మునగాకు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా?

గత కొన్ని సంవత్సరాలుగా మునగకాయలకు ఆయుర్వేద శాస్త్రంలో కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది.  ఒక్క మునగకాయ వల్ల మాత్రమే కాదు మునగ ఆకుల వల్ల కూడా మానవ శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా మనకు మధుమేహం, రక్తహీనత, కాలేయం మరియు గుండె జబ్బులు, శ్వాస కోశ, చర్మ, జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు… కీళ్లనొప్పులు వంటి పలు రకాల 100 రోగాలను నయం చేసే శక్తి ఒక్క మునగకు మాత్రమే ఉంది. ఈ చెట్టు […]

Share:

గత కొన్ని సంవత్సరాలుగా మునగకాయలకు ఆయుర్వేద శాస్త్రంలో కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది.  ఒక్క మునగకాయ వల్ల మాత్రమే కాదు మునగ ఆకుల వల్ల కూడా మానవ శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా మనకు మధుమేహం, రక్తహీనత, కాలేయం మరియు గుండె జబ్బులు, శ్వాస కోశ, చర్మ, జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు… కీళ్లనొప్పులు వంటి పలు రకాల 100 రోగాలను నయం చేసే శక్తి ఒక్క మునగకు మాత్రమే ఉంది. ఈ చెట్టు యొక్క బెరడు, ఆకులు, పువ్వులు, పండ్లు, గింజలు ఆఖరికి నూనెను కూడా మనం ఉపయోగించుకోవచ్చు.

ముఖ్యంగా మన భారతదేశంలో సాంబార్ లాంటి ప్రత్యేకమైన వంటకాలను తయారు చేసేటప్పుడు మునగ కాయలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు.  మరి కొంతమంది మునగకాయలతో ఫ్రై లాంటి ఐటమ్స్ చేసుకొని తింటారు. దీనిని ఎలా చేసుకుని తిన్నా సరే మంచి రుచితో పాటు అంతకుమించి ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇక మునగ ఆకులను ఎండబెట్టి మరీ పొడిగా చేసుకొని తింటూ ఉంటారు.  దీని వల్ల కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని వైద్యులు సైతం చెబుతున్నారు. ఇకపోతే మునగ ఆకు పొడిలో మనకు లభించే పోషకాల విషయానికి వస్తే.. పెరుగు కంటే 9 రెట్లు ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది.

అరటి పండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం లభిస్తుంది. క్యారెట్ కంటే పది రెట్లు ఎక్కువ విటమిన్ ఏ లభిస్తుంది. అంతేకాదు.. పాల కంటే 17 రెట్లు ఎక్కువ కాల్షియం లభిస్తుంది. ఇక నారింజ పండ్ల కంటే 50% ఎక్కువ విటమిన్ సి, బచ్చలి కూర కంటే 25 రేట్లు ఎక్కువ ఇనుము మన శరీరానికి లభిస్తుంది. ఇకపోతే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగ వల్ల మనకు మరికొన్ని ప్రయోజనాలు కూడా కలుగుతాయి వాటి గురించి ఇప్పుడు చూద్దాం..

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ పరిశోధనలో 26 ఆమ్లాలలో 18 ఆమ్లాలు ఒక్క మునగలో ఉన్నాయని తేలింది. మానవ శరీరంలో కనిపించే ప్రోటీన్ల బిల్డింగ్ బ్లాక్స్ అది.. యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఆస్కార్బిక్ యాసిడ్ వంటి మూలకాలు ఆక్సికరణ ఒత్తిడికి దారి తీసే అణువులతో పోరాడతాయి. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మునగ ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇక మునగ ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధించడమే కాదు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో మునగ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

ఇకపోతే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడతాయి. ఇది చర్మవ్యాధులకు కారణమయ్యే కొన్ని శిలీంద్రాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అలాగే రక్తం, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాని కూడా దూరం చేస్తుంది. మునగ ఆకుల్లో రక్తం గడ్డకట్టే గుణాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటే ఇది గడ్డకట్టే సమయాన్ని కూడా తగ్గిస్తుంది.. ఫలితంగా రక్తస్రావం ఆగిపోతుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు నరాల క్షీణతను తగ్గించి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే ఆల్జీమర్స్ వ్యాధి లక్షణాల నుండి రక్షణ లభిస్తుంది. కాలేయాన్ని విషపూరితం కాకుండా ఆక్సీకరణం దెబ్బతినకుండా సురక్షితంగా ఉంచుతుంది.

ఇకపోతే మునగను అధికంగా తింటే కడుపునొప్పి, గ్యాస్, ఉబ్బసం, అతిసారం వంటి సమస్యలకు కారణం అవుతుంది. అలాగే దీని వేర్లు, పువ్వులు, బెరడులో కనిపించే కొన్ని రసాయనాలు గర్భిణీ స్త్రీలలో గర్భాశయ సంకోచాలకు కారణం అవుతాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు మునగకు దూరంగా ఉండటమే మంచిది.. అలాగే కొన్ని పదార్థాలు శిశువులకు మంచివి కావు. కాబట్టి బాలింతలు, పాలిచ్చే స్త్రీలు కూడా మునగకు దూరంగా ఉండాలి.