పీరియ‌డ్స్ స‌క్ర‌మంగా రాక‌పోతే గుండెకు ముప్పు?

ఆడవారి ఆరోగ్యానికి సంబంధించి, అండాశయ హార్మోన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి అంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్లు నరాలకు, ఎముకలకు సంబంధించి, గుండె ఆరోగ్యానికి సంబంధించి సానుకూల పనిని చేస్తూ ఉంటాయట. అందుకే ఆడవారిలో నెలసరి క్రమం తప్పకుండా వస్తే ఆరోగ్యం పదిలం అంటున్నారు నిపుణులు.  ఇర్రేగులర్ పీరియడ్స్ తో గుండెకి ముప్పు:  ఆడవారిలో ఈస్ట్రోజన్ హార్మోన్లు ముఖ్యంగా ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేయడానికి పనిచేస్తాయి. అంతేకాకుండా ఆడవారిలో వయసు పెరుగుతున్న కొద్దీ, అదేవిధంగా నెలసరి క్రమంగా రాకపోవడం, […]

Share:

ఆడవారి ఆరోగ్యానికి సంబంధించి, అండాశయ హార్మోన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి అంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్లు నరాలకు, ఎముకలకు సంబంధించి, గుండె ఆరోగ్యానికి సంబంధించి సానుకూల పనిని చేస్తూ ఉంటాయట. అందుకే ఆడవారిలో నెలసరి క్రమం తప్పకుండా వస్తే ఆరోగ్యం పదిలం అంటున్నారు నిపుణులు. 

ఇర్రేగులర్ పీరియడ్స్ తో గుండెకి ముప్పు: 

ఆడవారిలో ఈస్ట్రోజన్ హార్మోన్లు ముఖ్యంగా ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేయడానికి పనిచేస్తాయి. అంతేకాకుండా ఆడవారిలో వయసు పెరుగుతున్న కొద్దీ, అదేవిధంగా నెలసరి క్రమంగా రాకపోవడం, ఈస్ట్రోజన్ హార్మోన్లు విడుదలకు అంతరాయం ఏర్పడడం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

ఈస్ట్రోజన్ హార్మోన్లు ముఖ్యంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. కొలెస్ట్రాల్ క్రమంగా తగ్గడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఆక్సిడేషన్ విధానాన్ని క్రమబద్ధీకరించడంలో ఈస్ట్రోజన్ హార్మోన్లో పనితీరు ఎంతో బాగుంటుంది. అయితే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తున్న ఇరెగ్యులర్ పీరియడ్స్ సమస్య కారణంగా, బ్లడ్ విజిల్స్ లో కొలెస్ట్రాల్ అధికంగా మారడం, గుండెకు సంబంధించిన వ్యాధులకు దగ్గర అవడం జరుగుతూ ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ మైంటైన్ చేయడంలో, హైపర్ టెన్షన్ వంటి ప్రాబ్లమ్స్ కి దూరంగా ఉండడంలో ఈస్ట్రోజన్ హార్మోన్స్ చాలా చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా సగటు మనిషి ఒబేసిటీ అంటే అధిక బరువుకి లోనవ్వకుండా, గుండెకు సంబంధించిన వ్యాధుల రిస్కు నుంచి బయటపడేందుకు ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎంతగానో పనిచేస్తాయి. డయాబెటిస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడం, అధిక బరువు ఇలా ఎన్నో అనారోగ్య సమస్యల నుండి దూరం చేస్తుంది, ఆడవారిలో క్రమం తప్పకుండా పీరియడ్స్ కు కారణం అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్స్. 

ఇర్రేగులర్ పీరియడ్స్ అరికట్టే ఆహారం: 

ఉసిరికాయలు: 

ఉసిరికాయలలో ముఖ్యంగా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ ఉసిరికాయలు అనేవి ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఈ ఉసిరికాయలు దివ్య ఔషధం. అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గించడానికి. రోగనిరోధక శక్తి పెంచడానికి శరీరంలో ఉన్న టాక్సిక్ లెవెల్స్ ను నిర్మూలించడానికి ఉసిరికాయ ఎంతగానో సహాయపడుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను అరికడుతుంది. ఆడవారిలో ముఖ్యంగా శక్తివంతమైన ఆహార పదార్థాల పోషక విలువలు ఉండడమే ఎంతో అవసరం. అందుకే ఆడవారు ముఖ్యంగా ఉసిరికాయ తీసుకోవడం శరీరానికి ఆరోగ్యానికి ఎంతో మంచిది. 

ఖర్జూరం: 

ఆడవారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క వయసు వారు కూడా ఖర్జూరం తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఖర్జూరాన్ని ఎండబెట్టి డ్రైఫ్రూట్ గా చేసుకునే, రాత్రి నానబెట్టుకుని ఉదయం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటున్నాయి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆడవారిలో పీరియడ్స్ సమయంలో శక్తిని పొంచుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు ముఖ్యంగా ఈ ఖర్జూరం ఔషధంగా పనిచేస్తోంది. ప్రతిరోజు ఖర్జూరం వంటి ఆరోగ్యకరమైన ఆహారాలు  తీసుకోవడం వల్ల, సమయానికి నెలసరి రావడం జరుగుతుంది. అంతేకాకుండా బ్లడ్ లెవెల్స్ తగ్గకుండా ఉండేందుకు, ఖర్జూరం లో ఉండే ఐరన్ ఎంతగానో సహాయపడుతుంది. 

అల్లం: 

ఈ అల్లం లో ముఖ్యంగా నొప్పి నివారణ శక్తి అనేది చాలా బాగుంటుంది, ఆడవారిలో నొప్పిని తట్టుకునే శక్తిని పెంపొందించడంలో అల్లం ముఖ్య పాత్ర పోషిస్తుంది.  అంతేకాకుండా ఆడవారిలో పీరియడ్స్ సమయంలో, జీర్ణశక్తి పెంపొందించడానికి కూడా ఈ అల్లం అనేది చక్కగా పనిచేస్తుంది. 

వాల్నట్: 

డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు కదా. అయితే ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ లో వాల్నట్ అనేది ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ తో నిండి ఉండే ఒక మంచి ఆహార పదార్థం. ఇందులో ఉండే ప్రోటీన్.. ఫైబర్.. మెగ్నీషియం వంటివి మనకి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా ఎక్కువ సేపు ఎనర్జిటిక్ గా ఉండడానికి కూడా వాల్నట్ సహాయపడుతుంది. ఆడవారి పీరియడ్స్ సమయంలో ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.