బెల్లం నీళ్ళను ఇలా తాగండి.శరీరంలో రక్తహీనతను, బరువును కూడా తగ్గించుకోండి.

బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని నీళ్లలో కలిపి తాగితే బరువు తగ్గడంతోపాటు జీవక్రియలు పెరగడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి బెల్లం నీటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా సరైన పోషకాహారం తీసుకోనివారికి లేదా చాలా రోజులుగా ఏదైనా అనారోగ్యంతో ఉన్నవారికి రక్తహీనత ఉంటుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గుతాయి. రక్తహీనత ఉన్నవారిలో కళ్ళు తిరిగినట్టు ఉండడం, నీరసంగా ఉండడం, కళ్ళ కింద నల్లటి వలయాలు రావడం ఇంకా మరికొన్ని ఇతర లక్షణాలు […]

Share:

బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని నీళ్లలో కలిపి తాగితే బరువు తగ్గడంతోపాటు జీవక్రియలు పెరగడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి బెల్లం నీటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

సాధారణంగా సరైన పోషకాహారం తీసుకోనివారికి లేదా చాలా రోజులుగా ఏదైనా అనారోగ్యంతో ఉన్నవారికి రక్తహీనత ఉంటుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గుతాయి. రక్తహీనత ఉన్నవారిలో కళ్ళు తిరిగినట్టు ఉండడం, నీరసంగా ఉండడం, కళ్ళ కింద నల్లటి వలయాలు రావడం ఇంకా మరికొన్ని ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి.  అంతే కాకుండా ఎటూ  నడిచేందుకు వారికి ఓపిక కూడా ఉండదు. అందుకోసమే రక్తహీనత రాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతారు. 

రక్తహీనత శరీరాన్ని బలహీనంగా మార్చి, ఇతర అనారోగ్యాలు రావడానికి కారణం అవుతుంది. డాక్టర్లు మంచి ఫలితాలు రావడం కోసం పౌష్టికాహారం తీసుకుని ఐరన్ సప్లిమెంట్లు వాడమని సూచిస్తారు. అయితే పౌష్టికాహారంతో పాటుగా బెల్లం నీళ్ళు కూడా తీసుకుంటే, మీరు రక్తహీనత కోసం ఇక మందులు వాడాల్సిన అవసరమే ఉండదు. బెల్లం నీళ్లు ప్రతి ఒక్కరికీ చాలా చవకగా దొరుకుతాయి కాబట్టి వేలకు వేలు ఆసుపత్రులలో ఖర్చు చేసే బదులు బెల్లం నీటిని తాగడం వలన అనేక ప్రయోజనాలుంటాయి. 

బెల్లం నీళ్లు రక్తహీనతకు అద్భుతమైన ఔషధంలా పనిచేస్తాయి. బెల్లంలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గోరువెచ్చని నీటిలో బెల్లం కలుపుకుని తాగితే మన శరీరంలోని హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. మన శరీర జీవక్రియకు కూడా తోడ్పాటు అందుతోంది. 

బెల్లం నీళ్లు రక్తహీనతకు చెక్ పెట్టడంతో పాటు, ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారిన ఒబేసిటీని కూడా తగ్గిస్తాయి. ఈ బెల్లపు నీళ్లు మన శరీరంలో జీవక్రియను మెరుగు పరుస్తాయి. అదేవిధంగా ఎసిడిటీ కూడా తగ్గుతుంది. అంతే కాకుండా కడుపులోని యాసిడ్స్‌ తగ్గడం వల్ల బరువు కూడా తగ్గుతారు.  చవకగా లభించే బెల్లం నీళ్ల వలన ఇన్ని ప్రయోజనాలున్నాయి. 

హై బీపీని కంట్రోల్ చేస్తుంది

బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని రక్తపోటుని తగ్గించి హైపర్ టెన్షన్ రాకుండా చేస్తుంది. మిమ్మల్ని సుఖ: సంతోషాలతో ఉండేలా చేస్తోంది. 

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

బెల్లంలో ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్, జింక్ మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బెల్లంలో ఇవన్నీ ఉండడం వల్ల, బెల్లం నీళ్లు తాగితే కాలం మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు, జ్వరం, కఫం, ఇన్ఫెక్షన్ల వంటివి తగ్గుతాయి. 

బెల్లం నీళ్ళు ఎవరు తాగకూడదు? 

డయాబెటిస్ ఉన్నవాళ్లు బెల్లం నీళ్లు తాగకూడదు. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా తొందరగా పెరిగిపోతాయి. బెల్లం నీళ్లు మరీ ఎక్కువగా కూడా తాగకూడదు. మరీ ముఖ్యంగా జీర్ణవ్యవస్థలో సమస్యలు ఉన్నవాళ్లు తక్కువగా తాగాలి. దంతాలు బలహీనంగా ఉన్న వాళ్ళు, దంత క్షయం ఉన్నవాళ్లు కూడా బెల్లం నీళ్లు తాగకపోవడం మంచిది. 

చూశారా! బెల్లం నీళ్ల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో! ఇక ఆలస్యం దేనికి.. ఈ చిట్కా పాటించి, ఆరోగ్యంగా ఉండండి. మరి మీరు తెలుసుకున్న ఈ చిట్కాను మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి.