ఫాస్టింగ్ నిజంగానే బరువును తగ్గిస్తుందా??

ప్రస్తుత రోజుల్లో చాలా మంది అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నారు. సిటీల్లో నివాసం ఉండే వారైతే మరింత మంది ఎక్కువగా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. బరువును తగ్గించుకోవడం అనేక మంది అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంత మంది ప్రయత్నాలు ఫలించినా కానీ మరి కొంత మంది ప్రయత్నాలు సరిగ్గా ఫలించవు. ఇటువంటి వారు నిరాశ చెందుతూ వేరే ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంటారు. ఎలాగైనా సరే బరువును తగ్గించుకోవాలని అందరూ చూస్తుంటారు. ఈ నేపథ్యంలో […]

Share:

ప్రస్తుత రోజుల్లో చాలా మంది అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నారు. సిటీల్లో నివాసం ఉండే వారైతే మరింత మంది ఎక్కువగా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. బరువును తగ్గించుకోవడం అనేక మంది అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంత మంది ప్రయత్నాలు ఫలించినా కానీ మరి కొంత మంది ప్రయత్నాలు సరిగ్గా ఫలించవు. ఇటువంటి వారు నిరాశ చెందుతూ వేరే ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంటారు. ఎలాగైనా సరే బరువును తగ్గించుకోవాలని అందరూ చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక విషయం తెగ వైరల్ అవుతోంది. ఆ విషయం నిర్దారణ గురించి అనేక మంది అనేక విధాలుగా చెబుతున్నారు. 

ఉఫాస్టింగ్తో బరువు తగ్గొచ్చా???

ఉపవాసంతో చాలా వేగంగా బరువును తగ్గొచ్చని కొంత మంది చెబుతుంటే కొంత మంది మాత్రం దీనిని కొట్టి పారేస్తున్నారు. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదని వారు వాదిస్తున్నారు. మనం లావు ఎక్కువగా ఉండడం వలన మనకు నచ్చిన స్టైలిష్ డ్రెస్సులను కూడా వేసుకోలేకపోతాం కావునే చాలా మంది వెయిట్ తగ్గాలని చూస్తుంటారు. అందుకోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటారు. 

అప్పుడు తగ్గుతాయి కానీ

మనలో ఎవరైనా కానీ ఉపవాసం చేసినపుడు మన శరీరంలో ఉన్న కేలరీలు తగ్గుతాయి. ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చూసే చాలా మంది ఉపవాసం వల్ల బరువు తగ్గడం సాధ్యం అవుతుందని అంటున్నారు. కానీ మనం ఉపవాసం తర్వాత తిన్నపుడు మన శరీరంలో తగ్గిన కేలరీలు మళ్లీ ఒక్కసారిగా పెరుగుతాయి. కావున మనం బరువు తగ్గే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా మనం ఎక్కువ బరువు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఉపవాసం తర్వాత వ్యక్తులు ఎటువంటి అడ్డూ అదుపూ లేకుండా ఇష్టం వచ్చినట్లు తింటారు. అలా తినడం మూలాన కేలరీలు ఇష్టం వచ్చిన విధంగా మన శరీరంలోకి వెళ్తాయి. అప్పుడు మనం ఎక్కువగా బరువు పెరిగే అవకాశం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు. 

స్థిర ప్రణాళిక ముఖ్యం… 

బరువు తగ్గాలని అనుకునే వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే… వారు స్థిరమైన వ్యాయామ ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. ఒకే సారి పెద్ద మొత్తంలో బరువు తగ్గాలని కాకుండా కొంచెం, కొంచెం బరువు తగ్గినా కానీ పరవాలేదనే విధంగా బరువు తగ్గేందుకు ట్రై చేయాలి. అలా ట్రై చేసినపుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. మనం కొంచెం స్లోగా అయినా కానీ ఆరోగ్యంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకోసమే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే ప్రణాళికను ఉపయోగించాలి. అలా కాకుండా మనం తొందరగా బరువు తగ్గాలని కనుక ప్రయత్నాలు చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అందుకోసమే చాలా జాగ్రత్తగా ఈ విషయంలో ప్రణాళిక ప్రకారం అడుగులు వేయాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. 

అది నమ్మొద్దు.. 

మనం ఉపవాసం చేస్తున్న సమయంలో మన శరీరంలో తక్కువ కేలరీలు ఉన్నట్లు అనిపిస్తుంటుంది. అరే పాస్టింగ్ తో వెయిట్ తగ్గొచ్చని మనం అప్పుడు బిలీవ్ చేయకూడదు. మనం తినకుండా ఉన్నాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంటుంది. మనం ఎప్పుడైతే ఆహారం తీసుకున్నామో అప్పుడు మన కేలరీ లెవెల్స్ ఆటోమేటిక్ స్థాయికి చేరుకుంటాయి. కనుక పాస్టింగ్ లో ఉన్నపుడు ఉన్న తక్కువ కేలరీలను చూసి మోసపోవద్దు. అలా అని ఉపవాసాలు చేస్తూ ఉండడం వలన మనం బరువు తగ్గుతామని అపోహ పడకూడదు. బరువు తగ్గేందుకు సరైన పద్ధతిలో వ్యాయామలు చేయడం మాత్రమే మంచి ఆప్షన్. అలా కాదని ఇలా పాస్టింగ్ చేయడం, వేరే ఏవైనా పౌడర్స్ వాడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కావున ఇటువంటి వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి.