HIFU ఫేస్ ట్రీట్మెంట్ గురించి తెలుసా

నిజాలివే అబద్దానికి ఉన్నంత పవర్ నిజానికి ఉండదనేది ఒక సామెత. ఈ సామెత నిజమే అనేలా అనేక విషయాల్లో ఇది ప్రూవ్ అవుతోంది. అబద్దం వ్యాప్తి చెందినంత వేగంగా నిజం వ్యాప్తి చెందలేని ఇప్పటికే మనకు తెలుసు. ఏ ఒక్క విషయం అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో ఈ సమస్య ఉంది. ఈ సమస్యను తీసేసేందుకు నిజాన్ని స్ప్రెడ్ చేసేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. అయినా కానీ నిజం మనం అనుకున్న తీరాలకు చేరుతుందని మనం […]

Share:

నిజాలివే

అబద్దానికి ఉన్నంత పవర్ నిజానికి ఉండదనేది ఒక సామెత. ఈ సామెత నిజమే అనేలా అనేక విషయాల్లో ఇది ప్రూవ్ అవుతోంది. అబద్దం వ్యాప్తి చెందినంత వేగంగా నిజం వ్యాప్తి చెందలేని ఇప్పటికే మనకు తెలుసు. ఏ ఒక్క విషయం అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో ఈ సమస్య ఉంది. ఈ సమస్యను తీసేసేందుకు నిజాన్ని స్ప్రెడ్ చేసేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. అయినా కానీ నిజం మనం అనుకున్న తీరాలకు చేరుతుందని మనం నమ్మలేం. అందుకోసమే అబద్దాలను ఎక్కువగా విశ్వసించడం మానేయాలి. అనేక విషయాలలో మనల్ని ఈ అపోహలు వెంటాడుతుంటాయి. అవి చాలా సందర్భాల్లో నిజం కావు కాని అవి రూమర్స్ గా వ్యాప్తి చెందుతూనే ఉంటాయి. 

HIFU విషయంలో కూడా..  

అనేక విషయాలలో రూమర్స్ స్ప్రెడ్ అయినట్లుగానే చర్మానికి చేసే అల్ట్రాసౌండ్ చికిత్స HIFU (హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్) విషయంలో కూడా రూమర్స్ చాలా ఉన్నాయి. కానీ ఆ రూమర్స్ నమ్మకూడదని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మాన్ని బిగుతుగా మార్చే నాన్-ఇన్వాసివ్ ప్రొసీజర్‌ల కోసం పని చేస్తుంది. ఇది ప్రజలకు వావ్ అనిపించే స్కిన్ ను అందించేందుకు కృషి చేస్తుంది. HIFU చికిత్స మీద అనేక అపోహలు ఉన్నాయి. ముందు ఆ అపోహలను చేధించి మనం ఈ చికిత్స చేసే మంచి విషయాలను గుర్తించాలి.  హై-ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ (HIFU) అనేది నాన్-ఇన్వాసివ్ మెడికల్ థెరపీ. ఇది ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ వేవ్‌లను చర్మంపైకి అందిస్తుంది. టార్గెటెడ్ మైక్రో కోగ్యులేషన్ జోన్‌ల ఏర్పాటుకు కూడా ఇది దారితీస్తుంది. అంతే కాకుండా కొల్లాజెన్ పునర్నిర్మాణానికి కారణమవుతుంది. వీటన్నింటి  ఫలితంగా చర్మం బిగుతుగా మారుతుంది. ఈ HIFU చికిత్స గురించి అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో ఓ సారి పరిశీలిస్తే…

1: HIFU కాస్మెటిక్ ప్రయోజనం కోసం మాత్రమే ఉద్దేశించబడింది

చర్మాన్ని పునరుజ్జీవింపజేసే మరియు బిగుతుగా మార్చగల సామర్థ్యం కారణంగా సాంకేతికత సౌందర్య ప్రయోజనాల కోసం మరింత ఎఫెక్టివ్ గా పని చేస్తూ వచ్చింది. కేవలం ఇది సౌందర్యం కోసం మాత్రమే కాకుండా గర్భాశయ ఫైబ్రాయిడ్లు, కాలేయ కణితులు, ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు ఎముక మెటాస్టేసెస్ వంటి అనేక పరిస్థితులకు విజయవంతంగా చికిత్స చేయడానికి HIFU ఉపయోగించబడుతుంది. అలాగే, ఇది రేడియేషన్ థెరపీ లేదా సాంప్రదాయ శస్త్రచికిత్సకు నాన్-ఇన్వాసివ్ ప్రత్యామ్నాయాన్ని కూడా అందిస్తుంది.

2: HIFU చికిత్సతో తక్షణ ఫలితాలు కనిపిస్తాయి

HIFU ప్రభావవంతంగా మరియు మంచి ఫలితాలను అందిస్తున్నప్పటికీ దీని గురించి వాస్తవ అంచనాలను అందించడం చాలా అవసరం. ఈ చికిత్స చేయించుకున్న తర్వాత కొంత మందికి  ఫలితాలు త్వరగా కనిపిస్తే…కొంత మందికి మాత్రం చాలా ఆలస్యంగా కనిపిస్తాయి. ఈ చికిత్సకు మన శరీరం ఎలా ప్రతిస్పందిస్తుందనే విషయాన్ని  బట్టి ఇది ఉంటుంది. మన శరీరం ప్రతిస్పందించడానికి మరియు అది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించేందుకు కొంత సమయం కావాలి. అలాగే సెల్ఫ్ ట్రీట్ మెంట్ స్టార్ట్ చేసేందుకు కూడా కొంత సమయం అవసరం. అందుకోసమే ఈ చికిత్స తర్వాత కొంత మందికి వారాల వ్యవధిలోనే ఫలితాలు కనిపిస్తే మరికొంత మందికి మాత్రం నెలల సమయం పడుతుంది. కాస్త ముందో తర్వాతో కానీ ఫలితాలు మాత్రం తప్పకుండా కనిపిస్తాయి. 

3: HIFU చికిత్స నొప్పిని కలిగిస్తుంది

ఇది అనేక మందిలో ఉన్న అనుమానం. HIFU చికిత్స చేయించుకున్న తర్వాత తలనొప్పి వస్తుందని చాలా మంది భ్రమపడుతుంటారు. కానీ అలా ఏం జరగదు. HIFU రోగికి అంత పెద్దగా బాధ కలిగించదు. ఇది చాాలా సింపుల్ గా ఉంటుంది. లోతుగా కేంద్రీకరించబడిన అల్ట్రాసౌండ్ తరంగాలను మాత్రమే ఇది అందిస్తుంది. HIFU చికిత్స చేయించుకుంటున్న సమయంలో కొంత మంది తేలికపాటి అనుభూతులను కూడా ఫీల్ అవుతారు. ఈ చికిత్సను చేసేందుకు అనస్థీషియా లేదా మత్తు మందు కూడా అవసరం లేదు. 

4: HIFU అనేది తీవ్రమైన దుష్ప్రభావాలతో కూడిన ప్రమాదకర చికిత్స

ఈ అపోహ కూడా అనేక మందిలో ఉంటోంది. ఈ చికిత్సను చేయించుకుంటే అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కొందరు భావిస్తుంటారు. కానీ అటువంటి పరిస్థితులు ఏం ఉండవు. కేవలం ఇది చాలా సింపుల్ చికిత్స. అందుకోసం ఎటువంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. ఇన్వాసివ్ సర్జికల్ విధానాలతో పోలిస్తే, HIFU అనేది చాలా సురక్షితమైన ప్రత్యామ్నాయం. అంతేకాకుండా, నాన్-ఇన్వాసివ్ టెక్నిక్ కావడంతో దీని వల్ల రక్తస్రావం, ఇన్‌ఫెక్షన్ మరియు పొడిగించిన రికవరీ సమయం వంటి ఓపెన్ సర్జరీకి సంబంధించిన ప్రమాదాలు ఉండవు. దీని వల్ల వచ్చే ఎఫెక్ట్స్ లో మరీ ముఖ్యంగా వాపు, ఎరుపు లేదా చికిత్స చేసిన ప్రదేశంలో తిమ్మిరి అనేవి ఉంటాయి. అంతే తప్ప ఎటువంటి విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొద్ది రోజుల్లోనే రికవరీ అవుతాయి.