రెటినోల్ మీ చర్మానికి పని చేయడం లేదా?

ఈ రోజుల్లో చర్మ సంరక్షణపై ప్రజల్లో అవగాహన చాలా ఎక్కువగా ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొంతమంది స్కిన్‌ కేర్‌ కోసం హోమ్‌ రెమిడీస్‌ ట్రై చేయడంతో పాటు.. డెర్మటాలజిస్ట్ సలహా మేరకు ఎన్నో స్కీన్‌ కేర్‌ టిప్స్‌ ఫాలో అవుతూ ఉంటారు. వాటిలో ఎక్కువగా మాట్లాడుకునేది, ప్రిక్స్రైబ్‌ చేసే వాటిలో రెటినోల్‌ ఒకటి.  రెటినోల్‌ అంటే.. రెటినోల్‌ చర్మ సంరక్షణకు సహాయపడే విటమిన్‌ A డెరివేటివ్‌. రెటినోల్‌ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది, చర్మాన్ని రక్షిస్తుంది. […]

Share:

ఈ రోజుల్లో చర్మ సంరక్షణపై ప్రజల్లో అవగాహన చాలా ఎక్కువగా ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొంతమంది స్కిన్‌ కేర్‌ కోసం హోమ్‌ రెమిడీస్‌ ట్రై చేయడంతో పాటు.. డెర్మటాలజిస్ట్ సలహా మేరకు ఎన్నో స్కీన్‌ కేర్‌ టిప్స్‌ ఫాలో అవుతూ ఉంటారు. వాటిలో ఎక్కువగా మాట్లాడుకునేది, ప్రిక్స్రైబ్‌ చేసే వాటిలో రెటినోల్‌ ఒకటి. 

రెటినోల్‌ అంటే..

రెటినోల్‌ చర్మ సంరక్షణకు సహాయపడే విటమిన్‌ A డెరివేటివ్‌. రెటినోల్‌ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది, చర్మాన్ని రక్షిస్తుంది. రెటినాల్‌ చర్మంలో పేరుకున్న మురికి, వ్యర్థ పదార్థాలు, టాక్సిన్స్‌ను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది. రెటినోల్‌ కొల్లాజెన్‌ ఉత్పత్తిని ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్కిన్ స్పషెలిస్ట్స్‌ తగిన నిష్పత్తిలో రెటినోల్ ఉన్న ఉత్పత్తులను.. చర్మ సంరక్షణకు సూచిస్తూ ఉంటారు. రెటినోల్‌ అన్ని రకాల చర్మ సమస్యలకు ఒకే పరిష్కారం అని చెప్పొచ్చు. రెటినోల్‌ను సరైన పద్ధతిలో, సరైన నిష్పత్తిలో చర్మానికి అప్లై చేస్తే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. 

ఇది చర్మంపైను మృతకణాలను, మురికిని తొలగిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరచి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. స్కిన్ కేర్‌లో రెటినోల్‌ని రెగ్యులర్‌గా ఉపయోగిస్తే.. స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. కాలుష్యం, సూర్యకాంతి వల్ల ఏర్పడే డార్క్ స్పాట్‌లను తొలగిస్తుంది. స్కిన్ ఎలాస్టిసిటీని సరిచేసి చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. చర్మాన్ని స్మూత్‌గా మార్చుతుంది. ముడతలు, ఫైన్‌ లైన్లను తొలగిస్తుంది. వద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. ముఖంపై ఉన్న నల్ల మచ్చలు, మొటిమలు, మొటిమల మచ్చలను మాయం చేస్తుంది. రెటినోల్‌ స్పాట్‌లెస్‌ బ్యూటీని అందిస్తుంది.

పని చేయకపోవడానికి కారణం?

రెటినోల్ అనేది మీ చర్మానికి సహాయపడే చర్మ సంరక్షణ పదార్ధం, కానీ ఇది అందరికీ ఒకే విధంగా పని చేయదు. ఇది ప్రతి ఒక్కరి చర్మానికి సరిపోదని తెలుసుకోవడం చాలా అవసరం. దీనిని ఉపయోగించే ముందు, డాక్టర్ లేదా చర్మ నిపుణుడితో మాట్లాడటం మంచిది. రెటినోల్ మీకు కావలసిన ఫలితాలను ఇవ్వకపోవడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. 

ఇది మీ వయస్సు, మీకు ఎలాంటి చర్మ సమస్యలు ఉన్నాయి మరియు మీరు ఎంత తరచుగా ఉపయోగిస్తున్నారు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. రెటినోల్ ఉపయోగించడం వల్ల మీ చర్మం సూర్యుడికి మరింత అనుకువుగా ఉంటుంది, కాబట్టి మీరు తప్పనిసరిగా సన్‌స్క్రీన్‌ని ఉపయోగించాలి. మీరు గర్భవతి లేదా నర్సింగ్ అయితే, రెటినోల్‌ను నివారించడం మంచిది. దీన్ని ఎక్కువగా ఉపయోగించకపోవడం కూడా ముఖ్యం.

రెటినోల్ కొంతమందికి వారి వయస్సు మరియు వారికి ఉన్న చర్మ సమస్యలను బట్టి మెరుగ్గా పనిచేస్తుంది. మీరు ముడతలు మరియు ఫైన్ లైన్స్ వంటి వాటి గురించి ఆందోళన చెందుతుంటే, రెటినోల్ సహాయకరంగా ఉంటుంది. కానీ మీరు చిన్నవారైతే మరియు మొటిమలు లేదా నల్ల మచ్చలు వంటి సమస్యలు ఉంటే, మీకు బాగా పని చేసే ఇతర ఉత్పత్తులు ఉండవచ్చు. కాబట్టి, రెటినోల్‌ను ఉపయోగించవద్దు. 

మీకు తామర, సోరియాసిస్, రోసేసియా లేదా చాలా సున్నితమైన చర్మం వంటి కొన్ని చర్మ పరిస్థితులు ఉంటే, రెటినోల్ మీకు సరైనది కాదు. రెటినోల్‌ను ఎక్కువగా ఉపయోగించడం సమస్య కావచ్చు. ఇది మీ చర్మాన్ని చికాకుగా, ఎరుపుగా మరియు పొడిగా చేస్తుంది. ఇలా జరిగితే, దాన్ని ఉపయోగించడం ఆపివేసి, సరిగ్గా ఎలా ఉపయోగించాలో లేబుల్‌లోని సూచనలను అనుసరించండి.

ఫలితాలు తొందరగా కనిపించనందున కొంతమంది రెటినోల్ వాడటం మానేస్తారు. కానీ రెటినోల్ మీ చర్మం కొత్త కణాలు మరియు కొల్లాజెన్‌ను తయారు చేయడంలో సహాయపడటం ద్వారా నెమ్మదిగా పని చేస్తుంది. పెద్ద మార్పులను చూడడానికి వారాలు లేదా నెలలు కూడా పట్టవచ్చు. కాబట్టి, మీరు దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించకపోతే, మీరు పూర్తి ప్రయోజనాలను పొందలేరు.

ఎవరు వాడొచ్చు..?

  • రెటినోల్ ఎలాంటి చర్మ సమస్యలకైనా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా,
  • మొటిమలు ఎక్కువగా ఉన్నవారు, 
  • చర్మం ముడతలు తొలగించడానికి
  • జిడ్డు చర్మం ఉన్నవారు
  • పెద్ద రంధ్రాలున్న వ్యక్తులు
  • డార్క్ స్పాట్స్ ఎక్కువగా ఉంటే
  • హైపర్‌పిగ్మెంటేషన్‌
  • యవ్వనంగా కనిపించాలనుకునే వారు
  • ప్రతి ఒక్కరూ తమ చర్మ సంరక్షణలో రెటినోల్‌ను ఉపయోగించవచ్చు.​

ఎవరు వాడొద్దు..

  • గర్భిణీ స్త్రీలు
  • పాలిచ్చే తల్లులు
  • సున్నితమైన చర్మం ఉన్నవారు
  • రెటినాల్‌ సిన్సిటివిటీ ఉన్నవారు.​

ఎలా వాడాలి..?

రెటినోల్‌ను నైట్‌ స్కిన్‌కేర్‌లో మాత్రమే ఉపయోగించాలి. సున్నితమైన క్లెన్సర్‌ని ఉపయోగించి మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. మాయిశ్చరైజర్/ సన్‌స్క్రీన్‌ని యధావిధిగా అప్లై చేయండి. అది ఆరిన తర్వాత.. చిన్న మొత్తంలో రెటినోల్ సీరమ్/ జెల్‌/ క్రీమ్‌ను చర్మానికి అప్లై చేసి.. 5 నిమిషాలు మసాజ్ చేయండి. ఉదయం లేచిన తర్వాత చల్లని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోండి.

ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి..

రెటినోల్ చాలా తక్కువ మొత్తంలోనే ఉపయోగించాలి. ఇది అధిక మోతాదులో వాడితే.. చర్మం పొడిగా మారుతుంది. రెటినోల్ ఎక్కవగా వాడితే.. చర్మం వేగంగా మృదువుగా మారుతుంది. నీటి శాతం తగ్గడం ప్రారంభమవుతుంది. రెటినోల్‌ను నేరుగా చర్మానికి అప్లై చేయవద్దు. ఇలా చేస్తే వాపు, ఎరుపు వంచి సమస్యలు ఎదురవుతాయి. దీన్ని ఎప్పుడూ మాయిశ్చరైజర్‌తో పాటు వాడాలి. పగటిపూట రెటినోల్ ఉపయోగించవద్దు. సూర్యకాంతి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు చర్మంపై అధిక ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి రాత్రిపూట మాత్రమే వాడాలి.​