వేసవి వేడిలో డబుల్ సన్ స్క్రీన్ రాస్తే మీ మోము మరింత కాంతివంతం అవుతుంది.

వేసవికాలంలో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ రాసుకోవాలి. లేకపోతే చర్మానికి హాని కలిగించే UV కిరణాల నుంచి రక్షించుకోవడం కోసం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలని చర్మ సంరక్షణ నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటే ఈ ఎండకి మరింత జిడ్డుగా మారుతుందని, చర్మం కూడా నల్లగా అయిపోతుందని అనుకుంటారు. కానీ అది కావడం అపోహ మాత్రమే. సూర్యుని నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాలవల్ల చర్మంపై […]

Share:

వేసవికాలంలో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ రాసుకోవాలి. లేకపోతే చర్మానికి హాని కలిగించే UV కిరణాల నుంచి రక్షించుకోవడం కోసం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలని చర్మ సంరక్షణ నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటే ఈ ఎండకి మరింత జిడ్డుగా మారుతుందని, చర్మం కూడా నల్లగా అయిపోతుందని అనుకుంటారు. కానీ అది కావడం అపోహ మాత్రమే. సూర్యుని నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాలవల్ల చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఒక్కోసారి అవి చర్మ క్యాన్సర్ కి కారణం కావచ్చు, వీటినుంచి బయట పడాలంటే సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం తప్పనిసరి చేసుకోవాలి. వేసవికాలంలో సన్ స్క్రీన్ ఒక్కసారి మాత్రమే కాదు రెండుసార్లు రాసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది అదనపు రక్షణను అందించడంతోపాటు మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఆ ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డబుల్ సన్ స్క్రీన్ అనేది మీ ముఖంపై అదనపు రక్షణ పొరను అందించడానికి డబుల్ సన్ స్క్రీన్ ఉపయోగించాల్సి ఉంటుంది. మీ చర్మంపై ఎక్స్ట్రా లేయర్ ను ఇది ఏర్పాటు చేస్తుంది. ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ రష్మీ శెట్టి డబుల్ సన్ స్క్రీన్ ఎలా అప్లై చేయాలి. ఎందుకు ఉపయోగించుకోవాలో పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. డాక్టర్ శెట్టి మాట్లాడుతూ.. డబుల్ సన్ స్క్రీన్ ను అప్లై చేయడం అంటే మీరు ఒకేసారి రెండు సన్ స్క్రీన్ లను ఉపయోగిస్తున్నారని అర్థం. ముందుగా మీరు విటమిన్ సి, ఫైలురోనిక్ యాసిడ్ కలిగి ఉన్న సన్ స్క్రీన్ ను ఎంచుకోవాలి. ముందుగా మీ ముఖానికి ఈ సన్ స్క్రీన్ లను అప్లై చేసుకోవాలి. ఆ తరువాత కాంపాక్ట్ గా ఉండే పౌడర్ ను సన్ స్క్రీన్ పైన రాసుకోవాలి. ఇది సన్ స్క్రీన్ ను లాక్ చేయడంతో పాటు మీకు అవసరమైన సన్ ప్రొటెక్షన్ లేయర్ ని కూడా ఫామ్ చేస్తుంది.  

వేసవికాలంలో  (SPF) ఎస్.పి.ఎఫ్ ఉండే సన్ స్క్రీన్ ను మాత్రమే ఉపయోగించాలి. అది కూడా ఎందుకు ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి వేడి తాపం వలన చర్మం నిర్జీవంగా మారిపోతుంది ముఖ్యంగా ఎండలోకి వెళ్ళినప్పుడు మీ ముఖం కమీలిపోయినట్టుగా అనిపిస్తుంది అదే ఎస్.పి.ఎఫ్ కలిగి ఉన్న సన్ స్క్రీన్ ని గనక రాసుకుంటే కనుక UVA, UVB కిరణాల నుంచి సన్ స్క్రీన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రతిరోజూ రాసుకోవడం వల్ల సూర్య కిరణాల నుంచి మీ ముఖంతో పాటు మీ చర్మానికి కూడా సంరక్షణ లభిస్తుంది. మీ రొటీన్ లైఫ్ లో సన్ స్క్రీన్ ను తప్పనిసరిగా వాడాలి. ముఖ్యంగా మీ ముఖానికి ఎలాంటిది నప్పుతుందో కూడా తెలుసుకోవాలి.

సన్ స్క్రీన్ డబుల్ లేయర్ ఎలా అప్లై చేయాలో డాక్టర్ కల్రా 3 ప్రధానమైన చిట్కాలను తెలిపారు.

ముందుగా రెండువేళ్ళ మీద మాత్రమే సన్ స్క్రీన్ రాసుకుని ముఖంతో పాటు మెడ వీపు భాగానికి కూడా రాసుకోవాలి. ఒకసారి రాసిన తర్వాత రెండోసారి రాసే సన్ స్క్రీన్ మిమ్మల్ని ఎండ నుంచి రక్షించటంతో పాటు బయట ఎండ నుంచి చర్మానికి హాని కలగకుండా కూడా చేస్తుంది.

డబుల్ సన్ స్క్రీన్ మేకప్ ఫినిషింగ్ కూడా ఇస్తుంది. రెండు రకాల సన్ స్క్రీన్ రాసి ఆపైన కాంపాక్ట్ పౌడర్ రాయడంతో సూర్యుని కిరణాలు మీ చర్మాన్ని తాగినా కూడా సన్ స్క్రీన్ డబుల్ లేయర్ మీ చర్మానికి ఎలాంటి హాని కలగకుండా చూస్తుంది. సన్ స్క్రీన్ మీ ముఖంపై 80 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఏ సన్ స్క్రీన్ అయినా ఎక్కువసేపు మీ ముఖంపై ఉండదని గుర్తుంచుకోండి అదే డబుల్ లేయర్ కనుక అప్లై చేస్తే మాత్రం అంతకుమించినా ప్రభావంతమైన ఫలితాలను మాత్రం కలిగిస్తుందని గుర్తుంచుకోవాలి. సన్ స్క్రీన్ ను ఒక్కసారి మాత్రమే కాకుండా డబుల్ లేయర్ అప్లై చేస్తే కనుక బోలెడన్ని ప్రయోజనాలు పొందొచ్చు అంటున్నారు చర్మం నిపుణులు ఈ వేసవిలో మరి మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వండి.