Animals: దీపావళి రోజు ఆ జంతువులను చూస్తే..

Animals: హిందువులకు కొన్ని విషయాల మీద అనేక పట్టింపులు ఉంటాయి. నమ్మకాల (Traditions) విషయంలో ఎదుటి వారిని తక్కువ చేయడం మంచి పద్ధతి కాదు. కాబట్టి వారికి ఎటువంటి నమ్మకం (Belief) ఉంటే అటువంటి నమ్మకాన్ని వారు పాటించేలా మనం సైలెంట్ గా ఉండాలి. ఇక హిందువులకు (Hindus) ఉన్న నమ్మకాలు అన్నీ ఇన్నీ కావు. ఈ పనిని ఇలా చేయాలి. ఆ పనిని అలా చేయాలని అనేక విషయాల్లో పలు నమ్మకాలు ఉంటాయి. ఇక హిందూ […]

Share:

Animals: హిందువులకు కొన్ని విషయాల మీద అనేక పట్టింపులు ఉంటాయి. నమ్మకాల (Traditions) విషయంలో ఎదుటి వారిని తక్కువ చేయడం మంచి పద్ధతి కాదు. కాబట్టి వారికి ఎటువంటి నమ్మకం (Belief) ఉంటే అటువంటి నమ్మకాన్ని వారు పాటించేలా మనం సైలెంట్ గా ఉండాలి. ఇక హిందువులకు (Hindus) ఉన్న నమ్మకాలు అన్నీ ఇన్నీ కావు. ఈ పనిని ఇలా చేయాలి. ఆ పనిని అలా చేయాలని అనేక విషయాల్లో పలు నమ్మకాలు ఉంటాయి. ఇక హిందూ పండుగలు వచ్చినపుడు మనం కొన్ని రకాల జంతువులను (Animal) చూస్తే మంచి జరుగుతుందని కొన్ని రకాల జంతువులను(Animal)  అస్సలుకే చూడకూడదని కొంత మంది విశ్వసిస్తుంటారు. వీటి గురించి చెప్పేందుకు మనకు కొన్ని రకాల శాస్త్రాలు కూడా  అందుబాటులో ఉన్నాయి. ఆ శాస్త్రాల ప్రకారం.. కొన్ని విషయాలను కొన్ని విధాలుగా మాత్రమే చేయాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

వాస్తు శాస్త్రంలోనే.. 

మన ఇండియన్లు (Indians) ఎక్కువగా వాస్తు శాస్త్రాన్ని విశ్వసిస్తారు. వాస్తు శాస్త్రంలో కొన్ని కీటకాలు (Insects) మరియు జంతువుల (Animal)  ప్రస్తావన ఉంది. వీటిని చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. సాధారణ రోజులలో వాటిని గుర్తించడం సాధారణమే కావొచ్చు కానీ దీపావళి (Deepavali) రోజున వాటిని చూడటం వల్ల అదృష్టం వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అంతే కాకుండా లక్ష్మీదేవి (Laxmi mata) కూడా ఇంటికి చేరుకుందని విశ్వాసం. ఇందులో ఎలుకలు, బల్లులు, పుట్టుమచ్చలు, నల్ల చీమలు మరియు పిల్లులు ఉన్నాయి. దీపావళి రోజున సాయంత్రం పూట అన్ని తలుపులు తెరిచి ఉంచాలని ఇంటి పెద్దలు తరచుగా సలహా ఇవ్వడానికి కూడా ఇది కారణం. దీపావళి (Deepavali) రోజున ఇంట్లోకి ఎలుకలు, బల్లులు, నల్ల చీమలు, పిల్లులు రావాలని అనేక మంది శాస్త్రజ్ఞులు తెలుపుతారు. వారు ఎటువంటి జీవులను రావాలని చెబుతున్నారో. ఇక్కడ తెలుసుకుందాం. 

పిల్లి.. 

పిల్లులను (Cat) నేడు అనేక మంది పెంచుకుంటున్నారు. ఈ పిల్లుల (Cat) గురించి వాస్తు శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పడబడింది. ఇంట్లోకి పిల్లి(Cat) రావడం ఆర్థిక లాభానికి సంకేతంగా చెబుతారు. అందువల్ల దీపావళి రోజు రాత్రి పిల్లి (Cat) దర్శనం లక్ష్మీదేవి రాకను మరియు రాబోయే రోజుల్లో ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. 

బల్లి.. 

బల్లులను(Lizard) చూస్తే అనేక మంది భయపడిపోతారు. కానీ బల్లులు (Lizard) మాత్రం మనుషులకు ఎటువంటి హాని తలపెట్టవు. బల్లులంటే ప్రాణాపాయం అని ప్రజలు చెబుతారు. అయినప్పటికీ, దీపావళి రోజున బల్లి(Lizard) కనిపిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, పూజా మందిరం చుట్టూ బల్లి కనిపిస్తే, అది అదృష్టం తెస్తుందని నమ్మకం.  ఇది కూడా సమీప భవిష్యత్తులో డబ్బు సంపాదించడానికి సంకేతమట.. దీపావళి రోజు రాత్రి (Night) ఇంట్లో బల్లి కనిపిస్తే, లక్ష్మీ దేవి మిమ్మల్ని ఏడాది పొడవునా ఆశీర్వదిస్తుందని ఓ నమ్మకం.

నల్ల చీమ

దీపావళి రోజున ఇంట్లో నల్ల చీమలు (Black Ants) కనిపించడం కూడా చాలా సానుకూల సంకేతం. ఇంట్లో బంగారు వస్తువులను ఉంచిన ప్రదేశం నుంచి నల్ల చీమలు(Black Ants) ఉద్భవిస్తే, అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. సంపద పెరుగుతుందని ఇది సూచిస్తుందట. అదే సమయంలో, చీమలు( Ants) పైకప్పు నుంచి బయటకు వస్తే, త్వరలో ఆస్తి మరియు భౌతిక విషయాలలో పెరుగుదల ఉండవచ్చునని నమ్ముతారు. చీమలు చాలా సర్వసాధారణంగా ఇండ్లల్లో ఉంటాయి. కానీ ప్రత్యేకంగా దీపావళి రోజు అంటే ఇవి ఎక్కువగా కనిపించవు. 

గుడ్లగూబ

దీపావళి రోజు రాత్రి గుడ్లగూబ(Owl)ను చూసినట్లయితే, లక్ష్మీ దేవి స్వయంగా మీ ఇంటికి వచ్చిందని అర్థం. లక్ష్మీదేవి జ్ఞానం, అదృష్టం, సంపద, ఆరోగ్యం మరియు శ్రేయస్సును సూచిస్తుందని నమ్ముతారు. దీపావళి సందర్భంగా గుడ్లగూబ (Owl)ను చూడటం వల్ల ఇంట్లోని పేదరికం, తగాదాలు, గొడవలు, దురదృష్టం తొలగిపోతాయని విశ్వాసం. అందుకోసమే పైన పేర్కొన్న జంతువులను ప్రత్యేకమైన దీపావళి పండుగ రోజు చూసేందుకు అనేక మంది ట్రై చేస్తారు. కానీ చాలా మందికి ఈ విషయంలో నిరాశే (Sad) ఎదురవుతుంది. మామూలు సమయాల్లో విరివిగా కనిపించిన ఈ జంతువులు ప్రత్యేకమైన దీపావళి పండుగ రోజు మాత్రం ఎక్కువగా కనిపించవు. అందుకోసమే వీటి కోసం ప్రత్యేకంగా (Specially) వెతుకుతారు.