టెంపరరీ జాబ్ తో హెల్త్ రిస్క్..!

కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌చే ది జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ కమ్యూనిటీ రిపోర్ట్స్‌లో ఒక రీసెర్చ్ ప్రకారం, టెంపరరీ ఉద్యోగాలతో ఇన్ సెక్యూరిటీ బారినపడుతున్న వారి సంఖ్యలో, అధికంగా హెల్త్ రిస్క్ ఉండటంతో పాటుగా.. త్వరగా సంభవించే మరణాల బారినపడుతున్నట్లు వెల్లడయింది. స్వీడన్‌లో ఉద్యోగ భద్రత మరింత మెరుగుపరిచేందుకు చేసిన రీసెర్చ్ ఇది. రిస్క్ అయిన జాబుతో, హెల్త్ రిస్క్ తప్పదు:  అంటే నిజానికి టెంపరరీ ఉద్యోగాల వంటివి, కాంట్రాక్ట్ వర్క్, తక్కువ జీతానికి పనిచేయడం వంటి ఉద్యోగాలన్నీ […]

Share:

కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌చే ది జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ కమ్యూనిటీ రిపోర్ట్స్‌లో ఒక రీసెర్చ్ ప్రకారం, టెంపరరీ ఉద్యోగాలతో ఇన్ సెక్యూరిటీ బారినపడుతున్న వారి సంఖ్యలో, అధికంగా హెల్త్ రిస్క్ ఉండటంతో పాటుగా.. త్వరగా సంభవించే మరణాల బారినపడుతున్నట్లు వెల్లడయింది. స్వీడన్‌లో ఉద్యోగ భద్రత మరింత మెరుగుపరిచేందుకు చేసిన రీసెర్చ్ ఇది.

రిస్క్ అయిన జాబుతో, హెల్త్ రిస్క్ తప్పదు: 

అంటే నిజానికి టెంపరరీ ఉద్యోగాల వంటివి, కాంట్రాక్ట్ వర్క్, తక్కువ జీతానికి పనిచేయడం వంటి ఉద్యోగాలన్నీ కూడా హెల్త్ కి రిస్క్ తెప్పించే ఉద్యోగాల జాబితాలోకి వస్తాయంటున్నారు నిపుణులు. అయితే అధికంగా ఇటువంటి ఉద్యోగాలు చేసేవారిలో ఆరోగ్యానికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని, డిప్రెషన్ అనారోగ్య సమస్యలు వంటి బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రీసెర్చ్ లో తేలింది. 

ప్రస్తుత రీసెర్చ్ ప్రకారం, జాబ్ ఇన్ సెక్యూరిటీ అనేది మరణ ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశోధకులు పరిశీలించారు. కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ మెడిసిన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్, థియో బోడిన్ మాట్లాడుతూ, అయితే టెంపరరీ జాబ్ నుంచి పర్మినెంట్ జాబ్ కి మారిన వ్యక్తులలో హెల్త్ తగ్గే అవకాశం ఉంటుందని రీసెర్చ్ ద్వారా తేలింది అన్నారు. సురక్షితమైన ఉపాధి ఒప్పందం లేకుండా ఉద్యోగాలలో పని చేస్తూనే ఉంటే, అకాల మరణం సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ముఖ్యంగా చెప్పారు.

పరిశోధకులు స్వీడన్‌లోని 20 మరియు 55 సంవత్సరాల మధ్య వయస్సు గల 2,50,000 మంది ఉద్యోగుల నుండి 2005 నుండి 2017 వరకు సేకరించిన రిజిస్ట్రీ డేటాను ఉపయోగించారు. ఈ రీసర్చ్ లో టెంపరరీ జాబ్ లో పనిచేసే, పర్మినెంట్ జాబ్ కి మారిన వారు ఉన్నారు. టెంపరరీ ఉద్యోగంలో ఉండిపోయిన వారితో పోలిస్తే, పర్మినెంట్ జాబ్ కి మారిన వారిలో, అకాల మరణం సంభవించే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.  అంటే సగటు మనిషి 12 సంవత్సరాలు సురక్షితమైన ఉపాధిలో ఉంటే, అకాల మరణ ప్రమాదం 30 శాతం తగ్గింది. 

పర్మినెంట్ జాబ్ కొట్టాల్సిందే: 

అయితే వారిలో ముఖ్యంగా అధికంగా వ్యాధులతో బాధపడేవారు, వయసు మీద పడిన వారు, విడాకులు తీసుకున్న వారు కూడా ఉన్నారని అదే ఇన్‌స్టిట్యూట్‌లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ నూరియా మాటిల్లా-శాంటాండర్ వివరించారు. స్వీడన్‌లో అకాల మరణాలకు ముఖ్యంగా టెంపరరీ జాబుల కారణంగా నిరాశతో బాధపడుతున్న వారు కారణం. అయితే అకాల మరణాలు సంఖ్య తగ్గించాలంటే టెంపరరీ జాబుని విడిచిపెట్టి.. పర్మినెంట్ జాబ్ చూసుకోవడం సరైన మార్గం అని రీసెర్చ్ వెల్లడించింది. 

అంతే కాకుండా పర్మినెంట్ జాబ్ తెచ్చుకునేందుకు ఒక సంవత్సరం కష్టపడినప్పటికీ, అకాల మరణాల రిస్క్ తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, కష్టపడి జాబ్ తెచ్చుకోవడం మేలు అంటున్నారు. టెంపరరీ ఉద్యోగాల ఊబిలో ఉంటే ఎప్పటికైనా రిస్క్ తప్పదు. అందుకే అకాల మరణాల రిస్కు నుంచి బయటపడాలంటే తప్పకుండా, టెంపరరీ జాబ్ నుంచి పర్మినెంట్ జాబ్ కి మారడం ఎంతో ఉత్తమంటున్నారు నిపుణులు. చిన్నతనం నుంచే చక్కని ప్రణాళిక వేసుకుని ఒక చక్కని పెర్మనెంట్ జాబ్ తెచ్చుకుంటే అంతకంటే చక్కని మార్గం మరొకటి ఉండదు.

ఈ విషయంలో మరణాలకు గల నిర్దిష్ట కారణాలను పరిశీలించడం పరిశోధన యొక్క తదుపరి దశ అని డాక్టర్ మాటిల్లా-శాన్‌టాండర్ చెప్పారు. ఈ రీసెర్చ్ కి ప్రధానంగా స్వీడిష్ రీసెర్చ్ కౌన్సిల్ ఫర్ హెల్త్, వర్కింగ్ లైఫ్ అండ్ వెల్ఫేర్ (ఫోర్టే) నిధులు సమకూర్చింది.