ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన‌లు రాకుండా..

ప్రపంచంలో ఉన్న కోట్ల జనంలో ఎవరో ఒకరికి ఏదో ఒక క్షణంలో ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన రావడం కామన్. అటువంటి ఆలోచనలు వచ్చినంత మాత్రాన మనిషి బలహీన పడినట్లు కాదు, నిరంతరంగా ఆలోచించడం వల్ల, అనవసరమైన ఆలోచనలు కారణంగా, మనిషి ఆలోచన విధానం పక్కదారి పట్టి ఆత్మహత్య అనే ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఆలోచనలు మాకే ఎందుకు వస్తున్నాయి అని సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో […]

Share:

ప్రపంచంలో ఉన్న కోట్ల జనంలో ఎవరో ఒకరికి ఏదో ఒక క్షణంలో ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన రావడం కామన్. అటువంటి ఆలోచనలు వచ్చినంత మాత్రాన మనిషి బలహీన పడినట్లు కాదు, నిరంతరంగా ఆలోచించడం వల్ల, అనవసరమైన ఆలోచనలు కారణంగా, మనిషి ఆలోచన విధానం పక్కదారి పట్టి ఆత్మహత్య అనే ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఆలోచనలు మాకే ఎందుకు వస్తున్నాయి అని సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఇటువంటి ఆలోచనలు చేయడం సహజం. కానీ ఇటువంటి ఆలోచనలు మరింత ముందుకు వెళ్లకుండా చూసుకోవాలి. అయితే ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇటువంటి ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి? ఈరోజు తెలుసుకుందాం.. 

మాట్లాడాలి: 

మీకు ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులను ఆశ్రయించడం మంచిది. . మీకు బాగా కావాల్సిన వారిని, మీరు నమ్మిన వారిని సంప్రదించి మీకు వస్తున్న ఆలోచనల గురించి మాట్లాడండి. ఒకవేళ మీరు ఎవరుని సంప్రదించాలో తెలియని క్రమంలో, క్రైసిస్ కౌన్సెలర్ ను సంప్రదించడం ఎంతో మొత్తం. వారు దయతో వింటారు.. సలహా ఇస్తారు.

మంచి ప్లేస్ కి వెళ్ళండి: 

స్నేహితుని ఇల్లు, లైబ్రరీ లేదా ఇతర పబ్లిక్ ఏరియా వంటి సురక్షితమైన, సంతోషకరమైన ప్రదేశం ఆత్మహత్య ఆలోచనలను నిరోధించడంలో సహాయపడుతుంది. మీరు మీ స్వంత ఇంటిలో కొత్త రూమ్ కి మారడం వంటివి కూడా చేయడం ఉత్తమం.

ప్రేరేపించే వస్తువులకు దూరంగా ఉండండి: 

కత్తులకు, తుపాకులు మరియు ఇతర ఆత్మహత్య విషయాలకు ఎంతవరకు దూరంగా ఉంటే అంత ఉత్తమం. అంతేకాకుండా ఎక్కువగా మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సమయాన్ని గడపడానికి చూడండి. ఒంటరిగా ఉండడాన్ని నిరోధించండి. ఒకవేళ మీరు ఏదైనా మెడిసిన్ వాడుతున్నట్లయితే, వాటిని క్రమం తప్పకుండా వాడేందుకు చూడండి.

ఆల్కహాల్, ఇతర డ్రగ్స్ నుండి దూరంగా ఉండండి: 

ఆల్కహాల్ అంతేకాకుండా ఇతర మాదకద్రవ్యాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా ఆల్కహాల్ మాదకద్రవ్యాలు మీద దృష్టి ఉన్నట్లయితే అవి మీ ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలను మరింత ప్రేరేపింపచేస్తాయి. అందుకే వాటికి దూరంగా ఉండటమే ఉత్తమం.

కొన్ని ప్రణాళికలు వేసుకోండి: 

మీకు మీరుగా అటువంటి ఆలోచనల నుంచి బయటికి రావాలని పదేపదే అనుకోండి. అటువంటి ఆలోచనల నుంచి పక్కదారి పట్టించే మరెన్నో విషయాలు ఉన్నాయని గ్రహించండి. ముఖ్యంగా చెప్పాలంటే, మీరు ఒక పెంపుడు జంతువుని పెంచుకుంటూ సమయాన్ని గడపొచ్చు. శ్వాసను అనుసరిస్తూ ప్రశాంతంగా మారొచ్చు. ప్రతిరోజు వ్యాయామం చేస్తూ మీ ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.

విరామం: 

జీవితంలో విరామం అనేది చాలా అవసరం. మీకు ఇష్టమైన ఆహారం ఆస్వాదించడం, సంగీతం వినడం లేదా ప్రియమైన వారివి, జంతువుల చిత్రాలను లేదా వీడియోలు చూడటం ద్వారా మీరు ప్రశాంతంగా మారడమే కాకుండా, తక్కువ ఆందోళన చెందుతారు.

స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి: 

మీ శారీరక అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఒక రకంగా ఆత్మహత్య ఆలోచనలను తగ్గించడంలో సహాయపడకపోవచ్చు. అయినప్పటికీ, మీ శారీరక అవసరాలు ఒకానొక సమయంలో మీ ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనను పక్కన పెట్టడానికి సహాయపడితే.. దాన్ని మరింత పాటించండి. సమతుల్య భోజనం తినడానికి ప్రయత్నించండి, తగినంత నీరు త్రాగండి, కొంత శారీరక వ్యాయామంలో పాల్గొనండి, మీ ఇంటి చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేయండి అదేవిధంగా ప్రతి రాత్రి తగినంత గంటలు నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోండి.