మీకు హై బీపీ ఉందా? అయితే బీపీకి చెక్ పెట్టడానికి హోం రెమెడీస్ ఏమున్నాయో తెలుసుకుందాం

 ప్రస్తుత పరిస్థితుల్లో అధిక సంఖ్యలో ప్రజలు అధిక రక్తపోటు సమస్యతో పోరాడుతున్నారు. దీనిని హైపర్‌టెన్షన్ అని, హై బీపీ అని కూడా అంటారు. సాధారణ రక్తపోటు 80 నుండి 120 మధ్య ఉంటుంది. 120 దాటితే హైబీపీ సమస్య వస్తుంది. అధిక రక్తపోటు భయమా, ఈ హోం రెమెడీస్ బీపీని నియంత్రిస్తాయి అధిక రక్తపోటును నియంత్రించడానికి ఈ 5 ఉత్తమ మార్గాలు నేటి యుగంలో అధిక సంఖ్యలో ప్రజలు అధిక రక్తపోటు సమస్యతో పోరాడుతున్నారు. దీనిని హైపర్‌టెన్షన్ […]

Share:

 ప్రస్తుత పరిస్థితుల్లో అధిక సంఖ్యలో ప్రజలు అధిక రక్తపోటు సమస్యతో పోరాడుతున్నారు. దీనిని హైపర్‌టెన్షన్ అని, హై బీపీ అని కూడా అంటారు. సాధారణ రక్తపోటు 80 నుండి 120 మధ్య ఉంటుంది. 120 దాటితే హైబీపీ సమస్య వస్తుంది.

అధిక రక్తపోటు భయమా, ఈ హోం రెమెడీస్ బీపీని నియంత్రిస్తాయి

అధిక రక్తపోటును నియంత్రించడానికి ఈ 5 ఉత్తమ మార్గాలు

నేటి యుగంలో అధిక సంఖ్యలో ప్రజలు అధిక రక్తపోటు సమస్యతో పోరాడుతున్నారు. దీనిని హైపర్‌టెన్షన్ అని కూడా అంటారు. సాధారణ రక్తపోటు 80 నుండి 120 మధ్య ఉంటుంది. 120 దాటితే హైబీపీ సమస్య వస్తుంది. ఈ వ్యాధిని ‘సైలెంట్ కిల్లర్’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీని ప్రారంభ లక్షణాలు కనిపించవు. అధిక రక్తపోటు కారణంగా గుండెపై ఒత్తిడి చాలా పెరుగుతుంది, ఇది గుండెపోటుకు కూడా కారణం కావచ్చు. అంతే కాకుండా ఈ సమస్య ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల, అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడే మందులతో పాటు కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించమని సలహా ఇస్తారు డాక్టర్లు. 

నివారణలతో పాటు అతిగా తినడం తగ్గించుకోవాలి, తరచుగా వ్యాయామం చేయడం, పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, ధూమపానం, మద్యపానం మానేయడం లాంటి రోజువారీ జీవితంలో సర్దుబాటు చేసుకోవాలి. వీటివల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. అలాగే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. హై బీపీ వచ్చినపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మనల్ని ఎప్పుడు కింద పడేస్తుందో కూడా మనం చెప్పలేం. కావున కేర్​ అనేది చాలా ముఖ్యం. 

మనకు బీపీ కనిపించగానే మనం ముందు వెనకా ఏమీ ఆలోచించకుండా ఆస్పత్రికి పోయి.. అక్కడ మందులని వేలకు వేలు తగలేస్తాం. కానీ ఇంట్లోనే ఉండి కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించడం వలన బీపీని కంట్రోల్​లో ఉంచుకోవచ్చు. ఏ ఆహారాలు రక్తపోటును తక్షణమే తగ్గించగలవో తెలుసుకుందాం.

అవిసే గింజలు

అవిసె గింజలనే కొన్నిచోట్ల చియా విత్తనాలు అని కూడా పిలుస్తారు.  

అధిక రక్తపోటును తగ్గించగల శక్తివంతమైన పోషకాలు అవిసే గింజల్లో ఎక్కువగా లభిస్తాయి. రక్తపోటు పెరగకుండా అవిసె గింజలను తరచుగా తినవచ్చు. అలాగే ఈ గింజలను పౌడర్ చేసి సలాడ్లు, మైదా, ఓట్స్, కాయధాన్యాలలో చేర్చవచ్చు. లేదా కొద్దిగా గోరువెచ్చని నీటిలో ఈ పొడిని కలుపుకోని ఉదయాన్నే తాగవచ్చు. మీరు జ్యూస్‌లలో కూడా కలుపుకుని తీసుకోవచ్చు. 

బ్రోకలీ

బ్రోకలీ లేదా గ్రీన్ క్యాబేజీ అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలోని నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలు పెరిగి అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. 

క్యారెట్లు

క్యారెట్‌లో కూడా అధిక రక్తపోటును తగ్గించే గుణాలు ఉన్నాయి.  క్యారెట్‌లో ఉండే కెఫిక్ యాసిడ్ ధమనిలో కలిగే వేడిని తగ్గించడం ద్వారా రక్తపోటును నియంత్రిస్తుంది.

పిస్తా పప్పు

పిస్తా పప్పు గుండె ఆరోగ్యానికి అద్భుతమైనవిగా చెబుతారు. పిస్తా పప్పు లాంటి డ్రై ఫ్రూట్స్ రెగ్యులర్‌గా వినియోగించడం వల్ల  అధిక రక్తపోటు ప్రమాదం దరిచేరదు. 

ఆమ్ల ఫలాలు

అధిక రక్తపోటు ఉన్నవారు సిట్రస్ పండ్లను తినాలి. ద్రాక్ష, నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు రక్తపోటును తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ పండ్లన్నింటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అధిక రక్తపోటు వంటి గుండె జబ్బుల ప్రమాద కారకాలను తగ్గించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. మీరు ఈ పండ్లను తినవచ్చు, సలాడ్లలో కలుపుకొని తాగవచ్చు, అలాగే జ్యూస్‌గా కూడా తీసుకోవచ్చు. వీటిని ఇలా తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మనలో చాలా మంది ఫేస్ చేసే బీపీ సమస్య కూడా తగ్గిపోతుంది.