తోబుట్టువులు లేరా.. రక్షాబంధన్ ఇలా జరుపుకోండి

రక్షా బంధన్ కేవలం తెలుగు వారనే కాకుండా దేశం మొత్తం జరుపుకునే పండుగ ఇది. కొంత మందికి తోబుట్టువులు ఉండరు అటువంటి వారు రక్షాబంధన్ వేళ చిన్నబోతుంటారు. ఈ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. సోదరుల జీవితం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, మన జీవితాంతం సోదరులు తోడుగా నీడగా ఉండాలని ఆశించి కట్టేదే రాఖీ అని చాలా పురాణాల్లో చెప్పారు. రాఖీని కేవలం సోదరులు ఉన్న వారు మాత్రమే కాకుండా సోదరులు లేని వారు […]

Share:

రక్షా బంధన్ కేవలం తెలుగు వారనే కాకుండా దేశం మొత్తం జరుపుకునే పండుగ ఇది. కొంత మందికి తోబుట్టువులు ఉండరు అటువంటి వారు రక్షాబంధన్ వేళ చిన్నబోతుంటారు. ఈ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. సోదరుల జీవితం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, మన జీవితాంతం సోదరులు తోడుగా నీడగా ఉండాలని ఆశించి కట్టేదే రాఖీ అని చాలా పురాణాల్లో చెప్పారు. రాఖీని కేవలం సోదరులు ఉన్న వారు మాత్రమే కాకుండా సోదరులు లేని వారు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చునని పలువురు చెబుతున్నారు. ఈ పండుగ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సోదరసోదరీమణులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పండుగ ఎప్పుడు వస్తుందా అని వారు వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ ఏడాది రాఖీ పండుగ విషయంలో కొంత అస్పష్టత నెలకొని ఉందనే మనం చెప్పాలి. ఆగస్టు 30 లేదా ఆగస్టు 31 తేదీలలో ఈ పండుగ ఎప్పుడనే విషయంలో చాలా మందికి క్లారిటీ లేదు. ఈ పండుగ ఆగస్టు 30వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ప్రారంభం అవుతుందని పలువురు చెబుతున్నారు. అందుకోసమే ఈ పండుగను 30 మరియు 31 రెండు తేదీలలో జరుపుకోవచ్చని చెబుతున్నారు. ఇక ఈ పండుగ పూట ఎటువంటి పనులు చేయాలో ఎటువంటి పనులు చేయకూడదో చాలా మంది వివరించారు. ఒక్క విషయంలో మాత్రం అంతా చింతిస్తుంటారు. సోదరుడు కనుక లేకపోతే రక్షాబంధన్ జరుపుకోవడం వీలుపడదా అని అందరూ ఆలోచిస్తుంటారు. అటువంటిదేం లేదు. ఒక వేళ మనకు సోదరుడు లేకపోయినా కానీ రాఖీని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ప్రముఖ లైఫ్ కోచ్ లు, మరియు నిపుణులు ఇదే మాట చెబుతున్నారు. 

వీరితో సెలబ్రేట్ చేసుకోండి… 

మనకు సోదరుడు లేకపోతే పండుగను మనం సెలబ్రేట్ చేసుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. సోదరుడు లేనంత మాత్రాన మనకు పండుగ లేనట్లు కాదు. సమాజంలో అనేక మంది ఉన్నారు కాబట్టి వారిలో ఎవరితోనే మన బంధాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ మరియు ఈ ప్రక్రియ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇటువంటి వారితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం వల్ల వారితో పాటు మీరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేసే అవకాశం ఉంది. అందుకోసమే ఈ సెలబ్రేషన్స్ కు మీరు కూడా సిద్ధం కండి.

బంధువులతో లేదా స్నేహితులతో

మనకు సోదరుడు లేకుంటే మనకు చాలా మంది బంధువులు లేదా స్నేహితులు ఉంటారు. వారితో కలిసి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు జీవితాంతం తోడుగా ఉండాలని ఒక వ్యక్తిని కోరడం. దాని కోసం మనకు సోదరుడే ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కానీ రాఖీని కట్టి పండుగను సెలబ్రేట్ చేసుకోవచ్చు. 

తండ్రులను కన్సిడర్ చేయండి…

మన లైఫ్ లో సోదరుడు లేకపోతే మనకు జన్మనిచ్చిన తండ్రిని కన్సిడర్ చేయొచ్చు. అతడికి కూడా రాఖీని కట్టి మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీకు జీవితంలో సహాయం చేసిన వ్యక్తికి రక్షా బంధన్ రోజు ఆప్యాయతలను చూపించడం చాలా అవసరం. మీరు పుట్టిన దగ్గరి నుంచి మీకు ఎన్నో విషయాలలో మీ తండ్రి తోడుగా ఉంటాడు కాబట్టి సోదరుడు లేకపోయినా కానీ అతడికి రాఖీని కట్టి సెలబ్రేట్ చేసుకోవడం ఉత్తమం.

కావాల్సిందల్లా కారణమే…. 

మనం సోదరుడికే రాఖీ కట్టాలనే నిబంధన ఎక్కడా లేదు. మన మీద కరుణ చూపే మనకు అత్యవసర సమయంలో సహాయం చేస్తారనే నమ్మకం ఉన్న ఎవరికైనా సరే మనం రాఖీని కట్టొచ్చు. మనం ఆసుపత్రిలో ఉన్న రోగులు లేదా సీనియర్ సిటిజన్ లు లేదా అనాధాశ్రమాల్లో ఉన్న పిల్లలతో కూడా కలిసి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవచ్చు.

మారిన ట్రెండ్

ఒకప్పుడు రాఖీ పౌర్ణమి అంటే ఒక రకమైన రాఖీలు ఉండేవి. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. రాఖీ పౌర్ణమి వేళ సోదరులతో పాటు సోదరీమణులు కూడా సెలబ్రేట్ చేసుకునే అవకాశం మారింది. ఒకప్పుడు డబ్బులను లేదా గిఫ్టులను ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఈ కామర్స్ జమానా నడుస్తోంది. అందుకోసమే అంతా ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఈ గిఫ్టు కార్డులను ఇస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ గిఫ్టు కార్డులను మాత్రమే తీసుకోవడం కాకుండా… సోదరీమణులు కూడా తమ సోదరుల క్షేమం కోసం ఆలోచిస్తున్నారు. వినూత్నంగా హెల్మెట్లు బహుమతులుగా ఇచ్చి తమ ప్రేమను చాటుకుంటున్నారు. కావున రక్షా బంధన్ వేళ మీ తోబుట్టువులతో కలిసి సంతోషంగా ఉండండి. ఈ రక్షా బంధన్ వేళ మీ సోదరుడితోనే పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని మాత్రమే కాకుండా మన మనసుకు దగ్గర ఉన్న వారితో సెలబ్రేట్ చేసుకుని ఆనందంగా ఉండండి.