అందమైన దంతాల కోసం ఏం చేయాలి అంటే

అందంగా ఉండాలి అని ఎవరు కోరుకోరూ? ప్రపంచం అంతా తాము అందంగా ఉండాలి అనే భావిస్తుంది. అందులోనూ అందమైన మోము కోసం తహ తహ లాడుతు ఉంటారు.అందమైన మోము కోసం ఎన్ని మెరుగులు దిద్ధినా చక్కటి చిరునవ్వు ముందు ఏదీ ఆనదు.చిరునవ్వు కి ప్రధానమైనది అందమైన పల్లు,పల్లు కేవలం అందంగా,మరియు తెల్లగా ఉంటే సరిపోదు.ఆరోగ్యంగా  మరియు దృఢంగా ఉండాలి. కానీ చాలామంది పళ్ళ మీద పసుపు లేదా గోధుమ రంగులో గార పడుతుంది దాని వలన పళ్ళు […]

Share:

అందంగా ఉండాలి అని ఎవరు కోరుకోరూ? ప్రపంచం అంతా తాము అందంగా ఉండాలి అనే భావిస్తుంది. అందులోనూ అందమైన మోము కోసం తహ తహ లాడుతు ఉంటారు.అందమైన మోము కోసం ఎన్ని మెరుగులు దిద్ధినా చక్కటి చిరునవ్వు ముందు ఏదీ ఆనదు.చిరునవ్వు కి ప్రధానమైనది అందమైన పల్లు,పల్లు కేవలం అందంగా,మరియు తెల్లగా ఉంటే సరిపోదు.ఆరోగ్యంగా  మరియు దృఢంగా ఉండాలి. కానీ చాలామంది పళ్ళ మీద పసుపు లేదా గోధుమ రంగులో గార పడుతుంది దాని వలన పళ్ళు అసహ్యంగా కనిపిస్తాయి. 

మరి దంతాలను శుభ్రంగా మరియు అందంగా కనిపించేటట్టు ఉంచుకోవడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.అవేమిటో తెలుసుకుందాం

*దంతాలను ఎప్పుడు రెండు సార్లు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది

*సరైన బ్రష్ నీ ఎంచుకోవడం తప్పని సరి,కొన్ని బ్రష్ మి పల్ల పై ఉన్న క్రిముల  తో పాటు దంతాల పై ఉన్న తెల్లటి పొర తొలగించేస్తుంది.అల చేయడం వల్ల పల్లు రాను రాను బలహీనంగా మారి పోయి రాలిపోయే ప్రమాదం ఉంది.

*ధూమపానం,వైన్ తాగడం, టీ మరియు కాఫీ లను తాగడం వల్ల కూడా దంతాలు పసుపు గా మారి పోతాయి.కనుక  వీలైనంత ధూమపానానికి,టి మరియు కాఫీ లకు దూరంగా ఉండడం అవసరం

*ఎల్లప్పుడూ నోటిని  పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కూడా పల్లు చాలా తెల్లగా కనబడుతాయి.క్రమం తప్పకుండా బ్రష్ చేయడం మరియు ఫ్లాసింగ్ చేయడం ద్వారా దంతాలు ఎప్పుడు తెల్లగా ఉంటాయి.అలాగే రొటీన్ డెంటల్ క్లీనింగ్ మి దంతాలను ఆరోగ్యంగా మరియు ప్రకాశ వంతంగా ఉంచుతాయి.

*ఆయిల్ పుల్లింగ్ ద్వారా కూడా పల్లు చాలా శుబ్రంగా ఉంటాయి.ఆయిల్ పుల్లింగ్ అనేది ఒక సంప్రదాయమైన ప్రక్రియ.ఈ ప్రక్రియ లో ఎదైన ఒక విత్తనం తో తీసిన నూనె నీ నోటిలో కొంత సమయం పాటు పుక్కలించాల్సి ఉంటుంది.నోటి పరిశుభ్రత నీ మెరుగుపరచడానికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగ పడుతుంది.అలాగే శరీరం లో ఉన్న విషపదార్థాలను కూడా ఈ ఆయిల్ పుల్లింగ్ అనే ప్రక్రియ తొలగిస్తుంది.

*మనం రోజూ వాడే టూత్ పేస్ట్ లో చాలా శాతం బేకింగ్ సోడా ఉంటుంది.ఇది దంతాల నుండి ఉపరితల మురకలని తొలగించడానికి తేలిక పాటి రాపిడి వలె పని చేస్తుంది.బేకింగ్ సోడా మి నోటి లో ఆల్కలిన్ వాతావరణాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది.ఇది బాక్టీరియా పెరుగుదల నీ నిరోధిస్తుంది.అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్ నీ పేస్ట్ లా చేసి పల్లకి రాయడం ద్వారా కూడా పల్లు కాంతివంతంగా తయారు అవుతాయి.

*కొన్ని సార్లు పల్లు కి ఆహారం వల్ల కూడా మరకలు అంటుతాయి.బెర్రీలు,సోడా, రెడ్ వైన్ మరియు కాఫీ లు దంతాల రంగు నీ మర్చివెస్తాయి.సాధ్యమైనంతగా ఈ పదార్థాలకు దూరంగా ఉంటే పల్లు కి మరకలు అంటకుండా ఉంటాయి.సోడా మరియు రంగులు కలిపి ఉన్న పదార్థాలు ను స్ట్రా సహాయం తో తాగడం వల్ల పల్లకి మరకలు అంటవు.

*అలాగే కొన్ని కొన్ని చికిత్సల ద్వారా కూడా దంతాలు తెల్లబడుతాయి. అందుకు దంత వైద్యులు బాగా సహాయ పడుతారు.దంత వైద్యులు దంతాలను తెల్లగా మార్చడానికి ఆఫీస్ బ్లీచ్,డైరెక్ట్ అర్ ఇన్ డైరెక్ట్ వెనీర్ లాంటి పద్ధతులను ఉపయోగిస్తారు.

ఇలా కొన్ని చిట్కాలను అలాగే చికిత్స లను పొందడం ద్వారా పళ్ళను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా అలాగే అందంగా ఉంచుకోవచ్చు.