మన రోజువారీ జీవితంలో వృత్తి మరియు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం ఎలా..?

మన రోజు వారి జీవితంలో ప్రొఫెషనల్ వర్క్ మరియు వ్యక్తిగత వర్క్స్‌ని బ్యాలన్స్ చెయ్యడం చాలా కష్టం. చాలామంది రోజులు మర్చిపోయి ఆదివారం కూడా పని చేస్తూ ఉంటారు. వాళ్ళకంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది అనే విషయం కూడా మర్చిపోతుంటారు.ఈ పోటీ ప్రపంచం లో ఇవన్నీ షరామామూలే, వీటి నుండి మనం తప్పించుకోలేము. కానీ వ్యక్తిగత జీవితానికి సరైన సమయం కేటాయించకపోవడం వల్ల కచ్చితంగా మన ఇళ్లల్లో గొడవలు వస్తూ ఉంటాయి. ఇక కొత్తగా పెళ్ళైన […]

Share:

మన రోజు వారి జీవితంలో ప్రొఫెషనల్ వర్క్ మరియు వ్యక్తిగత వర్క్స్‌ని బ్యాలన్స్ చెయ్యడం చాలా కష్టం. చాలామంది రోజులు మర్చిపోయి ఆదివారం కూడా పని చేస్తూ ఉంటారు. వాళ్ళకంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది అనే విషయం కూడా మర్చిపోతుంటారు.ఈ పోటీ ప్రపంచం లో ఇవన్నీ షరామామూలే, వీటి నుండి మనం తప్పించుకోలేము. కానీ వ్యక్తిగత జీవితానికి సరైన సమయం కేటాయించకపోవడం వల్ల కచ్చితంగా మన ఇళ్లల్లో గొడవలు వస్తూ ఉంటాయి. ఇక కొత్తగా పెళ్ళైన జంట గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. భార్య ఎప్పుడూ భర్త తనతో కలిసి కాసేపు సమయం గడపాలని కోరుకుంటుంది. కానీ భర్త పగలు నుండి రాత్రి పడుకునే వరకు పని చేస్తూనే ఉంటే ఇక ఆ భార్యకి ఎలా ఉంటుంది..?, కొన్ని కొన్ని సార్లు ఇలాంటివి విడాకులకు కూడా దారి తీస్తూ ఉంటుంది. అయితే వృత్తిపరమైన జీవితాన్ని మరియు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అనే దానిపై  యాంపిలో రిక్రూటింగ్ కంపెనీ CEO క్రిస్ ఛాన్సీ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

ప్రతి ఉద్యోగి కి ఉందే సమస్య ఇది, కానీ స్మార్ట్ వర్క్ చెయ్యడం వల్ల పని ఒత్తిడి తగ్గుతుందని, అందువల్ల వ్యక్తిగత జీవితానికి కూడా ప్రతీ రోజు తగిన సమయాన్ని కేటాయించొచ్చు అని క్రిస్ ఛాన్సీ తెలిపారు. క్లైంట్స్ యొక్క టార్గెట్స్‌ని చేరుకునేందుకు కంపెనీలలో మన మేనేజర్స్ మనపై పని ఒత్తిడి పెంచుతారు. చాలా మంది చేసేది ఏమిటంటే ఆ పని ఒత్తిడి ని భారంగా భావించడమే. అలా భారంగా భావిస్తే ఏపని అయినా ఆలస్యం అవుతుందని, కాబట్టి బుర్ర ప్రశాంతంగా ఉంచుకొని స్మార్ట్ వర్క్ చేస్తే అనుకున్న సమయం కన్నా ముందే పని అయిపోతుందని, అప్పుడు వ్యక్తిగత జీవితానికి ప్రతీ రోజు కావాల్సినంత సమయం ఇవ్వొచ్చు అని ఈ సందర్భంగా క్రిస్ ఛాన్సీ తెలిపారు. అంతే కాదు ప్రతీ పనికి ఒక షెడ్యూల్ ప్రకారం పెట్టుకొని , దానికి తగ్గట్టుగా పని చేసుకుంటూ పోతే కావాల్సినంత సమయం మిగులుతుందని క్రిస్ ఛాన్సీ వివరించాడు..

పనితో పాటు ఆరోగ్యం కూడా చూసుకోవడం తప్పనిసరి , ముఖ్యంగా ఐటీ రంగం లో పని చేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రాత్రి పగలు అని తేడా లేకుండా, నిద్రలు మాని మరీ పని చేస్తూ ఉంటారని, ఇందువల్ల ఆరోగ్యం చెడిపోతుందని, అప్పుడు చేయాల్సిన పనులు కూడా చెయ్యలేకపోతామని క్రిస్ ఛాన్సీ అన్నారు. ప్రతీ వారంలో వీకెండ్ ఏదైనా వెకేషన్‌కి వెళ్లడం వల్ల, మనిషికి శారీరకంగా , మానసికంగా ఎంతో ఉపశమనం కలుగుతుందని , అందువల్ల ఎలాంటి పనిని అయినా చాలా సులువుగా చెయ్యొచ్చని క్రిస్ ఛాన్సీ అభిప్రాయం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇష్టం లేని ఉద్యోగం చెయ్యడం అనేది నరకప్రాయం లాంటిది. సరిగా ఫోకస్ చెయ్యలేక, మన పైన ఉన్న వాళ్ళ చేత తిట్లు తింటూ , ఆన్ టైంలో వర్క్ డెలివరీ ఇవ్వలేక, ఉద్యోగం నుండి తప్పుకోవాల్సి పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది, కాబట్టి ఎంత సమయం పట్టినా ఇష్టమైన ఉద్యోగం దొరికే వరకు వేచి చూడండి. మనం సంపాదించేది కుటుంబ సభ్యులతో, ఇష్టమైన వాళ్ళతో ఎంతో సంతోషంగా జీవించడానికి. వృత్తికి న్యాయం చేస్తూ వ్యక్తిగత జీవితానికి అన్యాయం చెయ్యకూడదు. కాబట్టి రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం తప్పనిసరి అంటూ క్రిస్ ఛాన్సీ ఈ సందర్భంగా వివరించారు.