కుసుమ నూనెతో ఊబకాయాన్ని కంట్రోల్ చేయవచ్చా?

కుసుమ గింజల నుండి పొందిన నూనె యొక్క ప్రయోజనాలు శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి ఊబకాయం గురించి ఆందోళన చెందుతున్న వారికి కుసుమ నూనె మంచి ఎంపిక. కుసుమ గింజల నుండి పొందిన నూనె యొక్క ప్రయోజనాలు శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఎందుకంటే కు ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిరంతర పని ఒత్తిడి కారణంగా రకరకాల అనారోగ్య సమస్యలు  మానవాళిని వెంటాడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అధిక బరువు. అధిక బరువును ఎప్పటికప్పుడు తగ్గించుకోవడానికి […]

Share:

కుసుమ గింజల నుండి పొందిన నూనె యొక్క ప్రయోజనాలు శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి

ఊబకాయం గురించి ఆందోళన చెందుతున్న వారికి కుసుమ నూనె మంచి ఎంపిక. కుసుమ గింజల నుండి పొందిన నూనె యొక్క ప్రయోజనాలు శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఎందుకంటే కు

ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిరంతర పని ఒత్తిడి కారణంగా రకరకాల అనారోగ్య సమస్యలు  మానవాళిని వెంటాడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అధిక బరువు. అధిక బరువును ఎప్పటికప్పుడు తగ్గించుకోవడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. డైటింగ్, వ్యాయామం, యోగా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. అయినా బరువు తగ్గకపోతే కుసుమ నూనె ఆ సమస్యను అధిగమించడానికి సమర్థవంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు అంటున్నారు.

కుసుమ నూనె ఉపయోగం వల్ల కలిగే లాభాలు

కుసుమ నూనె, ఈ నూనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని వంటలలో ఉపయోగించవచ్చు. దీని వాడకం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శరీరంలోని కొవ్వును తగ్గించుకోవచ్చు.

కుసుమ పంటను సాధారణంగా విత్తనాల కోసం పండిస్తారు. ప్రస్తుతం మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పూర్వపు రోజుల్లో ఈ గింజలను వంటకాలలో అదనపు రంగు తెప్పించడానికి ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు వీటి నుంచి నూనె తీసి వంటలకు ఉపయోగిస్తున్నారు. కుసుమ నూనెలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని, అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.

కుసుమ నూనెలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా చాలా తక్కువగా ఉంటుంది. కుసుమ నూనెలో మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్, జింక్, ఐరన్, కాపర్, ప్రొటీన్ మినరల్స్ ఉంటాయి. 100 గ్రాముల కుసుమ నూనెలో 38 గ్రాముల కొవ్వులు, 3 గ్రాముల సోడియం, 687 మిల్లీ గ్రాముల పొటాషియం, 34 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 16 గ్రాముల ప్రోటీన్, 88 శాతం విటమిన్ B12 ఉన్నాయి. కుసుమ గింజల నుండి తీసిన మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ నూనెలను వంటకాలను తయారుచేసేటప్పుడు ఉపయోగించవచ్చు.

కుసుమ నూనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

  • కుసుమ నూనెలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది
  • కుసుమనూనెలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీనిని ఒమేగా 6 లినోలెయిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.
  • లినోలిక్ యాసిడ్ చర్మ సంరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
  • కుసుమ నూనె శరీరంలో సెరోటోనిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ సెరోటోనిన్ హార్మోన్ మనల్ని సంతోషంగా ఉంచుతుంది. అంటే కుసుమ నూనెను ఆహారంలో తీసుకుంటే డిప్రెషన్ తొలగిపోతుంది.
  • కుసుమ నూనెలోని ఒమేగా 6 రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
  • ఈ కుసుమ నూనె రుతుక్రమ సమస్యలను నివారిస్తుంది. ఇది హార్మోన్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
  • కుసుమ నూనె జీవక్రియను వేగవంతం చేసి, టైప్ 2 మధుమేహాన్ని నివారిస్తుంది.
  • కుసుమ నూనెలో ఉండే లినోలిక్ యాసిడ్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇది తలలో రక్త ప్రసరణ జరగేలా ప్రేరేపిస్తుంది.
  • రోజూ ఒక టీస్పూన్ కుసుమనూనెను తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.
  • కుసుమ నూనెలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి.గుండెపోటు రాకుండా నివారిస్తాయి.
  • కుసుమనూనె మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది, తలనొప్పిని తగ్గిస్తుంది, చర్మం, జుట్టు నాణ్యతను మెరుగుపరుస్తుంది.
  • ఇది మనలో సెరోటోనిన్ హార్మోనును పెంచి డిప్రెషన్ నుండి మనల్ని రక్షిస్తుంది. రుతుక్రమ సమస్యలను నివారిస్తుంది. ఇది హార్మోన్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
  • ఈ నూనె మన జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా టైప్ 2 డయాబెటిస్ నుండి మనలను రక్షిస్తుంది. ఇందులో ఉండే లినోలిక్ యాసిడ్ జుట్టుకు చాలా మంచిది. తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఇన్ని సుగుణాలు కలిగి ఉన్న కుసుమ నూనెను వంటలలో వాడటం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు.

సుమ నూనెలో మంచి మొత్తంలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ కొవ్వు శరీరంలో నిల్వ కాకుండా శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.