ముందుగా గుర్తిస్తే కిడ్నీ వ్యాధులను నయం చేసుకోవచ్చని చెప్పిన ఢిల్లీ నిపుణులు

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాలలో మూత్రపిండాలు (కిడ్నీలు) కూడా ఒకటి. ఇవి ప్రాథమికంగా రక్తాన్ని శుద్ధి చేస్తాయి. శరీరంలోని నీటి సమతుల్యతను నిర్వహిస్తాయి. లక్షల మంది కిడ్నీ వ్యాధుల భారీన పడుతున్నామన్న సంగతి తెలియకుండా జీవితాన్ని గడిపేస్తున్నారు. అందుకే కిడ్నీ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం ఒకటే దీనిని గుర్తించడానికి సరైన మార్గం. కిడ్నీ వ్యాధులను కొన్ని లక్షణాల వలన మనం ముందుగానే గుర్తించవచ్చు. కిడ్నీలు పాడైపోతున్నాయన్న […]

Share:

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాలలో మూత్రపిండాలు (కిడ్నీలు) కూడా ఒకటి. ఇవి ప్రాథమికంగా రక్తాన్ని శుద్ధి చేస్తాయి. శరీరంలోని నీటి సమతుల్యతను నిర్వహిస్తాయి. లక్షల మంది కిడ్నీ వ్యాధుల భారీన పడుతున్నామన్న సంగతి తెలియకుండా జీవితాన్ని గడిపేస్తున్నారు. అందుకే కిడ్నీ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం ఒకటే దీనిని గుర్తించడానికి సరైన మార్గం. కిడ్నీ వ్యాధులను కొన్ని లక్షణాల వలన మనం ముందుగానే గుర్తించవచ్చు. కిడ్నీలు పాడైపోతున్నాయన్న సంగతి తెలిపేలా ముందుగా ఏ లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి అలవాట్లను మానుకోవాలో? ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ హెచ్‌ఓడి (నెఫ్రాలజీ) డాక్టర్ హిమాన్షు వర్మ చెప్పిన పలు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మూత్రపిండ వ్యాధులను నివారించటానికి గల కారణాలను మార్గాలను, అన్వేషించేందుకు.. ఆరు రోజులపాటు జరిగిన చర్చల తర్వాత ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ హెచ్‌ఓడి డాక్టర్ హిమాన్షు వర్మ  పలు విషయాలను తెలిపారు. కిడ్నీ వ్యాధులు వచ్చే ముందే కొన్ని సంకేతాలను ఇస్తాయని, వాటిని ముందుగా గ్రహిస్తే.. కిడ్నీ ఫెయిల్యూర్ ను అధిగమించవచ్చని తెలిపారు. రక్తపోటు ఉన్న రోగులకు కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపారు. క్రానిక్ కిడ్నీ డిసీస్ లో కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అనే అంశాన్ని కూడా వాళ్ళు పరిశీలించిన తరువాత, బాడీ మాస్ ఇండెక్స్ 20 నుంచి 25 మధ్య ఉంచుకోవాలని సూచించారు. వారానికి ఐదు రోజులపాటు ప్రతిరోజు 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలని సూచించారు. అలాగే నొప్పి నివారణ మందులు వాడటాన్ని తగ్గించాలని చెప్పారు. నీటిని సమతుల్యంగా తీసుకోవడం, ధూమపానం మానేయటం చేయాలని.. ఇవి కిడ్నీ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచే మార్గాలని తెలిపారు. ఆరు రోజుల సుదీర్ఘ చర్చల ఫలితం ఇది అని వారు తెలిపారు. 

లక్షణాలు

కిడ్నీలు పాడైపోతున్నాయి.. వాటి పనితీరు సక్రమంగా లేదంటే వారికి ముందుగా అలసట, నీరసం ఎక్కువగా ఉంటుంది. రక్తంలో విషపదార్థాలు, మలినాలు చేరడం వల్ల మూత్రపిండాలు బలహీనంగా ఉండి, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి. అధిక బరువు, షుగర్, రక్తపోటు కూడా రావచ్చు, ఆకలి మందగిస్తుంది. రుచి తెలియదు. ఉదయం పూట వికారంగా ఉండటం, వాంతులు రావడం కూడా కిడ్నీల పనితీరు క్షీణించడానికి తెలిపే ప్రాథమిక లక్షణాలు. రక్తహీనత, రాత్రి సమయంలో ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వచ్చినా, లేదంటే మూత్ర విసర్జన తక్కువగా చేయటం కూడా..  కిడ్నీల పనితీరు మందగించిందని చెప్పవచ్చు. మూత్రంలో రక్తం పడడం, నురగతో కూడిన మూత్రం రావడం, చర్మం పొడిబారడం, దురద రావటం, చర్మం నుంచి దుర్వాసన రావడం , వెన్ను నొప్పి, పొత్తికడుపు నొప్పి వంటి సంకేతాలన్నీ కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నామని మన శరీరం మనకు సూచించే సంకేతాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. 

కిడ్నీ సమస్యలకు కారణమయ్యే అలవాట్లు..

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఉప్పులో ఉండే సోడియం, పొటాషియం రక్తపోటును పెంచుతుంది. ఇది మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని పెంచుతుంది. మాంసాహారంలో తగిన ప్రోటీన్ ఉంటుంది. అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల కూడా జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చి కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. డ్రగ్స్ వంటివి తీసుకోవడం వలన కిడ్నీలపై చెడు ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ అధికంగా, క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాలపై చెడు ప్రభావం చూపుతుంది. కూల్ డ్రింక్స్ కూడా హానికరమే. ధూమపానం కిడ్నీలకు హాని కలిగిస్తుంది. సాధారణంగా వచ్చే మూత్రాన్ని ఆపినా కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. అవసరాన్ని మించి నీళ్లు తాగినా కూడా కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కువగా తినడం, నిద్రలేమి సమస్యలు కూడా కిడ్నీ వ్యాధులకు కారణం అవుతాయి.