులోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్ళను చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. మూత్రాశయం ద్వారా రాళ్ళను పంపడానికి సహాయపడుతుంది. యాపిల్ సిడార్ వెనిగర్ తీసుకోవడం వల్ల కిడ్నీలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్‌ను గోరువెచ్చని నీటితో కలిపి రాళ్ళను తొలగించే వరకు తీసుకోవడం మంచిదని సిఫార్సు చేస్తారు.

చిక్కుడుకాయలు:

చిక్కుడుకాయలు కిడ్నీలో రాళ్ళను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. చిక్కుడుకాయలు ఉడకబెట్టడానికి ముందు 8 నుండి 12 గంటల పాటు నీటిలో నానబెట్టండి. చిక్కుడుకాయలలోని ఫైబర్ మూత్రపిండాల్లో రాళ్ళను బయటకు పంపడంలో సహాయపడుతుంది. వీటిని రోజుకు ఒక్కసారైనా తీసుకోండి.

ఎండిన తులసి ఆకులు: 

ఎండిన తులసి ఆకులను పొడిగా రుబ్బుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పొడిని నీటిలో కలిపి టీ తయారు చేయండి. ఈ టీని రోజుకు మూడు సార్లు త్రాగాలి. ఇది కడుపులోని ఎసిటిక్ యాసిడ్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. దీని వల్ల కిడ్నీలో రాళ్ళు కూడా పగిలి తేలికగా బయటకు వస్తాయి.

మొక్కజొన్న జుట్టు: 

మొక్కజొన్న కండి చుట్టూ ఉండే బంగారు రంగు తీగలనే మొక్కజొన్న జుట్టు అంటాము. వీటిని మనం మొక్కజొన్న కండిని శుభ్రం చేసేటప్పుడు తీసిపారేస్తాం. కానీ కిడ్నీలో రాళ్ళను తొలగించడంలో ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయి. వాటిని నీటిలో మరిగించి, చల్లార్చి త్రాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో కొత్త రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. ఇది మూత్రవిసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కిడ్నీలో రాళ్ళ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడంలో మొక్కజొన్న జుట్టు ఉపయోగపడుతుంది.

నిమ్మరసం, ఆలివ్ నూనె: 

నిమ్మరసం, ఆలివ్ నూనెల మిశ్రమం మూత్రపిండాల్లో రాళ్ళను తొలగించడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిమ్మరసం మూత్రపిండాల్లో రాళ్ళను విచ్ఛిన్నం చేస్తే, ఆలివ్ నూనెను లూబ్రికెంట్‌గా ఉపయోగించడం ద్వారా వాటిని సులభంగా బయటకు పంపవచ్చు.

దానిమ్మ: 

దానిమ్మ రసం శరీరాన్ని హైడ్రేట్‌‌గా ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కిడ్నీలో రాళ్ళను సహజంగా తొలగించడంలో దానిమ్మ రసం శక్తివంతమైనది.

మీరు కిడ్నీలో రాళ్ళతో బాధపడుతున్నట్లయితే, ఈ పై జాగ్రత్తలు తీసుకొని ఆ సమస్యను అధిగమించడానికి ప్రయత్నించండి.