వానాకాలంలో జుట్టు సంర‌క్షణ ఇలా..!

ఈ రోజుల్లో ఎక్కువ మంది జుట్టు రాయడం సమస్యతో బాధపడుతున్నారు. పైగా ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి. ఈ వానాకాలంలో అంటువ్యాధులే కాదు జుట్టు రాలే సమస్యలు కూడా ఎక్కువే. మామూలుగా ఎండాకాలంలో చెమటకి కొంత ఎండకి కొంత జుట్టు రాలిపోతుందని అంటుంటారు. కానీ సీజన్ ఏదైనా సరే కేర్ తీసుకోకపోతే జుట్టు రాలిపోవడం ఖాయం. వానాకాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీ జుట్టును కాపాడుకోవచ్చు. వర్షాకాలంలో జుట్టు […]

Share:

ఈ రోజుల్లో ఎక్కువ మంది జుట్టు రాయడం సమస్యతో బాధపడుతున్నారు. పైగా ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి. ఈ వానాకాలంలో అంటువ్యాధులే కాదు జుట్టు రాలే సమస్యలు కూడా ఎక్కువే. మామూలుగా ఎండాకాలంలో చెమటకి కొంత ఎండకి కొంత జుట్టు రాలిపోతుందని అంటుంటారు. కానీ సీజన్ ఏదైనా సరే కేర్ తీసుకోకపోతే జుట్టు రాలిపోవడం ఖాయం. వానాకాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీ జుట్టును కాపాడుకోవచ్చు. వర్షాకాలంలో జుట్టు సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. అవేంటో ఒకసారి చూద్దాం.. 

కొంతమంది తల స్నానం చేసిన తర్వాత రోజు నుంచి జుట్టు జిడ్డు గా, స్టిక్కీగా మారుతుంది. జుట్టు చూడటానికి అందవిహీనంగా తయారవుతుంది. తలపై ఉండే సెబాషియస్ గ్రంధులు నూనెలాంటి పదార్థం సెబమ్ ను స్రవిస్తాయి. ఇది జుట్టు కుదుళ్లు బయటి పొరను ఒకదానితో ఒకటి బంధిస్తుంది.  సెబమ్ ఎక్కువగా విడుదలయితే జుట్టు కుదుళ్ల నుంచి చివరల వరకు వ్యాపిస్తుంది. మరికొన్ని సార్లు సెబమ్ ఎక్కువగా విడుదల అవుతూ ఉంటుంది. ఇది జుట్లును జిడ్డుగా మారుస్తుంది. ఈ సెబమ్ కు చెమట,  దుమ్ము, ధూళి వంటివి కూడా తోడైతే జుట్టు ఇంకా జిడ్డుగా కనిపిస్తుంది. ఈ సమస్య కారణంగా జుట్టు రాలడం, చుండ్రు , దురద వంటి సమస్యలు తోడయ్యే అవకాశం ఉంటుంది. వాతావరణ మార్పులు, పదేపదే చేతులు తల మీద పెట్టడం , కండిషనర్లు ఎక్కువగా ఉపయోగించడం, విటమిన్ బి లోపం, హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్, చుండ్రు వంటి కారణాల వలన జుట్టు జిడ్డుగా మారుతుంది.

హెయిర్ కేర్ అనగానే షాంపూలు, హెయిర్ ఆయిల్స్ కన్నా ముఖ్యమైనది మనం తీసుకునే ఫుడ్. ఎన్ని రకాల నూనెలు, షాంపులు వాడిన పోషకాహారం తీసుకోకుంటే జుట్టు రాలడం ఆగదు. జుట్టు ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ పదార్థాలను మీ డైట్ లో భాగం చేసుకోవాల్సిందే. చిరుధాన్యాలు,  మొలకెత్తిన విత్తనాలు, గుడ్డులోని తెల్లసొన, లీన్ మీట్ , బీన్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా ఐరన్, జింక్, విటమిన్ బి12 వంటివి ఆహరాలను తీసుకోవాలి. నీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. వర్షాలు , చల్లదనం అని నీళ్లు చాలామంది తాగకుండా ఉంటారు. ఇది ఏమాత్రం సరైనది కాదు. కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని ప్రతి సీజన్లో తాగాలి. 

వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా తడిచే అవకాశాలు ఉంటాయి. జుట్టు తడిచిన వెంటనే ఆరబెట్టుకునే ప్రయత్నం చేయాలి. జుట్టు తడిగా ఉంటే డాండ్రఫ్ దురద వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మీ జుట్టు నుంచి చెడు వాసన కూడా వస్తుంది. గతంలోనే మీకు డాండ్రఫ్ ఉంటే ఆ సమస్యను నివారించాలి. డాండ్రఫ్ ఉండడం వల్ల దురద కూడా వస్తుంది. ఈ కాలంలో డాండ్రఫ్ వలన జుట్టు మరింత ఎక్కువగా ఊడిపోతుంది.‌ తడి జుట్టును దువ్వి అప్పుడే చిక్కులు తీసే ప్రయత్నం చేయవద్దు. అంతేకాకుండా ఒకరి దువ్వెన మరొకరు ఉపయోగించకపోవడం మంచిది. హెయిర్ కేర్ లో ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. అందువలన సమయానికి నిద్రపోండి. హెయిర్ కి మంచి కండీషనర్ను ఉపయోగించండి.