కళ్లకు ఏదిపడితే అది పూయొద్దు

ఆరోగ్యానికి సంబంధించి సోషల్‌ మీడియలో వచ్చే ప్రతి వీడియోను నమ్మొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒకవేళ అవి నిజం కాకపోతే ప్రాణాలమీదకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.ముఖ్యంగా కళ్లకు సంబంధించిన ట్రీట్‌మెంట్‌ వీడియోలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.   సోషల్‌ మీడియా పెరిగినప్పటి నుంచి యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌‌ తదితర సోషల్‌ మీడియా యాప్‌లలో ప్రతి సమస్యకు సలహాలు ఇచ్చే వారి సంఖ్య పెరిగింది. ఎక్కువగా హెల్త్‌ సంబంధించిన సమస్యలకు సలహాలు ఇస్తూ ప్రతి ఒక్కరు డాక్టర్లు అయిపోతున్నారు. […]

Share:

ఆరోగ్యానికి సంబంధించి సోషల్‌ మీడియలో వచ్చే ప్రతి వీడియోను నమ్మొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒకవేళ అవి నిజం కాకపోతే ప్రాణాలమీదకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.ముఖ్యంగా కళ్లకు సంబంధించిన ట్రీట్‌మెంట్‌ వీడియోలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.  

సోషల్‌ మీడియా పెరిగినప్పటి నుంచి యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌‌ తదితర సోషల్‌ మీడియా యాప్‌లలో ప్రతి సమస్యకు సలహాలు ఇచ్చే వారి సంఖ్య పెరిగింది. ఎక్కువగా హెల్త్‌ సంబంధించిన సమస్యలకు సలహాలు ఇస్తూ ప్రతి ఒక్కరు డాక్టర్లు అయిపోతున్నారు. కొంతమంది వీరి సలహాలు విని అనారోగ్యం పాలవుతున్నారు. మరికొంత మంది ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వాటిని నమ్మొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నా.. పట్టించుకోవడం లేదు. తాజాగా ఆముదం (కాస్టర్‌‌) నూనె వాడటం వల్ల కళ్ల సమస్యలు తీరిపోతాయని యూట్యూబ్‌ తదితర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని వీడియోలు కనబడుతున్నాయి. ఇది ఎంత మరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆముదం నూనెను కనురెప్పల మీద, కళ్ల కింద రాసుకోవడం వల్ల చూపు సరిగ్గా లేని వారికి నయమైపోతుందని, అలాగే గ్లాకోమా వంటి సమస్యలకు చికిత్స చేయొచ్చని చాలా వీడియోలు బయటకు వచ్చాయి. ఇలాంటి వీడియోలను ఫాలో అవుతూ, అందులో చెప్పే వాటిని ఆచరించే వారికి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆముదం నూనెను కొన్ని ఆయుర్వేద మందుల్లో వాడతారని తెలుసు.. కానీ, వైద్యుల సలహాలు లేకుండా వాడితే సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కంటి కింద ఆముదం నూనెను రాస్తే చికాకు, కళ్లు ఎరుపు మారడం జరుగుతుంది. అందుకే ఇలాంటి వాడే ముందు కంటి వైద్యుల్ని సంప్రదించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. 

శాస్త్రీయ ఆధారాలు లేవు..

దృష్టి సమస్యలకు ఆముదం నూనె మంచి చికిత్స అనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని షార్ప్‌ సైట్‌ కంటి హాస్పిటల్‌  సీనియర్‌‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌‌ పుతిన్‌ జైన్‌ అన్నారు. ‘‘ఆముదం చారిత్రాత్మకంగా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నప్పటికీ.. దృష్టి సమస్యల కోసం దానిని సిఫార్సు చేయరు. కళ్లు అత్యంత సున్నితమైన, సంక్లిష్టమైన అవయవం. అందుకే కంటికి సంబంధించిన మందులు వాడేటప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవాలి. మయోపియా, హైపోరియా, అస్టిగ్మాటిజం వంటి దృష్టి సమస్యలు లేదా కళ్లు పొడ బారడం వంటి సమస్యలకు డాక్టర్లను తప్పకుండా సంప్రదించాలి” అని చెప్పారు.

కొంతమందికి ఆముదం పడొచ్చు.. అందరికీ కాదు..

కంటి ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఆముదం నూనె కొంత వరకు పనిచేస్తుందని ఐక్యూ చీఫ్‌ మెడికల్‌ డైరెక్టర్‌‌ డాక్టర్‌‌ అజయ్‌ శర్మ చెప్పారు. అయితే, ఇది బాగా తెలిసిన విధానం అయి ఉండాలి, వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. రిసినోలిక్‌  ఆమ్లం, ఇతర అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఆముదం నూనెలో ఉంటాయని, ఇవి కంటికి తేమను అందించడం, తగ్గించడం వంటి చేస్తాయి. అయితే, ఈ నూనె అందరికి పడకపోవచ్చు. నూనె పడకపోయిన వాళ్లల్లో చికాకు, కళ్లల్లో అసౌకర్యంగా ఉంటుంది. కనురెప్పలకు ఆముదం నూనెను పూయడం ద్వారా కళ్లు పొడిబారడం నుంచి ఉపశమనం లభిస్తుందని చాలా మంది చెప్పారు. అయితే , ఈ వాదనలకు శాస్త్రీయ ఆధారాలు కచ్చితత్వంతో లేవు. కాబట్టి, కళ్లకు స్వీయ ట్రీట్‌మెంట్‌ తీసుకునేటప్పుడు నిపుణులను సంప్రదించాలి” అని డాక్టర్‌‌ అజయ్ శర్మ తెలిపారు.

తీవ్ర సమస్యలు రావొచ్చు…

కళ్లకు ఆముదం నూనే వాడటం వల్ల తీవ్ర సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని డాక్టర్‌‌ జైన్‌ తెలిపారు. ‘నూనె పూయడం వల్ల ఇప్పటికే ఉన్న కంటి సమస్యలు మరింత తీవ్రతరం కావొచ్చు. లేదా కొత్త సమస్యలకు దారి తీయొచ్చు. ఇన్‌ఫెక్షన్‌ కూడా రావొచ్చు. ఒక్కోసారి కంటి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. శాస్త్రీయ పద్ధతులు లేని ఇలాంటి ఇంటి చిట్కాలు పాటించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. సంబంధిత వైద్యుడిని సంప్రదించే ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. సోషల్‌ మీడియా వీడియోలు చూసి, మోసపోవద్దు” అని పేర్కొన్నారు.