ఇంట్లోనే తయారు చేసుకునే నైట్ క్రీమ్‌లు

నైట్ క్రీమ్స్ నేటి కాలంలో మహిళలతోపాటు పురుషులు కూడా తమ ముఖాలు యవ్వనంగా, ముడతలు లేకుండా, ప్రకాశవంతంగా కనిపించడానికి అదనపు శ్రద్ధ తీసుకుంటున్నారు. దీనికోసం అనేక పద్ధతులు ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా అనేకమంది పగటి పూట అనేక క్రీములు రాస్తుంటారు. అయితే పగటిపూట రాసే క్రీముల కంటే రాత్రి పూట ముఖానికి అప్లయి చేసుకునే క్రీములు అధిక ప్రభావాన్ని చూపిస్తాయి. రాత్రి పూట ముఖంపై ఏమీ రాయకపోతే ఉదయం నిద్ర లేవగానే చర్మం నిర్జీవంగా, పొడి బారినట్లు కనిపిస్తుంది. […]

Share:

నైట్ క్రీమ్స్


నేటి కాలంలో మహిళలతోపాటు పురుషులు కూడా తమ ముఖాలు యవ్వనంగా, ముడతలు లేకుండా, ప్రకాశవంతంగా కనిపించడానికి అదనపు శ్రద్ధ తీసుకుంటున్నారు. దీనికోసం అనేక పద్ధతులు ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా అనేకమంది పగటి పూట అనేక క్రీములు రాస్తుంటారు. అయితే పగటిపూట రాసే క్రీముల కంటే రాత్రి పూట ముఖానికి అప్లయి చేసుకునే క్రీములు అధిక ప్రభావాన్ని చూపిస్తాయి. రాత్రి పూట ముఖంపై ఏమీ రాయకపోతే ఉదయం నిద్ర లేవగానే చర్మం నిర్జీవంగా, పొడి బారినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగానే రాత్రిపూట చర్మ సంరక్షణ పద్ధతులు బాగా ప్రాచుర్యం పొందాయి. నైట్ క్రీమ్‌లు రాత్రి పూట చర్మాన్ని ప్రశాంతంగా ఉంచి, ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా రెడ్‌నెస్, దురదలను తగ్గించడంలో సహాయపడతాయి. వీటి సహాయంతో ఉదయానికల్లా మీ స్కిన్ టోన్ మరింత ప్రకాశవంతంగా మారుతుంది. ఇప్పుడు చాలా మంది అతివలు తమ అందాన్ని మెరుగుపరుచుకునేందుకు ఈ నైట్ క్రీమ్స్​ను ఉపయోగిస్తున్నారు. 


తక్కువ ధరతో ఇంట్లోనే నైట్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. నైట్ క్రీమ్ చేయడానికి ఏం అవసరమవుతాయో ఇప్పుడు చూద్దాం. మార్కెట్‌లో ఎన్నో నైట్ క్రీములు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంటిలో చేసుకునే క్రీములకు సాటి ఏవీ రావు. అలాగే వీటిని తక్కువ ఖర్చుతో తయారుచేసుకోవచ్చు. ఇంట్లో మనం స్వంతంగా నైట్‌ క్రీమ్‌ల తయారీకి ఏ పదార్థాలు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం.

పాల మీగడ:

పాల మీగడ‌లో లాక్టిక్ పుష్కలంగా ఉంటుంది. ఇది అద్భుతమైన యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మం మీది ముడతలను తగ్గించి యవ్వనాన్ని తిరిగి తెస్తుంది. మీరు ఒక స్పూన్ పాల మీగడ‌ తీసుకుని అందులో కొద్దిగా తేనె, రోజ్ వాటర్ మిక్స్ చేసి బాగా మూడింటిని బ్లెండ్ చేయాలి. ఆ తర్వాత ఆ పేస్ట్‌ను మీ ముఖంపై మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుండటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.  

అవకాడో క్రీమ్:

అవకాడోలో ఫైటోకెమికల్స్ అని పిలువబడే ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి పొడిబారిన, పగిలిన చర్మాన్ని రిపేర్ చేస్తాయి. ఇవి చర్మం టోన్‌ని పెంచి ముడతలను తగ్గిస్తాయి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా అవకాడో తొక్కను తీసి ఒక గిన్నెలో వేసి మెత్తగా చేసుకోవాలి. దీని తర్వాత మీకు కావాలంటే గుడ్లు, కొంచెం పెరుగు వేసి అన్నింటినీ కలపాలి. ఆరువాత దీనికి కొద్దిగా తేనె కలిపి ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు రాత్రి దీన్ని అప్లై చేయడం వల్ల మెరుస్తున్న, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు.

అలోవెరా క్రీమ్:

అలోవెరా జెల్ అనేది సహజంగా లభించే జెల్. దీనిలో అనేక యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా మారుస్తాయి. ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అన్ని రకాల మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. మీరు రోజ్ వాటర్, బాదం నూనె, కలబంద గుజ్జు కలిపి నైట్ క్రీమ్‌ను తయారుచేసుకోవచ్చు. మీరు ఈ క్రీమ్‌ను సీసాలో నిల్వ చేసి రోజూ రాత్రి పూట ముఖంపై అప్లయి చేసుకోవాలి. ఇలా చేస్తే బ్యూటీపార్లర్ కి వెళ్లకుండానే మెరిసే ముఖాన్ని పొందడానికి వీలవుతుంది.