ఆరోగ్య‌క‌ర‌మైన గుండెకు.. ఆరోగ్య‌క‌ర‌మైన డైట్ స‌రిపోతుందా?

ప్రస్తుత కాలంలో ఫాలో అవుతున్న.. లైఫ్‌స్టైల్‌, చెడు ఆహార అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా.. గుండె సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతుంది. గుండె సమస్యలకు ప్రధాన కారణం.. అధిక కొలెస్ట్రాల్‌‌‌‌‌. కొలెస్ట్రాల్ అనేది మైనం లాంటి పదార్థం. కొలెస్ట్రాల్‌ రెండు రకాలు ఉంటుంది. ఒకటి చెడు కొలెస్ట్రాల్ (LDL), రెండు మంచి కొలెస్ట్రాల్ (HDL). మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) ఎక్కువైతేనే ప్రమాదం. దీంతో గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు […]

Share:

ప్రస్తుత కాలంలో ఫాలో అవుతున్న.. లైఫ్‌స్టైల్‌, చెడు ఆహార అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా.. గుండె సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతుంది. గుండె సమస్యలకు ప్రధాన కారణం.. అధిక కొలెస్ట్రాల్‌‌‌‌‌. కొలెస్ట్రాల్ అనేది మైనం లాంటి పదార్థం. కొలెస్ట్రాల్‌ రెండు రకాలు ఉంటుంది. ఒకటి చెడు కొలెస్ట్రాల్ (LDL), రెండు మంచి కొలెస్ట్రాల్ (HDL). మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) ఎక్కువైతేనే ప్రమాదం. దీంతో గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు ఎక్కువవుతుంది. అదే మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) రక్తంలోంచి చెడ్డ కొలెస్ట్రాల్‌ను తొలగించటానికి సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ మనం తీసుకునే ఆహారం నుంచీ, శరీరం లోపలా తయారవుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లివర్‌లో తయారవుతుంది. సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉండే ఆహారంలో కొలెస్ట్రాల్‌ ఎక్కుగా ఉంటుంది. ఆహారం ద్వారా పొందే కొలెస్ట్రాల్ మనం తీసుకునే పాలు, పాలపదార్థాలు, మాంసాహారం, చేపలు, గుడ్లులోని పచ్చసొన నుంచి అందుతుంది. పాల ఉత్పత్తులు, నూనెలలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉన్నందున… వాటిని తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

అధిక కొలెస్ట్రాల్ మీ గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదం. కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటే.. గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది 30 ఏళ్లలో జరగవచ్చు. లేదా ఆ తరువాతనైనా జరగవచ్చు. అది మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మీ రోజువారీ స్ట్రెస్‌పై ఆధారపడి ఉంటుంది. వయస్సు మీద పడుతున్నప్పుడు గుండె నాళాల్లో పూడికలు సహజమే.

కొలెస్ట్రాల్-గుండె కనెక్షన్

కొలెస్ట్రాల్ మీ శరీరంలోని కొవ్వు పదార్ధం లాంటిది, ఇది హార్మోన్లు, విటమిన్ డి మరియు ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఇది మీ శరీరంచే తయారు చేయబడుతుంది మరియు కొన్ని ఆహారాలలో కనిపిస్తుంది. మీ గుండె ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ స్థాయిలు ముఖ్యమైనవి.

భారతదేశంలో, చాలా మంది ప్రజలు గుండె సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి కొలెస్ట్రాల్ ఒక పెద్ద కారణం. జన్యుశాస్త్రం, తగినంత చురుకుగా ఉండకపోవడం మరియు ఉత్తమమైన ఆహారాన్ని తినకపోవడం వంటి కారణాల వల్ల భారతీయులతో సహా దక్షిణాసియావాసులకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఇతర ఆసియన్లతో పోలిస్తే భారతీయులు కొలెస్ట్రాల్ స్థాయిలను ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే, అధిక రక్తపోటు మరియు మధుమేహం వంటి పరిస్థితులు గుండె సమస్యలను మరింత ఎక్కువగా చేస్తాయి. కాబట్టి, మీ కొలెస్ట్రాల్ మరియు మొత్తం గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.

ఆరోగ్యకర కొవ్వులను మాత్రమే తినాలి

మనకు చెడు చేసే శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ జోలికి వెళ్లొద్దు. ప్రాసెస్డ్ మాంసం, ఫ్రైడ్ ఫుడ్, బేక్‌డ్ ఫుడ్స్‌లో చెడు కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌కు కారణమవుతాయి. వీటిని పక్కనపెట్టి ఆరోగ్యకర ప్రత్యామ్నాయాల వైపు మళ్లండి. ఇంటి దగ్గర ఉడికించిన ఆహారమే తినండి. ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన వంట నూనెలను వినియోగించడంతో పాటు ఒమెగా-3 ఉన్న ఆహారం తీసుకోవాలి. ట్రైగ్లైజరిడ్స్, చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచాలంటే ఒమెగా-3 రిచ్ ఫుడ్స్ అవసరం. బాదాంలు, అవిసె గింజలు, వాల్ నట్స్, ఒమెగా 3 సప్లిమెంట్స్ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ లభించే వనరులు.

వ్యాయామం, బరువు

రోజుకు కనీసం 20 నిమిషాల వ్యాయామం తప్పనిసరి. తద్వారా కొలెస్ట్రాల్‌ను అదుపులో పెట్టొచ్చు. ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం వల్ల శరీరం అధిక కేలరీలను శక్తిగా మార్చుకుంటుంది. తద్వారా కొవ్వు నిల్వగా మారదు. కొవ్వు నిల్వలు పేరుకుపోతే అవి హానికరంగా మారుతాయి. అంతిమంగా గుండె పోటుకు దారితీస్తాయి.

పొగ, మద్యం మానేయండి

శరీరం కొలెస్ట్రాల్ విషయంలో స్పందించే తీరును స్మోకింగ్ నేరుగా ప్రభావితం చేస్తుంది. పొగాకు వల్లే వచ్చే తార్ ధమనుల్లో కొలెస్ట్రాల్ త్వరగా పేరుకుపోయేలా చేస్తుంది. పొగ తాగడం మానేసినప్పుడు సానుకూల ఫలితాలు వెలువడ్డట్టు నిరూపితమైంది. ఏదైనా అతిగా తీసుకోవడం అనర్థాలకు దారితీస్తుంది. మద్యం కూడా అలాంటిదే. ఇది చెడు కొలెస్ట్రాల్‌కు కారణమై మీ గుండెపై ఒత్తిడి కలిగిస్తుంది.

స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్‌కు గుండె జబ్బులకు అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల మీరు శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇచ్చి ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా, ధ్యానం చేయడం, సంగీతం వినడం, బుక్ చదవడం, ఇలా ఏదో ఒక ఇష్టమైన వ్యాపకంతో మీ ఒత్తిడిని దూరం చేసుకోండి.