డార్క్ అండర్ ఆర్మ్స్ కోసం హోం రెమెడీస్

కొంతమందికి మిగతా చర్మపు రంగు కంటే అండర్ ఆర్మ్స్ ముదురు రంగులో ఉంటాయి. అందువల్ల స్లీవ్ లెస్ బట్టలు వేసుకోలేకపోతారు. అటువంటి స్థితిలో, అండర్ ఆర్మ్స్ శుభ్రంగా ఉంచుకోవడం తప్పని అవసరంగా ఉంటోంది. అండర్ ఆర్మ్స్‌ (చంకలు)లో అక్కడక్కడా నల్లగా ఉండటం, లేదా పూర్తిగా నల్లగా, చర్మం దళసరిగా ఉండటం అనే సమస్యను చాలా మంది తక్కువగా అంచనా వేస్తారు. మరీ ముఖ్యంగా స్త్రీలకు లేదా యువతులకు ఇలా ఉండడం అసలే నచ్చదు. ఈ రోజుల్లో స్లీవ్ […]

Share:

కొంతమందికి మిగతా చర్మపు రంగు కంటే అండర్ ఆర్మ్స్ ముదురు రంగులో ఉంటాయి. అందువల్ల స్లీవ్ లెస్ బట్టలు వేసుకోలేకపోతారు. అటువంటి స్థితిలో, అండర్ ఆర్మ్స్ శుభ్రంగా ఉంచుకోవడం తప్పని అవసరంగా ఉంటోంది.

అండర్ ఆర్మ్స్‌ (చంకలు)లో అక్కడక్కడా నల్లగా ఉండటం, లేదా పూర్తిగా నల్లగా, చర్మం దళసరిగా ఉండటం అనే సమస్యను చాలా మంది తక్కువగా అంచనా వేస్తారు. మరీ ముఖ్యంగా స్త్రీలకు లేదా యువతులకు ఇలా ఉండడం అసలే నచ్చదు. ఈ రోజుల్లో స్లీవ్ లెస్ బట్టలు వేసుకొనే ఫ్యాషన్ తారాస్థాయికి చేరుకుంటోంది. కొంతమందికి మిగతా చర్మపు రంగు కంటే అండర్ ఆర్మ్స్ ముదురు రంగులో ఉంటాయి. అందువల్ల స్లీవ్ లెస్ బట్టలు వేసుకోలేకపోతారు. అటువంటి స్థితిలో, అండర్ ఆర్మ్స్ శుభ్రంగా ఉంచుకోవడం తప్పని అవసరంగా ఉంటోంది.

అండర్ ఆర్మ్స్‌ రంగును మీ మామూలు చర్మం రంగులోనికి చేర్చడానికి, లేదా తెల్లగా మార్చడానికి కొన్ని చిట్కాలను ప్రయత్నించవచ్చు. అటువంటి చిట్కాలలో కొన్ని అద్భుతమైన చిట్కాలను ఇక్కడ మేము ప్రత్యేకంగా మీ కోసం తెచ్చాము, వీటిని ఉపయోగించి మీ అండర్ ఆర్మ్స్ తెల్లగా మార్చుకోండి, మీకు కావలసిన దుస్తులను మీరు ధరించగలుగుతారు.

నిమ్మరసం:

ఇది సహజమైన బ్లీచ్‌గా పనిచేస్తుంది. ఇది అండర్ ఆర్మ్స్ నుండి డెడ్ స్కిన్‌ను తొలగిస్తుంది, డార్క్ కాంప్లెక్షన్ ను క్లియర్ చేస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కిన్ ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేస్తాయి. నిమ్మరసం తీసి రోజూ అండర్ ఆర్మ్స్ పై అప్లై చేసి, కాసేపు మసాజ్ చేసిన తర్వాత పది నిమిషాల తర్వాత కడిగేయాలి.

అలోవెరా:

అలోవెరా, అంటే కలబంద, చర్మానికి కూడా చాలా మంచిదని అంటారు. ఇందులో అలోసిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది చర్మంలోని పిగ్మెంటేషన్‌ను తొలగించి, చర్మాన్ని శుభ్రంగా, మెరిసేలా చేస్తుంది. అలోవెరా జెల్‌ని అండర్ ఆర్మ్స్‌పై అప్లై చేసి బాగా మసాజ్ చేసి, కాసేపు అలాగే ఉంచాలి. కొంత సమయం తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి మూడు నాలుగు సార్లు చేస్తే త్వరలోనే తేడా కనిపిస్తుంది.

పచ్చి బంగాళాదుంప:

పచ్చి బంగాళాదుంప అండర్ ఆర్మ్స్ డార్క్ షేడ్ ను కూడా తొలగిస్తుంది. ఇది చర్మాన్ని పిగ్మెంటేషన్ నుండి రక్షిస్తుంది, డెడ్ స్కిన్ తొలగించడం ద్వారా డార్క్ స్పాట్‌లను తొలగిస్తుంది. ఇది చర్మానికి పోషణనిస్తుంది, ఇన్ఫెక్షన్‌ను కూడా తొలగిస్తుంది.

ఆముదం:

ఆముదం కూడా అండర్ ఆర్మ్స్‌లో ఏర్పడే నల్లదనాన్ని తొలగించడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆముదంతో మసాజ్ చేయడం వల్ల అండర్ ఆర్మ్స్ నుంచి డార్క్ స్పాట్స్ తొలగిపోయి ఇన్ఫెక్షన్‌ తగ్గి, సమానమైన రంగులో ఉంటాయి.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా అండర్ ఆర్మ్స్ యొక్క నల్లదనాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది చర్మంలోని బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌ను తొలగిస్తుంది, లోతుగా చొచ్చుకుపోయిన మురికిని శుభ్రపరుస్తుంది. అరకప్పు నీటిలో రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా మిక్స్ చేసి చర్మంపై బాగా రుద్ది, కొంతసేపటి తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే మీ అండర్ ఆర్మ్స్ తెల్లగా శుభ్రంగా, మెరుస్తూ ఉంటాయి. ఈ సింపుల్ చిట్కాలను ఉపయోగించి మీ అండర్ ఆర్మ్స్​ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి.