కాలేయాన్ని ఇలా ఆరోగ్యంగా ఉంచుకోండి

కాలేయం అనేది మన శరీరంలో ఎంత గొప్ప అవయవం. ఈ అవయవం కనుక సరిగ్గా వర్క్ చేయకపోతే మన బాడీ మొత్తం కంట్రోల్ తప్పుతుంది. కావున కాలేయ ఆరోగ్యం గురించి.. చాలా బాగా చూసుకోవాలని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే కాలేయాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకుందాం. ఇది మన శరీరంలో 500కు పైగా విధులు నిర్వర్తిస్తుంది. కాబట్టే దీని ఆరోగ్యం చూసుకోవడం చాలా అవసరం. కాలేయంలో  అనేక రకాల ప్రొటీన్లు ఉంటాయని మన అందరికీ […]

Share:

కాలేయం అనేది మన శరీరంలో ఎంత గొప్ప అవయవం. ఈ అవయవం కనుక సరిగ్గా వర్క్ చేయకపోతే మన బాడీ మొత్తం కంట్రోల్ తప్పుతుంది. కావున కాలేయ ఆరోగ్యం గురించి.. చాలా బాగా చూసుకోవాలని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే కాలేయాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకుందాం. ఇది మన శరీరంలో 500కు పైగా విధులు నిర్వర్తిస్తుంది. కాబట్టే దీని ఆరోగ్యం చూసుకోవడం చాలా అవసరం. కాలేయంలో  అనేక రకాల ప్రొటీన్లు ఉంటాయని మన అందరికీ తెలిసిన విషయమే. ఒక వేళ కాలేయం సరిగ్గా పని చేయకపోతే ఎలా దానికి చికిత్స చేసుకోవాలో పలువురు వైద్యులు చెబుతున్నారు. ఆ చిట్కాలు మీ కోసం.. 

ఒబేసిటీ వల్లే అసలు సమస్య..

కాలేయ సమస్య వచ్చేందుకు మరీ ముఖ్యంగా ఒబేసిటీ సమస్య దోహదం చేస్తుందని అనేక మంది వైద్యులు చెబుతున్నారు. మన లైఫ్ స్టైల్ ను సరిగ్గా సెట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మనం ఇష్టమున్న విధంగా జీవన శైలి ఏర్పరచుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని తెలుపుతున్నారు. మన శరీరం మీద ఎటువంటి దాడి జరిగినా కానీ కాలేయం ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. అటువంటి కాలేయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా కాలేయం చెడిపోవడానికి దారి తీస్తుందట. అతిగా ఆల్కహాల్ తీసుకోవడం కూడా కాలేయ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని పలువురు వైద్యులు చెబుతున్నారు. కావున కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఆల్కహాల్ తీసుకోకుండా ఉండడం చాలా అవసరం. ఒక వేళ ఆల్కహాల్ తీసుకున్నా కానీ లిమిట్ లో తీసుకోవాలి. అంతే కానీ ఇష్టమున్న విధంగా ఆల్కహాల్ తీసుకోవడం పలు సమస్యలకు దారి తీస్తుంది. 

పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా??

మన శరీరంలో ఏదైనా నొప్పి కలిగితే పెయిన్ కిల్లర్స్ వాడుతుండడం మనం చాలా సందర్భాల్లో చూసుంటాం. కానీ ఇలా ఇబ్బడిముబ్బడిగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల సమస్యలు వస్తాయి. ఈ పెయిన్ కిల్లర్స్ కాలేయానికి హాని కలిగిస్తాయి. అందుకోసమే పెయిన్ కిల్లర్స్ ను వైద్యుల సూచనతోనే తీసుకోవాలని ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వారు తీసుకోకూడదని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. కొంత మంది హలోపతి, ఆయుర్వేదం అని ఇష్టం వచ్చిన మందులను తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా ఇష్టం వచ్చిన మందులను తీసుకోవడం మంచిది కాదు. అరే వేరే వాళ్లకు ఈ మందులు బాగానే పని చేశాయి కదా మనకెందుకు పని చేయవంటే కుదరదు. ఒక్కోరి బాడీ ఒక్కోలా ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి మందులు వాడినా కానీ వైద్యుల సూచనతోనే వాడాలి. అలా కాకుండా మన ఇష్టానికి మందులను తీసుకుంటే అవి మనకు నష్టం చేకూరుస్తాయి. 

అది చాలా ముఖ్యం…

నేటి రోజుల్లో అనేక మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇలా అధిక బరువును మెయింటేన్ చేయడం కోసం అనేక విధాలుగా ఖర్చు చేస్తున్నారు. కొంత మంది జిమ్స్ కు వెళ్లి కష్టపడుతుంటే మరికొంత మంది మాత్రం ఆ పౌడర్, ఈ పౌడర్ అని వాడుతున్నారు. ఇలా ఇష్టమొచ్చిన పౌడర్లు వాడడం మంచిది కాదు. ఏదైనా కానీ న్యాచురల్ గా చేస్తేనే ఫలితం కాస్త ఆలస్యం అయినా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. 

ఈ చిట్కాలను పాటించండి..

కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ కింద పేర్కొన్న చిట్కాలను పాటిస్తే సరిపోతుంటది. అవేంటో ఓ లుక్కేద్దాం… 

  1. మద్యం అధికంగా తీసుకోవడం మానుకోండి. 
  2. క్రమమైన వ్యాయామం చేయండి. 
  3. మంచి లైఫ్ స్టైల్ మెయింటేన్ చేయండి.
  4. ఐడియల్ బాడీ వెయిట్ మాస్ ఇండెక్స్ (BMI) నిర్వహించండి. 
  5. హెపటైటిస్ బీ మరియు సీ కోసం స్క్రీనింగ్ చేయించుకోండి. 
  6. ఎప్పటికప్పుడు హెపటైటిస్ టీకాలు వేసుకోండి. 
  7. స్మోకింగ్ ను పూర్తిగా మానేయండి.
  8. ఓవర్ ది కౌంటర్ ప్రత్యామ్నాయ మందులను తీసుకోవడం మానేయండి.