డయాబెటిస్ కోసం డైట్: మీకు డయాబెటిస్ ఉందా?మీరు డయాబెటిక్ అయితే ఈ 5 ఆహార పదార్థాలు తీసుకుంటూ ఆరోగ్యంగా జీవించండి.

ఆహారం విషయంలో జిహ్వచాపల్యాన్ని నియంత్రించుకోవడం, కొన్ని రోజుల పాటు మీ వ్యాయామ దినచర్యను దాటవేయడం చాలా కష్టం – మీ క్యాలరీలను నిర్వహించడానికి ఒక చిన్న, సులభమైన దశ ఆరోగ్యకరమైన స్నాక్స్ గురించి తెలుసుకుందాం. మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రయాణించేటప్పుడు తినవలసిన ఆహారాలు ‘విహారయాత్ర’ అనేది మాటలలో వివరించలేని అద్భుతమైన అనుభూతి. అయితే.. ప్రయాణంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. ప్రయాణంలో ఉన్నప్పుడు, మనకి దొరికేవేవో  తినేస్తాం, నిజానికి ఇది మంచిది కాదు. మనలో చాలా మంది […]

Share:

ఆహారం విషయంలో జిహ్వచాపల్యాన్ని నియంత్రించుకోవడం, కొన్ని రోజుల పాటు మీ వ్యాయామ దినచర్యను దాటవేయడం చాలా కష్టం – మీ క్యాలరీలను నిర్వహించడానికి ఒక చిన్న, సులభమైన దశ ఆరోగ్యకరమైన స్నాక్స్ గురించి తెలుసుకుందాం.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రయాణించేటప్పుడు తినవలసిన ఆహారాలు

‘విహారయాత్ర’ అనేది మాటలలో వివరించలేని అద్భుతమైన అనుభూతి. అయితే.. ప్రయాణంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. ప్రయాణంలో ఉన్నప్పుడు, మనకి దొరికేవేవో  తినేస్తాం, నిజానికి ఇది మంచిది కాదు. మనలో చాలా మంది జాగ్రత్తలను గాలికి వదిలేస్తారు. లేదా.. కొన్ని సార్లు మనకు వేరే అవకాశం ఉండకపోవచ్చు. కానీ రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో సమోసాలు, పరాటాలు, చీజ్ శాండ్‌విచ్‌ లాంటివి తింటే.. ఆ రోజు కేలరీల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. ఇలా రోడ్డు పక్కన దొరికే ఆహారం పట్ల చపలత్వం తగ్గించుకోవడం, కొన్ని రోజుల పాటు వ్యాయామం మానివేయకుండా ఉండటం అంత సులభం కానప్పటికీ.. మీ క్యాలరీలను, ఆహారాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి ఒక చిన్న, సులువైన ఆరోగ్యకరమైన అలవాటు ఏంటంటే.. మంచి స్నాక్స్ అందుబాటులో ఉంచుకోవటం!

ఈసారి మీరు మీ విహారయాత్రకి వెళ్ళడానికి ప్లాన్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ప్యాక్ చేసి ఉంచుకోవాల్సిన 5 ఆహార పదార్థాలు ఇవి.

ఆహారాల జాబితా

బాదం –

బాదం ఒక గొప్ప జర్నీ స్నాక్స్ అవుతుంది! దీనిలో డైటరీ ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం, విటమిన్ బి12తో సహా మంచి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అనుకూలమైన, ఆరోగ్యకరమైన చిరుతిండి. ఎందుకంటే మీరు మీ బ్యాగ్‌లో ఒక గుప్పెడు బాదం గింజలు సులభంగా ఉంచుకోవచ్చు. ప్రయాణంలో మీకు ఆకలిగా అనిపించినప్పుడల్లా వాటిని తినవచ్చు.

ఓట్ మీల్ –

మీకు రుచికరమైన ఆహారం కావాలని ఆరాటపడినప్పుడు, మీ ఆరోగ్యంతో రాజీ పడకూడదనుకున్నప్పుడు మీకు ఉపయోగపడేది ఒక సర్వింగ్ ఓట్ మీల్. అందుబాటులో ఉండే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో ఒకటి ఓట్స్. ఓట్స్ లో డైటరీ ఫైబర్‌లు ఎక్కువ. మంచి రుచి, చక్కెర తక్కువగా ఉండే కొన్నిరకాల ఓట్ మీల్ కప్పులు దొరుకుతాయి. అవి ఎక్కడైనా తీసుకోవచ్చు.  అంటే అవి తక్షణమే అందుబాటులో ఉంటాయి. వాటిని ప్యాక్ చేయడం సులభం. వీటిని  ఉడికించడానికి కొంచెం వేడినీరు ఉంటే చాలు. 

సలాడ్లు-

మీరు ప్రయాణమయ్యేటప్పుడు మీ సామాను సర్దుకున్నట్లే, ప్రయాణానికి ముందు ఒక రాత్రి సలాడ్‌ తయారు చేసి పెట్టుకోవడం మంచిది. అవి ఆరోగ్యకరమైన స్నాక్స్. మీరు చాలా దూరం, కొద్ది దూరం ప్రయాణిస్తున్నట్లయితే కొన్ని గంటల పాటు నిల్వ ఉండేలా చేయవచ్చు. మొక్కజొన్న, క్యారెట్, బ్రోకలీ, టొమాటోలు లేదా మామిడి ముక్కలను ముదురు ఆకు కూరలతో కలిపి సూపర్ ఎనర్జీనిచ్చే ఈ స్నాక్స్ తయారు చేయండి. అయితే డ్రెస్సింగ్‌లకు దూరంగా ఉండండి. మీరు తినడానికి ముందు సలాడ్‌ని నిమ్మకాయ ముక్కతో కొంచెం ఉప్పు, మిరియాలు కలిపి ప్యాక్ చేయవచ్చు.

గుడ్లు –

ఆరోగ్యకరమైన, అసలు కష్టపడకుండా తయారు చేయగలిగే ఆహారం ఉడికించిన గుడ్లు. గుడ్డులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఎందుకంటే దీనిలో పుష్కలంగా ప్రోటీన్లు ఉంటాయి. అలాగే, ఈ గుడ్లని సులువుగా తీసుకొని వెళ్ళవచ్చు. వీటిని తీసుకున్న తరువాత ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్నట్లుగా ఉంటుంది. 

పెరుగు –

సులభంగా లభించే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో ఒకటి  పెరుగు. దీనిని అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వంటి విత్తనాలతో ఒక గిన్నె పెరుగును కలుపవచ్చు. అంతేకాకుండా పెరుగు ఒక అసాధారణమైన ప్రోబయోటిక్. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మీ ఆంత్రాన్ని, పేగులను కాపాడుతుంది. 

అందువల్ల.. ఇవన్నీ తప్పనిసరిగా మీ ప్రయాణంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి.