శరీర బరువు తగ్గించుకోవడానికి 5 టిప్స్

నిజానికి ఫాస్టింగ్ చేయడం ద్వారా వెయిట్ లాస్ అవ్వడాన్ని పక్కన పెడితే మన శరీరంలో ఎంత హాని జరుగుతుందో ఒక న్యూట్రిస్ట్ లిస్టు చెప్పారు.  ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ అన్నది ప్రస్తుత జనరేషన్ లో వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతోమంది ప్రయత్నిస్తున్న లో ప్రయత్నాలలో ఒక ప్రయత్నం. ఈ ఫాస్టింగ్ లో భాగంగా మనం చాలా గంటలు ఫాస్టింగ్ చేయడం ఏదో ఒక పూట మాత్రమే ఏదో ఒకటి తినడం జరుగుతుంది, ఇది ఈ ఫాస్టింగ్ లో ప్రత్యేకత.  […]

Share:

నిజానికి ఫాస్టింగ్ చేయడం ద్వారా వెయిట్ లాస్ అవ్వడాన్ని పక్కన పెడితే మన శరీరంలో ఎంత హాని జరుగుతుందో ఒక న్యూట్రిస్ట్ లిస్టు చెప్పారు. 

ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ అన్నది ప్రస్తుత జనరేషన్ లో వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతోమంది ప్రయత్నిస్తున్న లో ప్రయత్నాలలో ఒక ప్రయత్నం. ఈ ఫాస్టింగ్ లో భాగంగా మనం చాలా గంటలు ఫాస్టింగ్ చేయడం ఏదో ఒక పూట మాత్రమే ఏదో ఒకటి తినడం జరుగుతుంది, ఇది ఈ ఫాస్టింగ్ లో ప్రత్యేకత. 

తినడానిక, ఇంకా ఫాస్టింగ్ అనేది చేయడానికి గంటల సంఖ్యను పరిమితం చేయడం వంటివి IFలో అనేక రకాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. చాలా మంది IF నిపుణులు ఈ ఆహారపు విధానంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే కాకుండా, నిజానికి ఇది ఒకరి లైఫ్ స్టైల్ కూడా మార్చే అవకాశం లేకపోలేదు.

నిజానికి కొన్ని కొన్ని అలవాట్లు అందరికీ పని చేయదు. సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ IF మరియు అది శరీరానికి ఎలా హాని కలిగిస్తుందనే దాని గురించి Instagram పోస్ట్‌ ద్వారా పంచుకున్నారు.

” చాలామంది బరువు తగ్గడానికి ఫాస్టింగ్ అనేది ఎంపిక చేసుకుంటారు. కానీ నిజానికి ఫాస్టింగ్ చేయడం ద్వారా చాలా వరకు మనిషి శరీరంలో చెడు మాత్రమే జరుగుతుంది. ఫాస్టింగ్ చేయడం ద్వారా మనిషి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. జీవితంలో సమతుల్యత అనేది ఉండదు. కాబట్టి మంచి పద్ధతుల్లో బరువు తగ్గడం ఎంతో ఉత్తమం. ఆరోగ్యకరమైనవి తినడం కూడా మన బరువు తగ్గించే ప్రక్రియలో భాగం చేసుకోవాలి. కానీ ఫాస్టింగ్ అనేది ఒక ఆప్షన్ అని నేను చెప్పను.” అని ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

“ఉపవాస సమయంలో బరువు తగ్గడం కండరాలు, ఎముకులు బలహీనపడడం ద్వారా కూడా రావచ్చు.” అంటూ ఆమె పోస్టులో ఆడ్ చేశారు.

UKలోని మాంచెస్టర్‌లో డిసెంబర్ 2022లో జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్ అండ్ ఎక్సర్సైజ్ న్యూట్రిషన్ కాన్ఫరెన్స్ (ISENC)లో అందించిన IF గురించిన తాజా పరిశోధనను ఆమె వివరనాత్మకంగా చెప్పడం జరిగిందిఎం.

“ఇన్సులిన్ సెన్సిటివిటీకి ఉపవాసం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని ఎటువంటి అధ్యయనాలు చూపించలేదు. వాస్తవానికి, ఇది IMTG (ఇంట్రామస్కులర్ ట్రయాసిల్‌గ్లిసరాల్)ని పెంచడం ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది” అని రుజుతా దివేకర్ రాశారు.

ఇది హాని చేస్తుందా?: 

ఉపవాసం కారణంగా గ్యాస్ట్రిక్ ఖాళీ అయ్యే ప్రక్రియను మందగిస్తుంది.

తరచుగా ఎసిడిటీ, తలనొప్పి, మలబద్ధకం, పీరియడ్స్ టైంకి రాకపోవడం వంటి బాధలతో బాధపడతారు.

కెఫీన్/సిగరెట్లపై ఆధారపడటం పెరిగింది.

మరుసటి రోజు ఉపవాసం కోసం ఎదురుచూస్తూ శరీరం కార్యకలాపాలు మరియు శక్తి వ్యయాన్ని తగ్గిస్తుంది.

ఉపవాసం లేకుండా స్థిరంగా బరువు తగ్గడానికి చిట్కాలు: 

లోకల్, అంతేకాకుండా టైంకి ఆహారాన్ని తినండి. 

ఇంట్లోనే ఎక్కువగా వండుకొని తినటం ఎంతో మంచిది. 

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

టైం కి సరిగా నిద్రపోవాలి.

మంచి సంబంధాలను పెంపొందించుకోండి. 

పోషకాహార ప్రపంచంలో ఉపవాసం వివాదాస్పదమైన అంశం అయినప్పటికీ, శరీర నిర్మాణం మరియు  జన్యుశాస్త్రం పరంగా ఇది శాస్త్రీయతంగా ఎప్పటినుంచో ఉంది.

ఉపవాసం గురించి పురాణాలు:

ఆటోఫాగి అనేది మన శరీరంలో వనరులు తక్కువగా ఉన్నప్పుడు, కష్టపడటానికి శరీరంలో జరిగే ఒక ప్రక్రియ. అత్యవసరమైన సమయాల్లో శరీరంలో మార్పు వస్తుంది. కానీ ఇది మంచి విషయం కాదు. 

శరీరంలో ఉండే కీటోన్లు అనేవి కొంత సమయం వరకు వ్యాయామం కోసం మాత్రమే పని చేస్తాయి కానీ ఎక్కువగా పని చేయడానికి పనికిరావు.

“ఉపవాసం అనేది సంస్కృతులలో ఎప్పటినుంచో ఉంది, ఆహారం మరియు బరువు తగ్గించే శరీర వ్యవస్థ దీనిని ఒక వ్యామోహమైన డైట్గా ఉపయోగించుకుంది. మనం తీసుకునే చాలా రకాల డైట్స్ బట్టి, ఇక్కడ అనేక రకాల సైంటిఫిక్ పేర్లు అనేవి పెట్టడం జరిగింది.” అని రుజుతా దివేకర్ సూచించారు.