కిడ్నీల ఆరోగ్యానికి అధ్బుతమైన ఆయుర్వేద మూలికలు..

కిడ్నీలు మనిషి శరీరంలో చాలా ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టూ ముడతాయి. మనం కిడ్నీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి వాటి పనితీరు మెరుగుపరచడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు అద్భుతంగా ప్రభావం చూపుతాయని ఆయుర్వేదం తెలుపుతోంది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు, లేదంటే ఆ సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ ఐదు రకాల ఆయుర్వేదిక మూలికలు […]

Share:

కిడ్నీలు మనిషి శరీరంలో చాలా ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టూ ముడతాయి. మనం కిడ్నీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి వాటి పనితీరు మెరుగుపరచడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు అద్భుతంగా ప్రభావం చూపుతాయని ఆయుర్వేదం తెలుపుతోంది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు, లేదంటే ఆ సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ ఐదు రకాల ఆయుర్వేదిక మూలికలు ఎంతో మేలు చేస్తాయి.. అవెంటంటే.. 

అల్లం: 

అల్లం లేని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. అల్లంలోని ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కిడ్నీ ఇన్ఫెక్షన్లతో సంబంధం ఉన్న నొప్పి, వాపుని తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అల్లం ఒక ప్రయోజనకరమైన హెర్బ్. ఇది రక్తాన్ని శుద్ధికరణ చేయడం, జీర్ణవ్యవస్థను, రక్తంలో ఆక్సిజన్లో మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఉదర సంబంధిత అన్ని సమస్యలను నయం చేయడానికి అల్లం బెస్ట్ హెర్బ్. 

త్రిఫల: 

త్రిఫల అంటే ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమం. ఈ త్రిఫల కిడ్నీల పనితీరును మెరుగుపరచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో త్రిఫల చూర్ణాన్ని వేసుకొని గనుక తాగితే కిడ్నీ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. అలాగే కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా చేయడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది. మూత్రపిండాల కణజాలాలను బలపరుస్తుంది. మెరుగైన ప్లాస్మా ప్రోటీన్లు, అల్బుమిన్, క్రియేటినిన్ ను వృద్ది చేస్తుంది.

పసుపు: 

పసుపు లో యాంటీ ఇన్ఫ్లమేటరీ,  యాంటీ వైరల్, యాంటీ కార్సినోజనిక్ గుణాలు ఉన్నాయి. ఈ పసుపును మనం రోజువారి వంటలలో వేసుకుంటే అన్ని రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారిలో T2DM రోగులలో ప్లాస్మా ప్రోటీన్ లను మెరుగుపరుస్తుంది. రక్తంలో యూరియా, క్రియేటినిన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

తిప్పతీగ:

ఆయుర్వేద వైద్యంలో తిప్పతీగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తిప్పతీగలో ఉండే ఆల్కలాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అప్లాటాక్సీకోసిన్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను నియంత్రిస్తుంది. ఫలితంగా కిడ్నీలు దెబ్బ తినకుండా చేస్తుంది. ఇది కాలేయం నుండి మూత్రపిండాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన విషవ్యర్ధాలను కూడా బయటకు నెట్టి వేస్తుంది.

అటిక మామిడి తీగ:

అధిక మామిడి తీగ కూడా కిడ్నీలో రాళ్లు కరిగించడానికి చక్కగా పనిచేస్తుంది. ఈ ఆకుల కషాయాన్ని తయారు చేసుకుని ప్రతిరోజు కనుక తాగితే కిడ్నీ సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. లక్షలు పోసిన నయం కానీ జబ్బులను అటిక మామిడి కషాయం తగ్గిస్తుంది. అటిక మామిడి తీగను సమూలంగా తీసుకోవాలి. అంటే పువ్వులు, కాయలు, ఆకులు వేళ్ళతో సహా తీసుకోవాలి. వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ నీటిలో వీటన్నింటినీ వేసి బాగా మరిగించాలి. మీరు బాగా మరిగాక ఒక గ్లాసులోకి వడపోసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని ఉదయం పరగడుపున తాగాలి. ఈ కషాయం తాగితే కిడ్నీలో రాళ్లు తగ్గుతాయి. ఆపరేషన్ తో అవసరమే లేకుండా చేస్తుంది. ఈ కషాయానికు అంతటి శక్తి ఉందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.  కాకపోతే వారి సలహా మేరకు మాత్రమే ఈ కషాయాన్ని తీసుకోవాలి.