గ్యాస్‌లైటింగ్ అంటే ఏంటి.. ఎలా త‌ప్పించుకోవాలి?

గ్యాస్‌లైటింగ్.. ఈ ప‌దం మ‌నంద‌రికీ కొత్తే. మ‌న భాష‌లో అయితే అబ‌ద్ధాలు చెప్తూ మ్యానిప్యులేట్ చేయ‌డం. ఈ గ్యాస్‌లైటింగ్ అనేది రిలేషన్‌షిప్స్‌లో ఎక్కువ‌గా ఉండే స‌మ‌స్య‌. అంటే ఇద్ద‌రు ప్రేమికుల్లో ఒక‌రు మోసం చేస్తూ.. పైగా తానే మోస‌పోతున్నాన‌ని మ్యానిప్యులేట్ చేయ‌డం. ఇలాంటివారి నుంచి మ‌న‌ల్ని మ‌నం ఎలా కాపాడుకోవాలి. ఎద‌టివారు గ్యాస్‌లైటింగ్ చేస్తున్నారు అంటే దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలుసుకుందాం. గ్యాస్ లైటింగ్ ఏంటో తెలుసా?? ప్రస్తుతం గ్యాస్ లైటింగ్ అనే పదం ఎక్కువగా […]

Share:

గ్యాస్‌లైటింగ్.. ఈ ప‌దం మ‌నంద‌రికీ కొత్తే. మ‌న భాష‌లో అయితే అబ‌ద్ధాలు చెప్తూ మ్యానిప్యులేట్ చేయ‌డం. ఈ గ్యాస్‌లైటింగ్ అనేది రిలేషన్‌షిప్స్‌లో ఎక్కువ‌గా ఉండే స‌మ‌స్య‌. అంటే ఇద్ద‌రు ప్రేమికుల్లో ఒక‌రు మోసం చేస్తూ.. పైగా తానే మోస‌పోతున్నాన‌ని మ్యానిప్యులేట్ చేయ‌డం. ఇలాంటివారి నుంచి మ‌న‌ల్ని మ‌నం ఎలా కాపాడుకోవాలి. ఎద‌టివారు గ్యాస్‌లైటింగ్ చేస్తున్నారు అంటే దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలుసుకుందాం.

గ్యాస్ లైటింగ్ ఏంటో తెలుసా??

ప్రస్తుతం గ్యాస్ లైటింగ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. అసలు ఈ గ్యాస్ లైటింగ్ అంటే ఏంటని చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. ఇది కూడా ప్రమాదకమైందేనా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లైటింగ్ అంటే మరేం లేదు… సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే ఇది కూడా ఒక హరాస్ మెంట్ వంటిదో. ఒక వ్యక్తి విషపూరితమైన ప్రవర్తనను గ్యాస్ లైటింగ్ అని పిలుస్తారు. ఇందులో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నియంత్రించడానికి సంబంధంలో ఉన్న వ్యక్తిని మార్చటానికి ప్రయత్నిస్తుంటాడు. గ్యాస్‌లైటింగ్ అనేది ఒక వ్యక్తి మరో వ్యక్తిని మానిపులేట్ చేయడం అని కూడా అంటారు. థెరపిస్ట్ లు చెప్పే విధంగా గ్యాస్ లైటింగ్ కు అనేక కారణాలు ఉంటాయట. ఎవరైనా మనల్ని గ్యాస్ లైటింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటే మనం ఎలా తప్పించుకోవాలో కొంత మంది నిపుణులు వివరిస్తున్నారు. ఆ పద్ధతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం ఏదైనా వర్క్ చేస్తున్నపుడు కొంత మంది మనల్ని లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అది మన అథారిటీలైనా కావొచ్చు లేదా మన తోటి వర్కర్స్ అయినా కావొచ్చు కానీ మనం చేసేదానిని మార్చాలని ఎవరు ప్రయత్నించినా కానీ దానిని గ్యాస్ లైటింగ్ అనే అంటారు. వారు చేస్తున్న ప్రయత్నాలను మనం డేర్ గా ఎదుర్కోవాలి. వారికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగిపోకూడదు. అందుకోసమే మనల్ని మార్చేందుకు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మనం అస్సలుకే లొంగకూడదు. ఇలా మనం లొంగకుండా స్ట్రాంగ్ గా ఉన్నపుడు ప్రయత్నాలు చేసి.. చేసి వారే అలసిపోతారు. ఇక చివరికి మనం లొంగం అని తెలుసుకుని వారే మారిపోతారు. అప్పుడు ఏం చక్కా మనం మన పనిని పూర్తి చేసుకోవచ్చు. అంతే కాకుండా కొంత మంది వారి ఉద్దేశాలను మన మీద రుద్దాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి సమయంలో మనం సరైన ఉద్దేశంతో ఉన్నామని చాలా క్లియర్ కట్ గా వర్క్ చేస్తున్నామని వారికి తెలిసేలా చేయాలి. అప్పుడు కూడా వారు మనల్ని డిస్ట్రబ్ చేసేందుకు ప్రయత్నించరు. 

మీ కోసం మీరు ఫైట్ చేయండి.. 

కొన్ని కొన్ని సార్లు ఎదుటి వారు మనల్ని లొంగదీసుకునేందుకు ట్రై చేసినపుడు మనం లొంగకపోతే వారు మన మీద రకరకాల ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలో మనకోసం మనం ఫైట్ చేయడం చాలా అవసరం. ఎంత హింస ఎదురైనా కానీ మనం ఫైట్ చేయాలి. అప్పుడే మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో ఎదుటి వారికి తెలుస్తుంది. మనం వారితో వాదించే సమయంలో సంభాషణ ఒక్కోసారి గొడవగా మారే ప్రమాదం ఉంటుంది. ఇలా సంభాషణ గొడవగా మారిన ప్రతి సారి మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరంగా చిన్న విషయాలను పెద్దదిగా చేసుకోకూడదు. 

మనం ఎంత స్ట్రాంగ్ గా ఫైట్ చేసినా కానీ న్యాయం అనేది మన వైపుకు ఉండేలా మనం చూసుకోవాలి. న్యాయం మన వైపుకు ఉంటే నేడు కాకపోతే రేపైనా కానీ మనకు విజయం చేకూరే అవకాశం ఉంటుంది.