పులియబెట్టిన పదార్థాలు రాత్రిపూట తినొచ్చా?

పులియబెట్టిన ఆహార పదార్థాలు చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. వేరే దేశాలలో చాలామంది పులియబెట్టిన ఉసిరికాయలు, మామిడి బద్దలు, పులియబెట్టిన క్యాబేజీ ముక్కలు ఇలా రకరకాల పులియబెట్టిన పదార్థాలు తింటూ ఉంటారు. అంతేకాదు ప్రత్యేకించి చాలా దేశాలలో, పులియబెట్టిన కూరగాయలు, ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. పులియబెట్టిన కూరగాయలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తేలింది. మన దేశంలో రకరకాల పచ్చళ్ళు ఎలాగైతే తింటామో, అదే విధంగా ఇతర దేశాలలో పులియబెట్టిన కూరగాయలు అంత […]

Share:

పులియబెట్టిన ఆహార పదార్థాలు చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. వేరే దేశాలలో చాలామంది పులియబెట్టిన ఉసిరికాయలు, మామిడి బద్దలు, పులియబెట్టిన క్యాబేజీ ముక్కలు ఇలా రకరకాల పులియబెట్టిన పదార్థాలు తింటూ ఉంటారు. అంతేకాదు ప్రత్యేకించి చాలా దేశాలలో, పులియబెట్టిన కూరగాయలు, ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. పులియబెట్టిన కూరగాయలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తేలింది. మన దేశంలో రకరకాల పచ్చళ్ళు ఎలాగైతే తింటామో, అదే విధంగా ఇతర దేశాలలో పులియబెట్టిన కూరగాయలు అంత ఇష్టంగా తింటారు. సుమారు వారికి పులియబెట్టిన కూరగాయలు పచ్చళ్లతో సమానం అన్నమాట. 

పులియబెట్టిన ఆహార పదార్థాలు ఏ సమయంలో తినాలి?: 

పులియబెట్టిన ఆహార పదార్థాలు చాలా రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. పులియబెట్టిన ఆహారం తినడం కారణంగా, శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంతేకాకుండా నెల రోజులపాటు మన తినే ఆహారంలో పులియబెట్టిన పదార్థాలు చేర్చడం ద్వారా, మనలో ఉండే అధిక స్ట్రెస్ లెవెల్స్ ఘననీయంగా తగ్గుతాయని ఒక రీసెర్చ్ ప్రకారం తేలింది. అయితే ప్రస్తుతం పులియబెట్టిన ఆహార పదార్థాలు ఎప్పుడు తీసుకోవాలి అనే దానిమీద ప్రశ్న.. 

కొంతమంది డాక్టర్లు సిఫార్సు చేసిన ప్రకారం, పులియబెట్టిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పులియబెట్టిన ఆహార పదార్థాలలో ఈస్ట్, బ్యాక్టీరియా వంటి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మన శరీరంలో ఏర్పడే షుగర్ లెవెల్స్ తగ్గిస్తాయి. శరీరంలో అధిక షుగర్ ని, అదే విధంగా పిండి పదార్థాలను బై ప్రొడక్ట్స్ అంటే ,శరీరంలో ఉపయోగపడే కొన్ని రసాయన పదార్థాలుగా, అదేవిధంగా గ్యాస్ కింద మార్చేస్తుంది. 

అయితే ఇటువంటి ఆరోగ్యమైన పులియబెట్టిన ఆహార పదార్థాలు, ఉదయం లేదంటే మధ్యాహ్నం తీసుకోవడం వల్ల, ఎన్నో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కాకపోతే పులియబెట్టిన పదార్థాలను రాత్రిపూట ఆహారంగా తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అంతేకాకుండా పులియబెట్టిన పదార్థాలలో ఉండే బ్యాక్టీరియా నిద్రపోయే సమయంలో మన పొట్టలోని వేడి ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా నిద్రపోయే సమయంలో, మధ్య రాత్రిలో మెలకువ వచ్చేసే అవకాశాలు ఉంటాయి. సరేనా నిద్ర పట్టదు. అందుకనే రాత్రిపూట పులియబెట్టిన పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది అంటున్నారు నిపుణులు. 

వీరు పులియబెట్టిన పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది: 

ఒక పది మందిని తీసుకుంటే, అందులో ఇద్దరు ఖచ్చితంగా ఇటువంటి పులియబెట్టిన పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది అంటున్నారు డాక్టర్లు. ఎవరికైతే ఎలర్జీలు వంటి వాటితో బాధపడుతున్నారో, వారు ఎక్కువగా పులియబెట్టిన పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. తక్కువ మోతాదులోనే పులియబెట్టిన పదార్థాలు తీసుకోవడం ఉత్తమం. 

అదేవిధంగా దయచేసి అజీర్తి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా పులియబెట్టిన పదార్థాలు తినకపోవడం మంచిది కాదు. ఎందుకంటే అజీర్తి ప్రాబ్లం ఉన్నవారు పులియబెట్టిన ఆహార పదార్థాలు రాత్రిపూట తీసుకోవడం వల్ల, లేదంటే ఉదయం సమయంలో ఎక్కువ మోతాదులో తినడం వల్ల, డైజేషన్ ప్రాబ్లం మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. 

మరి ముఖ్యంగా ఎవరైతే బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతున్నారో, వారు కూడా తక్కువ మోతాదులో పులియబెట్టిన ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే పులియబెట్టిన పదార్థాలలో సోడియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే ఎక్కువ మతాధిలో పులియబెట్టిన పదార్థాలు తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ వంటి వాటికి గురవ్వే అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా, పులియబెట్టిన పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.  గర్భిణీ స్త్రీలు కూడా పులియబెట్టిన పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపునొప్పి, వేడి చేయడం, డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఆకాశం ఉంటుంది.