విడాకుల‌కు అవ‌య‌వాల తొలగింపుకు సంబంధం ఏంటి?

డయాబెటిస్ వచ్చిన ఎక్కువ మంది రోగులలో, దెబ్బ తగిలిన తర్వాత నయమవడానికి ఎక్కువ సమయం పట్టడం, ఇన్ఫెక్షన్స్ అలాగే ఉండిపోవడం, టిష్యూ డ్యామేజ్, ఇలాంటివి ఎదుర్కొంటూ ఉండడం కామన్. కొన్ని కొన్ని సందర్భాలలో డయాబెటిస్ ఉన్న పేషెంట్స్ కి ఎప్పుడైనా దెబ్బలు తగిలిన తర్వాత, నయం కావడానికి చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. దెబ్బలు నయం కాకపోతే ఏదైనా పార్ట్ కుళ్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అటువంటి సందర్భాలలో దెబ్బ తగిలిన పార్ట్ సర్జరీ […]

Share:

డయాబెటిస్ వచ్చిన ఎక్కువ మంది రోగులలో, దెబ్బ తగిలిన తర్వాత నయమవడానికి ఎక్కువ సమయం పట్టడం, ఇన్ఫెక్షన్స్ అలాగే ఉండిపోవడం, టిష్యూ డ్యామేజ్, ఇలాంటివి ఎదుర్కొంటూ ఉండడం కామన్. కొన్ని కొన్ని సందర్భాలలో డయాబెటిస్ ఉన్న పేషెంట్స్ కి ఎప్పుడైనా దెబ్బలు తగిలిన తర్వాత, నయం కావడానికి చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. దెబ్బలు నయం కాకపోతే ఏదైనా పార్ట్ కుళ్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అటువంటి సందర్భాలలో దెబ్బ తగిలిన పార్ట్ సర్జరీ చేసి తీసేయడం వంటిది జరుగుతాయి. ఇలాంటివన్నీ ముఖ్యంగా డయాబెటిస్ ఎక్కువగా ఉన్నవారిలో కనిపిస్తూ ఉంటుంది. అయితే విడాకులు తీసుకున్న డయాబెటిస్ ఎఫెక్ట్ అయిన పురుషులలో ఈ ప్రమాదం ఎక్కువగా కనిపిస్తున్నట్లు కొత్త రీసెర్చ్ ప్రకారం తేలింది. అస‌లు విడాకుల‌కు అవ‌య‌వాల తొలగింపుకు సంబంధం ఏంటి?

డయాబెటిస్ తో జాగ్రత్త: 

విడాకులు తీసుకున్న డయాబెటిస్ ఎఫెక్ట్ అయిన పురుషులలో, దెబ్బలు తగిలిన పార్ట్ సర్జరీ ద్వారా తీసేయడం వంటివి కనిపిస్తున్నట్లు కొత్త రీసెర్చ్ ప్రకారం తేలింది. స్వీడిష్ రీసర్చెర్స్ చేసిన రీసెర్చ్ ప్రకారం, ఎక్కువగా విడాకులు తీసుకున్న డయాబెటిస్ ఎఫెక్ట్ అయిన పురుషులలో, సర్జరీలో ఎక్కువగా జరిగినట్లు వెల్లడించారు. ఎందుకంటే ఒంటరి పురుషులలో ఎక్కువగా ఒత్తిడి కారణంగా, సెల్ఫ్ కేర్ తక్కువ కావడం వల్ల ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుందని తెలపడం జరిగింది. 

డయాబెటిస్ భయం: 

నిజానికి డయాబెటిస్తో బాధపడుతున్న చాలామంది ఇష్టంగా తినాలనుకునే చాలా పదార్థాలను తినలేక పోతున్నారు. ప్రతి నెల చెకప్ తప్పనిసరిగా చేయించుకోవాలి అని సూచిస్తున్నారు. కాబట్టి ఆరోగ్యపరంగా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, మధుమేహం అనేది వయసుతో సంబంధం లేకుండా సోకుతుంది. మధుమేహం ఎందుకు వస్తుంది అంటే దీనికి షుగర్ ఎక్కువగా తినడం ఒక్కటే కారణం కాదు. మనకు తెలియని అనేక రకాలైన కారణాలు ఉంటాయి. సరైన నిద్ర లేకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం, శరీరానికి వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం, సమయానికి నిద్ర లేవకపోవడం, అతిగా జంక్ ఫుడ్ తినడం. ఇలా అనేక రకాలైన కారణాలు ఉంటాయి.

 ప్రపంచంలో చాలా వరకు జనాభా మధుమేహం అనే వ్యాధితో ఎంతగానో బాధపడుతున్నారు, ఇది భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వ్యాప్తి చెందింది. వయస్సుతో సంబంధం లేకుండా, ప్రజలు ఈ ప్రమాదకరమైన వ్యాధికి ఎక్కువగా గురవుతున్నారు. ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత, మధుమేహాన్ని తగ్గించుకునేందుకు మన జీవితకాల ప్రయత్నం చేస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డయాబెటిక్ రోగులు తాము తీసుకుని ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే కొన్ని ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఆహార మార్పులు మరియు మందులు వంటివి వైద్య పరంగా సాధారణమైనప్పటికీ, ఆయుర్వేద పరంగా ప్రయత్నించి చూస్తే లాభం ఉంటుందని చాలామంది అంటున్నారు. వేప ఆకులు, ప్రత్యేకించి, రక్తంలో చక్కెర నియంత్రణపై శక్తివంతమైన ప్రభావానికి ప్రసిద్ధి చెందాయి. 

వేప ఆకులు చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడానికి మరియు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే అనేక రకాలైన సహజ గుణాలను కలిగి ఉంటుంది. వీటిని తిన్నప్పుడు విపరీతమైన చేదు అనిపిస్తుంది, కానీ వేప ఆకుల్లో అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అయినప్పటికీ, రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్న వ్యక్తులు లేదా సమస్యలు ఉన్నవారు వేప ఆకులను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. మీరు వేప ఆకులను తినలేకపోతే, మీరు వేప నూనెను కూడా ఉపయోగించవచ్చు. వేపనూనె తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు గ్లూకోజ్‌ను కంట్రోల్ చేయడంలో కూడా సహాయపడుతుంది.