వర్షాకాలంలో సన్ స్క్రీన్ అవసరమా?

 సన్ స్క్రీన్ లోషన్ వాడడం వల్ల మన చర్మం దెబ్బ తినకుండా ఉంటుంది. ఇంకా దీనిని రెగ్యులర్ గా వాడితే మన చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది. సన్ స్క్రీన్ ని మనం రెగ్యులర్ గా వాడటం వల్ల మన స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది కానీ దీన్ని వర్షాకాలంలో వాడొచ్చా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ నటశాశెట్టి చెప్పినదాని ప్రకారం సన్ స్క్రీన్ లోషన్ వర్షాకాలంలో కూడా వాడొచ్చు. ఎందుకంటే వర్షాకాలంలో మబ్బులు ఉంటాయి కానీ.. మబ్బులు సూర్యకాంతిని […]

Share:

 సన్ స్క్రీన్ లోషన్ వాడడం వల్ల మన చర్మం దెబ్బ తినకుండా ఉంటుంది. ఇంకా దీనిని రెగ్యులర్ గా వాడితే మన చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది. సన్ స్క్రీన్ ని మనం రెగ్యులర్ గా వాడటం వల్ల మన స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది కానీ దీన్ని వర్షాకాలంలో వాడొచ్చా లేదా ఇప్పుడు తెలుసుకుందాం.

డాక్టర్ నటశాశెట్టి చెప్పినదాని ప్రకారం సన్ స్క్రీన్ లోషన్ వర్షాకాలంలో కూడా వాడొచ్చు. ఎందుకంటే వర్షాకాలంలో మబ్బులు ఉంటాయి కానీ.. మబ్బులు సూర్యకాంతిని మన మీద పడకుండా ఆపలేవు. కాబట్టి వర్షాకాలంలో కూడా వీటిని వాడాలి. సన్ స్క్రీన్ చర్మం మీద అతిగా పడితే మన చర్మం మీద పిగ్మెంటేషన్ వస్తుంది. కాబట్టి అవి రాకుండా ఉండాలంటే మనం సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. మన స్కిన్ ని బేస్ చేసుకుని మనం ఎలాంటి సన్ స్క్రీన్ లోషన్ వాడాలి అనేది నిర్ణయించుకోవాలి. దీనివల్ల మన చర్మం పాడవకుండా ఉంటుంది. మన శరీరానికి, ఇంకా వాతావరణానికి తగ్గట్టు మనం సరైన సన్ స్క్రీన్ ని ఎంచుకోవాలి. మన శరీరానికి సన్ స్క్రీన్ లోషన్ అనేది అవసరం. వర్షాకాలంలో కూడా మనకిది అవసరం. ఎంత వర్షం పడ్డా కానీ మన శరీరం  మీద పడే యువీ రేస్ ని మబ్బులు ఆపలేవు. 

ఎక్స్పర్ట్స్ మాటల్లో:

మార్కెటింగ్ మేనేజర్ హరిణి అయ్యర్ వాన వచ్చినా రాకున్నా మన శరీరం మీద సన్ స్క్రీన్ లోషన్ వాడాల్సిందే అంటున్నారు. ఎందుకంటే వర్షం వచ్చినా రాకున్నా యూవీ రేస్ అనేవి మన శరీరం మీద పడుతూనే ఉంటాయి. దీని నుండి కాపాడుకోడానికైనా మనం సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. బ్యూటిషన్ ఎక్స్పర్ట్ ఉషా చౌదరి కూడా సన్ స్క్రీన్ లోషన్ వాడాల్సిందే అంటున్నారు. ఏ సీజన్లో అయినా మన శరీరానికి దీనివల్ల లాభమే ఉంటుంది అంటున్నారు. మన స్కిన్ కూడా చాలా స్ట్రాంగ్ గా అవుతుంది అంటున్నారు. సన్ స్క్రీన్ లోషన్ మన శరీరానికి సూట్ అయ్యేటట్టు ఎంచుకోవాలి.

మన చర్మాన్ని ఎండ నుండి కాపాడుకోవడానికి మనం సన్ స్క్రీన్ లోషన్స్ ని అయితే పక్కా వాడాలి. మనం వాడే సన్ స్క్రీన్ లోషన్ లో రసాయనాలు వాడకుండా నాచురల్ గా చేసిన సన్ స్క్రీన్ లోషన్స్ వాడితే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి మనకు కావాల్సిన బెనిఫిట్స్ ని కొన్ని రోజుల్లోనే అందిస్తాయి. పైగా ఇవి న్యాచురల్ కాబట్టి మన స్కిన్ కూడా చాలా మృదువుగా తయారవుతుంది. అలా కాదని రసాయనాలు ఉన్నవి వాడితే మన స్కిన్ డామేజ్ అవ్వచ్చు. అందుకే మనం సన్ స్క్రీన్ లోషన్స్ ని కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి. చిన్న అజాగ్రత్త కూడా మనకు చాలా డ్యామేజ్ చేస్తుంది. అందుకే సన్ స్క్రీన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో కూడా సన్ స్క్రీన్ లోషన్ వాడాలని అంటున్నారు కాబట్టి ఇకపై మీరు కూడా ప్రతి సీజన్లో సన్ స్క్రీన్ లోషన్ వాడండి. సన్ స్క్రీన్ లోషన్ బెనిఫిట్స్ ఏంటో మీకు తెలుసాయి కాబట్టి ఇకపై మీరు రెగ్యులర్గా సన్ స్క్రీన్ లోషన్ వాడి మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. 

ఒక విషయం అయితే గుర్తు పెట్టుకోండి మన చర్మం బాగుంటే మనం యవ్వనంగా కనిపిస్తాం.

చర్మానికి కావాల్సినవన్నీ మనం అందిస్తే అది ఎప్పుడూ యవ్వనంగా ఉంటుంది సో ఈరోజునుండి మీ చర్మాన్ని కాపాడుకునే పనిలో ఉంటారని అనుకుంటున్నాం.