మధుమేహం కంటిచూపుని ఎలా క్షీనిస్తుంది?

డయాబెటీస్ ఉంటే కంటిలోని గాయాలు తగ్గే విషయంపై ప్రభావితం ఉంటుందని పరిశోధనలు చెప్తున్నారు, వైద్య పద్ధతుల ప్రభావాన్ని తగ్గించి మధుమేహంతో ముడిపడి ఉన్న రెండు కార్నియా మార్పులతో వచ్చే జబ్బులను గుర్తించారు. ఇలా గుర్తించడం ఇదే మొదటిసారి.  డయాబెటోలోజియా అనే రీసెర్చ్ జర్నల్లో ప్రచురించబడిన అధ్యయనంలో, ఈ మార్పులు జరగకుండా తిప్పికొట్టి కార్నియా తిరిగి వైద్యానికి స్పందించి పాక్షికంగా మెరుగుపడటానికి మూడు మార్గాలు ఉన్నాయని ఈ అధ్యయనం సూచిస్తుంది, దీనివలన భవిష్యత్తులో డయాబెటీస్ కోసం కొత్త చికిత్సలను […]

Share:

డయాబెటీస్ ఉంటే కంటిలోని గాయాలు తగ్గే విషయంపై ప్రభావితం ఉంటుందని పరిశోధనలు చెప్తున్నారు, వైద్య పద్ధతుల ప్రభావాన్ని తగ్గించి మధుమేహంతో ముడిపడి ఉన్న రెండు కార్నియా మార్పులతో వచ్చే జబ్బులను గుర్తించారు. ఇలా గుర్తించడం ఇదే మొదటిసారి. 

డయాబెటోలోజియా అనే రీసెర్చ్ జర్నల్లో ప్రచురించబడిన అధ్యయనంలో, ఈ మార్పులు జరగకుండా తిప్పికొట్టి కార్నియా తిరిగి వైద్యానికి స్పందించి పాక్షికంగా మెరుగుపడటానికి మూడు మార్గాలు ఉన్నాయని ఈ అధ్యయనం సూచిస్తుంది, దీనివలన భవిష్యత్తులో డయాబెటీస్ కోసం కొత్త చికిత్సలను కూడా కనిపెట్టవచ్చు. అధ్యయనం యొక్క సీనియర్ రీసెర్చర్ అలెగ్జాండర్ ల్జుబిమోవ్, PhD ప్రకారం, డయాబెటీస్ నిర్దిష్ట డిఎన్ఏలో (DNA) మార్పులను ఎపిజెనెటిక్ మార్పులు అని పిలుస్తారు, ఈ మార్పులు జన్యు మార్పులను ప్రభావితం చేసి కంటి వైద్యం పనిచేయటానికి దోహద అవుతాయి.

రీసెర్చ్ ఏం చెప్తోంది?

యునైటెడ్ స్టేట్స్లో డయాబెటీస్ సమస్యలు: యుఎస్ లో, 37 మిలియన్లకు పైగా జనాల్లో (జనాభాలో 11%) డయాబెటీస్, మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు నరాల బలహీనత వంటి వివిధ సమస్యలు ఇబ్బంది పడుతున్నాయి. ప్రస్తుతం డయాబెటీస్ కి మందులు ప్రధానంగా గ్లూకోస్ టాలరెన్స్ లేదా ఇన్సులిన్ సరఫరాపై దృష్టి పెట్టినవి కానీ ఇవి సెల్యులార్ మార్పులను పరిష్కరించవు. 70% మంది డయాబెటిక్ పేషెంట్లలో తరచుగా రెటీనా సమస్యలతో సంబంధం ఉన్న కార్నియా సమస్యలు ఎదుర్కొంటున్నారని గుర్తించడం చాలా అవసరం. పైగా డయాబెటీస్ ఎక్కువగా ఉన్నవారికి కంటి ఆపరేషన్లు చెయ్యటం ప్రమాదం. పనిచేయని కార్నియల్ మూలకణాల చికిత్స లేదా క్యాటరాక్ట్ సర్జరీ లేదా డయాబెటిక్ రెటినోపతికి లేజర్ చికిత్స వంటి ప్రక్రియల తర్వాత కంటిచూపు అసంపూర్ణంగా ఉంటుంది.

కార్నియల్ గాయం నయం అవ్వటానికి Wnt-5a పాత్ర కార్నియల్ గాయం నయం చేయడంలోనే కాకుండా వివిధ కణాలను విభజించగల మూలకణాల పనితీరుకి సిగ్నల్ ఇచ్చే ప్రోటీన్ ని Wnt-5a అంటారు, దీని కీలక పాత్రను పరిశోధనా అధ్యయనం హైలైట్ చేస్తోంది. డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువకాలం కంటి ఆరోగ్య సమస్యలను, డయాబెటిస్ సంబంధిత ఇతర గాయాలు నయం అవ్వటానికి కష్టపడుతూ ఉంటారు. అయితే, నయం అయ్యేందుకు అడ్డుగా ఉన్న కణాల మార్పులను అర్ధంచేసుకుని Wnt-5a ద్వారా సమస్యలకు పరిష్కారం వెతకటం ఈ అధ్యయనం ఉద్దేశం. ఈ అధ్యయనంలో, పరిశోధకులు డయాబెటిక్ పేషంట్స్ మరియు ఆరోగ్యకరమైన వ్యక్తుల నుండి కార్నియల్ కణాలను పోల్చారు, పుట్టినప్పుడు కన్నా డయాబెటీస్ నిర్దిష్ట డిఎన్ఏలో ఎపిజెనెటిక్ జన్యు మార్పులను గుర్తించారు. డయాబెటిక్ పేషంట్ల కార్నియాలలో Wnt-5a జన్యు ప్రోటీన్ ఉత్పత్తి తగ్గింది, వీటి స్థాయిలను మైక్రోఆర్ఎన్ఏలు పెరిగాయి.

మంచి వైద్య ఫలితాలు ఉండే అవకాశాలు:

ఈ బృందం మూడు పద్ధతుల్లో కార్నియల్ కణాలు అభివృద్ధి చెందేలా పరీక్షించింది: డయాబెటీస్ నిర్దిష్ట డిఎన్ఏలో జన్యు మార్పలను నియంత్రించడానికి Wnt-5a ప్రోటీన్‌కు DNA మిథైలేషన్ ఇన్హిబిటర్ ను జోడించి ( ఇది సాధారణంగా క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు) మరియు మైక్రోఆర్ఎన్ఏ స్థాయిలను టార్గెట్ చేసేందుకు నానోస్కేల్ జన్యు చికిత్స విధానాన్ని ఉపయోగించారు.  ఈ మూడు పద్ధతులలోనూ విజయవంతంగా స్టెమ్ సెల్ మార్కర్ ఉత్పత్తి మొదలు అయ్యి  డయాబెటిక్ పేషంట్స్ లో మెరుగైన కణాల పునరుత్పత్తిని వేగవంతం అయ్యింది. కొనసాగుతున్న పరిశోధనలో Wnt-5a ప్రొటీన్ల స్టేయి తగ్గకుండా చూసుకుని, డయాబెటీస్ నిర్దిష్ట డిఎన్ఏలో జన్యు మార్పలను ఆపగలిగితే ఈ రియాక్షన్లో పాల్గొన్న ఇతర సంబంధిత జన్యువులపై లోతైన అవగాహనను పొందవచ్చు. అదే లక్ష్యంగా మైక్రోఆర్ఎన్ఎ మరియు DNA మిథైలేషన్ రెండింటినీ టార్గెట్ చేసి అదుపులో పెట్టగలిగితే Wnt-5a ప్రోటీన్ స్థాయి పెరిగి కంటి వైద్యం డయాబెటిక్ పేషంట్స్ లో కూడా పనిచేస్తుంది.