ఇంట్లోనే తక్కువ ఖర్చుతో సొంతంగా చేసుకొనే ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూడండి- మీ కోసం ఈ హోమ్ ఫేషియల్

ఇంట్లోనే, మనకు సులువుగా దొరికే వస్తువులతో చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సెలూన్‌లో లాంటి మెరుపును అందించే హోమ్ ఫేషియల్ విధానాన్ని మేము మీకోసం అందిస్తున్నాము. వయసు పెరిగే కొద్దీ చర్మాన్ని సంరక్షించడం చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే కాలుష్యం, వృద్ధాప్యం వల్ల చర్మం దెబ్బతింటుంది, దానివల్ల చర్మ సాగిపోవడం, మళ్ళీ పూర్వపు స్థితికి రాకపోవడం, మెరుపు తగ్గటం, ముడతలు పడటం వంటివి మొదలవుతాయి. అందువల్ల, ఆరోగ్యకరమైన, అందమైన చర్మం పొందటానికి, హానికరమైన కాలుష్యం వల్ల […]

Share:

ఇంట్లోనే, మనకు సులువుగా దొరికే వస్తువులతో చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సెలూన్‌లో లాంటి మెరుపును అందించే హోమ్ ఫేషియల్ విధానాన్ని మేము మీకోసం అందిస్తున్నాము.

వయసు పెరిగే కొద్దీ చర్మాన్ని సంరక్షించడం చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే కాలుష్యం, వృద్ధాప్యం వల్ల చర్మం దెబ్బతింటుంది, దానివల్ల చర్మ సాగిపోవడం, మళ్ళీ పూర్వపు స్థితికి రాకపోవడం, మెరుపు తగ్గటం, ముడతలు పడటం వంటివి మొదలవుతాయి. అందువల్ల, ఆరోగ్యకరమైన, అందమైన చర్మం పొందటానికి, హానికరమైన కాలుష్యం వల్ల కలిగే నష్టాన్ని పూడ్చడానికి, చర్మాన్ని శుభ్రపరచడానికి, దానికి పోషణను అందించడానికి ఫేషియల్‌ ఒక మంచి ఆప్షన్. కానీ, ఈ రోజుల్లో మన జీవనశైలికి, మనం ప్రతిసారీ బ్యూటీ పార్లర్‌కి లేదా సెలూన్‌కి వెళ్తూ ఉండలేము.  ప్రతిసారీ పార్లర్‌కి వెళ్తూ ఉంటే మనకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అందువల్ల ఇంట్లోనే, మనకు సులువుగా దొరికే వస్తువులతో చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సెలూన్‌లో లాంటి మెరుపును అందించే హోమ్ ఫేషియల్ విధానాన్ని మేము మీకోసం అందిస్తున్నాము.

ఎలాంటి శ్రమ లేకుండా ఇంట్లోనే స్వయంగా ఫేషియల్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం:

శుభ్రపరచడం, క్లెన్సింగ్:

ప్రతిరోజూ మన చర్మంపై దుమ్ము, ధూళి, పొగ వంటి అనేక ఇతర కాలుష్య కారకాలకు గురవుతుంది, వీటి ప్రభావం వల్ల మన చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ముఖంపై మొటిమలు, పొక్కులు మచ్చలు రావడానికి కారణమవుతాయి. అందువల్ల, ఆ కాలుష్యాలను వదిలించుకోవడానికి మొట్ట మొదటగా చేయవలసినది శుభ్రపరచడం. దీనికోసం మీరు మార్కెట్‌లో కొన్న ఏదైనా క్లెన్సర్‌ను మీ ముఖాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. దీనికోసం, ఆ క్లెన్సర్‌ని నీటిలో ముంచండి. మీరు అలా కొన్న ప్రొడక్ట్ వాడకూడదని అనుకుంటే, మీ ముఖాన్ని శుభ్రపరచడానికి పచ్చి పాలను కూడా ఉపయోగించవచ్చు. 

స్క్రబ్బింగ్:

ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఈ హానికరమైన కాలుష్య కారకాల వల్ల మన ముఖ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇది కాకుండా ఎక్స్‌ఫోలియేట్ చేసి తొలగించవలసిన డెడ్ స్కిన్ సెల్స్ అంటే మృత కణాలు మన ముఖాలపై పేరుకుపోతాయి. ఈ కారణంగా మీరు మార్కెట్లో దొరికే స్క్రబ్బింగ్ క్రీమ్‌ ఏదైనా తీసుకొని మీ ముఖాన్ని స్క్రబ్ చేయాలి. లేదంటే ఇంట్లో ఉండే వస్తువులతో కూడా తయారు చేసుకోవచ్చు. దానికోసం నిమ్మకాయ, తేనె, చక్కెరలను కలిపి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది కొన్న స్క్రబ్ లాగానే పని చేస్తుంది. మీరు కొద్దిగా నిమ్మరసం, కొన్ని చుక్కల తేనె తీసుకొని ఆ రెండింటికి కొద్దిగా చక్కెర కలపాలి, అంతే! మీ కోసం స్క్రబ్ రెడీ.

మసాజ్:

శుభ్రపరచడం, స్క్రబ్బింగ్ అయిన తరువాత, మనం ఫేషియల్ యొక్క అతి ముఖ్యమైన దశకు వస్తాము. అదే మసాజ్. మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడి, ముఖ కండరాలలో ఒత్తిడిని, ఉద్రిక్తతను తగ్గిస్తుంది. మీరు మార్కెట్‌లో లభించే ఫేషియల్ క్రీమ్‌ను ఉపయోగించవచ్చు లేదా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం మీరు కొద్దిగా పాల మీగడ, చిటికెడు పసుపు, అర చెంచా శనగపిండి తీసుకొని వీటన్నింటినీ కలపాలి. ఆ తర్వాత ఈ పేస్ట్‌తో ముఖాన్ని 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. మసాజ్ చేసేటప్పుడు, వేళ్లు పైకి కదులుతున్నాయో లేదో చూసుకోండి. అంటే ముఖం కింది భాగం నుండి దవడ ఎముకల వరకు, ముఖాన్ని పైకి లేపుతున్నట్టు, లిఫ్ట్ చేస్తున్నట్లు మసాజ్ చేయాలి.  ఇలా చేయడం వల్ల చర్మానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. చర్మం బిగుతుగా అవుతుంది.

ఆవిరి:

మసాజ్ చేసిన తర్వాత, చర్మం పైన ఉండే రంధ్రాలు తెరుచుకొనేలా చేయడానికి, మీ చర్మాన్ని తాజాగా, మృదువుగా మార్చడానికి ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల చర్మం లోతుగా మాయిశ్చరైజ్ అయ్యి, మృదువుగా మారుతుంది. దీని తరువాత, మీరు మీ ముఖాన్ని మెత్తని, మృదువైన, శుభ్రమైన టవల్‌తో తుడవవచ్చు.

ఫేస్ ప్యాక్ లేదా మాస్క్:

ఫేషియల్‌లో చిట్టచివరి దశ ఫేస్ ప్యాక్ లేదా ఫేస్ మాస్క్‌ని అప్లై చేయడం. మార్కెట్‌లో ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే ముల్తానీ మిట్టి, గంధపు పొడి, రోజ్‌వాటర్‌ కలిపి ఉపయోగించి ఇంట్లోనే మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. ఈ మూడు పదార్ధాలనూ కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి సుమారు 15 నిమిషాల పాటు అలానే ఉంచి, ఆరనిచ్చి, ఆరిన తరువాత కడిగేయాలి. అంతే! ఫేషియల్ అయిపొయింది!

ఈ సులువైన, చవకైన హోమ్ మేడ్ ఫేషియల్ మీ చర్మాన్ని శుభ్రపరిచి, మీ చర్మ రంధ్రాలను తెరిచి, మీ ముఖానికి పోషణనిస్తుంది, బ్యూటీ పార్లర్‌కి వెళ్లకుండానే తేమను పునరుద్ధరిస్తుంది.