వే ప్రొటీన్ అంటే ఏంటి?

నేటి రోజుల్లో కేవలం యువతే కాదు.. ప్రతి ఒక్కరూ కండరాల స్ట్రెంత్ మీద ఫోకస్ చేస్తున్నారు. కండరాల బలం పెంచుకునేందుకు అనేక రకాల మిశ్రమాలను వాడుతున్నారు. అలా వాడుతున్న మిశ్రమాల వల్ల కొంత మంది గుడ్ రిజల్ట్స్ పొందుతుంటే కొంత మంది మాత్రం అంతగా మంచి రిజల్ట్స్ పొందలేకపోతున్నారు. అయినా కానీ చాలా మంది ఇవి వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. కానీ చాలా పదార్థాల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎంత దారుణంగా ఉంటున్నాయంటే […]

Share:

నేటి రోజుల్లో కేవలం యువతే కాదు.. ప్రతి ఒక్కరూ కండరాల స్ట్రెంత్ మీద ఫోకస్ చేస్తున్నారు. కండరాల బలం పెంచుకునేందుకు అనేక రకాల మిశ్రమాలను వాడుతున్నారు. అలా వాడుతున్న మిశ్రమాల వల్ల కొంత మంది గుడ్ రిజల్ట్స్ పొందుతుంటే కొంత మంది మాత్రం అంతగా మంచి రిజల్ట్స్ పొందలేకపోతున్నారు. అయినా కానీ చాలా మంది ఇవి వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. కానీ చాలా పదార్థాల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎంత దారుణంగా ఉంటున్నాయంటే ఒక్కోసారి ఇవి మనుషుల ప్రాణాలనే తీసేంత దారుణంగా ఉంటున్నాయి. ఇటువంటి వార్తలను విన్నపుడు మనం మజిల్ స్ట్రెంత్ కోసం వాడే ప్రోటీన్స్ మీద తప్పకుండా డౌట్ రెయిజ్ అవుతుంది. అందుకే మనం మజిల్స్ స్ట్రెంత్ గురించి ప్రొటీన్స్ తీసుకునేటపుడు ఒకటికి రెండు సార్లు వాటిని తనిఖీ చేయాలి. లేకపోతే మనం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. 

వే ప్రొటీన్

మనలో చాలా మందికి వెయ్ ప్రొటీన్ గురించి ఎక్కువగా తెలియదు. కానీ వే ప్రొటీన్ ను కూడా కండరాల స్ట్రెంత్ కోసం ఉపయోగిస్తారు. ఈ ప్రొటీన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతే కాకుండా మనకు చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అందుకోసమే చాలా మంది వెయ్ ప్రొటీన్ ను వాడుతూ ఉంటారు. ఈ ప్రొటీన్ కేవలం మన మజిల్స్ స్ట్రెంత్ ను పెంచడం మాత్రమే కాకుండా ఇంకా అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కావున మనం ఈ ప్రొటీన్ ను ఎనర్జీ డ్రింక్ గా తీసుకోవడం చాలా మంచిది. ఈ మిల్క్ ప్రొటీన్ ను ప్రొటీన్ షేక్ గా అయినా కానీ లేదా మిల్క్ స్మూతీగా అయినా కానీ ఉపయోగించొచ్చు. అనేక రకాలుగా ఈ ప్రొటీన్ ను ఉపయోగించి మనం ప్రయోజనాలు పొందొచ్చు. 

కొవ్వును కరగదీస్తుంది… 

నేటి రోజుల్లో అనేక మంది సఫర్ అవుతున్న ప్రాబ్లం… అధిక కొవ్వు. అధిక కొవ్వు ఉందని కొంత మంది తమకు ఇష్టమైన వంటకాలను తినడం కూడా మానేస్తారు. అయినా కానీ వారికి మాత్రం కొవ్వు అనేది అనుకున్నంతగా తగ్గదు. ఈ పాల విరుగుడు ప్రొటీన్ ను ఉపయోగించడం ద్వారా కేవలం మజిల్స్ స్ట్రెంత్ పెంచుకోవడం మాత్రమే కాకుండా మన శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును బర్న్ చేసే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఇది కేవలం మన మజిల్స్ స్ట్రెంత్ ను పెంచడం మాత్రమే కాకుండా మీ బలాన్ని కూడా పెంచుతుంది. దీనిని ఇలా మాత్రమే యూజ్ చేయాలనే నిబంధన (రూల్) ఏమీ లేదు. దీనిని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. దీనిని సింపుల్ పద్ధతుల్లో యూజ్ చేసి మంచి లాభాలను పొందొచ్చు. 

ఎలా వాడాలంటే… 

ఈ ప్రొటీన్ ను యూజ్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అందులో చాలా సింపుల్ మార్గం (వే) ప్రొటీన్ మిల్క్ షేక్ చేసుకోవడం. ఇది అన్నింటికన్నా చాలా ఈజీ. ఇందుకోసం మీరు పాలవిరుగుడు ప్రొటీన్ ను ఒక గ్లాస్ లేదా బాటిల్ వంటి దానిలో తీసుకుని అందులో పాలు లేదా వాటర్ వంటివి కలిపితే సరిపోతుంది. ఆ పౌడర్ కలిసేలా బాగా మిక్స్ చేసి ఆ షేక్ ను మీరు తాగొచ్చు. ఇంకా అవసరం అనుకుంటే ఆ షేక్ లో మీకు ఇష్టమైన గింజలు, వెన్న, కూరగాయలను వేసుకుని తయారు చేసుకోవచ్చు. కేవలం మిల్క్ షేక్ రూపంలో మాత్రమే కాకుండా స్మూతీ బౌల్స్ రూపంలో కూడా మీరు ఈ ప్రొటీన్ ను తీసుకోవచ్చు. ప్రొటీన్ ఐస్ క్రీం రూపంలో, ప్రొటీన్ వోట్స్, ప్రొటీన్ పాన్ కేక్ వంటి వాటి రూపంలో ఈ ప్రొటీన్ ను మీరు ఆహారంగా తీసుకోవచ్చు. దీనిని మనం చాలా ఈజీగా తీసుకోవచ్చు కనుక మజిల్ స్ట్రెంత్ కోసం వేరే ఏదైనా ట్రై చేసే ముందు దీనిని ట్రై చేయడం ఉత్తమం. 

వేరే ప్రొడక్టులు ట్రై చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమోనని భయం కూడా ఉండడం సహజం. అందుకోసమే సింపుల్ గా ఉండే ఈ పాలవిరుగుడు ప్రొటీన్ ను ట్రై చేయడం చాలా ఉత్తమం. దీని వల్ల రిజల్ట్స్ కూడా చాలా బెటర్ గా ఉంటాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అనేక సందర్భాల్లో సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది కావున ఇది బెటర్ ఆప్షన్.