ఉప్పు ఎక్కువగా తినేస్తున్న ఇండియ‌న్స్

ఉప్పు లేకపోతే.. ఎంత ఇష్టమైన డిష్‌ అయినా గొంతులోకి దిగదు. కూరలో కొంచెం ఉప్పు తగ్గినా.. రుచిగా ఉండదు. అదే ఉప్పు కొంచెం ఎక్కువైనా.. వంటకం కషాయంలా మారుతుంది. ఆరోగ్యం విషయంలోనూ అంతే. ఉప్పు వాడకం ఎక్కువైతే.. ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావాలు ఉంటాయి. ఉప్పు మన శరీరానికి అవసరమే.. శరీరానికి అవసరమైన సోడియం మనకు ఉప్పు నుంచి లభిస్తుంది. సోడియం మన శరీరంలో ద్రవ పదార్థాలన్నీ సమతూకంలో ఉండేలా చూస్తుంది. కండరాలూ నాడులూ సరిగ్గా పనిచేసేందుకు సహాయపడుతుంది. […]

Share:

ఉప్పు లేకపోతే.. ఎంత ఇష్టమైన డిష్‌ అయినా గొంతులోకి దిగదు. కూరలో కొంచెం ఉప్పు తగ్గినా.. రుచిగా ఉండదు. అదే ఉప్పు కొంచెం ఎక్కువైనా.. వంటకం కషాయంలా మారుతుంది. ఆరోగ్యం విషయంలోనూ అంతే. ఉప్పు వాడకం ఎక్కువైతే.. ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావాలు ఉంటాయి. ఉప్పు మన శరీరానికి అవసరమే.. శరీరానికి అవసరమైన సోడియం మనకు ఉప్పు నుంచి లభిస్తుంది. సోడియం మన శరీరంలో ద్రవ పదార్థాలన్నీ సమతూకంలో ఉండేలా చూస్తుంది. కండరాలూ నాడులూ సరిగ్గా పనిచేసేందుకు సహాయపడుతుంది. ఉప్పులో సోడియం 40 శాతమూ క్లోరైడ్‌ 60 శాతమూ ఉంటాయి. శరీరానికి రోజుకు రెండు గ్రాముల సోడియం చాలు. ఈ మోతాదు మించితే.. ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఉప్పు అతిగా తింటే.. ఎదుర్యే ఆరోగ్య సమస్యలు ఏమిటో చూద్దాం.

నిద్రలేమికి దారితీస్తుంది..

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే.. నిద్రలేమికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోవడానికీ.. ఉప్పు ఎక్కువగా తినడానికి సంబంధం ఉందని అంటున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరుగుతుంది, ఒంట్లోంచి నీరు సరిగా బయటకు వెళ్లకపోవటం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. మితిమీరు ఉప్పు తీసుకుంటే.. రాత్రి చాలాసార్లు మెలకువ రావడం, నిద్రలో చంచలమైన అనుభూతి వంటివి ఎదురవుతాయి.

బీపీ పెరుగుతుంది..

ఉప్పు ఎక్కువగా తింటే.. హైపర్‌టెన్షన్‌ పెరుగుతుంది. ఆహారంలో ఉప్పు ఎక్కువైనప్పుడు రక్తంలో సోడియం స్థాయులను నియంత్రణలో ఉంచడానికి నీటి శాతం పెరుగుతుంది. ఫలితంగా రక్తనాళాల గోడలపై ఒత్తిడి పెరిగి బీపీ ఎక్కువ అవుతుంది. దాంతో గుండెపోటు, స్ట్రోక్‌ రావడమే కీడ్నీ సమస్యలు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు.

మానసిక ఒత్తిడి పెరుగుతుంది..

ఉప్పు ఎక్కువగా తీంటే.. మానసిక ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కార్డియోవ్యాస్కులర్‌ రీసెర్చ్‌ పత్రికలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తింటే ఒత్తిడికి కారణమయ్యే హర్మోన్‌ మోతాదు 75% మేరకు పెరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బరో పరిశోధకులు గుర్తించారు. ఆందోళన, కోపం వంటి ప్రవర్తన మార్పులకూ ఉప్పు కారణం అవుతుందని పరిశోధకులు అంటున్నారు. 

ఎంత ఉప్పు తినాలి..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, అధిక సోడియం వినియోగం ( రోజుకు 2 గ్రాముల కంటే ఎక్కువ, 5 గ్రా ఉప్పు/రోజుకు సమానం), తగినంత పొటాషియం తీసుకోకపోవడం (రోజుకు 3.5 గ్రా/ కంటే తక్కువ) వల్ల హైపర్‌టెన్షన్‌, గుండె సమస్యలు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ, రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పును తీసుకోవాలని సిఫార్సు చేస్తోంది.

ఉప్పు ఎక్కువ తింటున్నారని ఎలా తెలుస్తుంది..?

ఎక్కువ దాహం: ఉప్పు ఎక్కువగా తినడం వల్ల దాహం ఎక్కువ వేస్తుంది. అందులోని సోడియం కారణంగా తరచుగా దాహం వేస్తుంది. శరీర నిర్జలీకరణ స్థాయిల మీద ప్రభావం చూపుతుంది.

ఉబ్బరం: ఎక్కువ ఉప్పు మిమ్మల్ని ఉబ్బరానికి గురి చేస్తుంది. ఎక్కువ నీళ్ళు శరీరంలో ఉండడం వల్ల ఉబ్బరంగా అనిపిస్తుంది. నీటిబరువు పెరుగుగుతుంది కాబట్టి ఉబ్బినట్టుగా అనిపిస్తారు.

తరచుగా తలనొప్పి: తలనొప్పి తరచుగా వస్తుంటే, అదీగాక నొప్పి తీవ్రస్థాయిలో ఉన్నట్లయితే అది ఉప్పు ఎక్కువగా తినడం వల్లే అయి ఉంటుందని గ్రహించాలి. సోడియం బ్యాలన్స్ తప్పిపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు కలుగుతుంటాయి.

శరీర భాగాల్లో వాపు: ఉప్పు నీటిని నిలిపి ఉంచుతుంది కాబట్టి శరీర భాగాల్లో వాపు ఏర్పడుతుంది. అది కొన్ని సార్లు నొప్పులకు దారి తీయవచ్చు. అవయవాలు బిగుతుగా మారడం లేదా సంచిలాగా వేలాడుతున్నట్లు మారడం మొదలగునవి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలుగుతాయి.

తిమ్మిర్లు, నొప్పులు: ఎక్కువ ఉప్పు కారణంగా శరీరంలో కాల్షియం మీద ప్రభావం పడుతుంది. దానివల్ల ఎముకలు బలహీనంగా మారే అవకాశం ఉంది. తిమ్మిర్లు, నొప్పులు ఎక్కువగా వచ్చే ప్రమాదమూ ఉంది.

ఉప్పు తీసుకోవడం ఎలా తగ్గించాలి

  • ఎల్లప్పుడు ఇంట్లో వండిన ఆహారాలు తీసుకోండి. మీ వంటకాలకు అదనపు ఉప్పును వేసే బదులు, హృదయానికి ఆరోగ్యాన్నిచ్చే మూలికలు, మసాలా దినుసులను ఉపయోగించడం ద్వారా కొంత రుచిని పొందవచ్చు.
  • ఎక్కువ ఉప్పు కంటెంట్‌ను కలిగి ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. ఎల్లప్పుడూ తాజా మాంసాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి.
  • నొప్పి నివారణ మాత్రలు, విటమిన్ సప్లిమెంట్స్ వంటి కరిగిపోయే మాత్రల్లో కూడా ఉప్పు ఉంటుందని మీకు తెలుసా? ఒక్కో టాబ్లెట్‌లో 1గ్రా ఉప్పును కలిగి ఉంటాయి. వీటికి బదులుగా క్యాప్సూల్ లేదా ప్రత్యామ్నాయ మందులు సూచించమని మీ వైద్యులను కోరండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక వ్యక్తి రోజులో 5 గ్రాములు లేదా ఒక చెంచాకు మించి సోడియం తీసుకోవద్దని సిఫారసు చేస్తుంది.

కూరలు వండే సమయంలో చాలామంది ముందే కారంతో పాటు ఉప్పు కూడా వేసేస్తుంటారు. కానీ కూర పూర్తిగా ఉడికిన తర్వాత.. దానిపై నుంచి కాస్త ఉప్పు చల్లినా రుచికి సరిగ్గా సరిపోతుందంటున్నారు నిపుణులు. సాస్‌లు, నిల్వ పచ్చళ్లు.. మొదలైన వాటిలో ఉప్పు మోతాదుకు మించి ఉంటుంది. ఇలాంటివి అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. ఇవి తీసుకోవడం తగ్గించాలి.పెరుగు, సలాడ్స్‌, పండ్లు.. వంటి వాటిలో కూడా ఉప్పు చల్లుకొని తినడం కంటే నేరుగా తినడమే మంచిది.