నవ్వుకు ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకుందాం రండి..

నవ్వుతూ యుద్దానైన సాధించొచ్చు అంటారు. నవ్వుకున్న ప్రాముఖ్యత అటువంటిది మరి. నవ్వు వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు. ప్రపంచానికి శాంతి చేకూర్చాలంటే ఒక్క నవ్వుతో చాలు అని మదర్ తెరిసా చెప్పిన మాట ప్రతి ఒక్కరికి గుర్తే ఉంటుంది. ప్రతిరోజు నవ్వుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతుంటాయి. 1000 మాటలలో చెప్పలేని భావాలు చిన్న చిరునవ్వుతో చూపించడం చాలా సులభం.. మరి ఇటువంటి నవ్వు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..  హాయిగా […]

Share:

నవ్వుతూ యుద్దానైన సాధించొచ్చు అంటారు. నవ్వుకున్న ప్రాముఖ్యత అటువంటిది మరి. నవ్వు వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు. ప్రపంచానికి శాంతి చేకూర్చాలంటే ఒక్క నవ్వుతో చాలు అని మదర్ తెరిసా చెప్పిన మాట ప్రతి ఒక్కరికి గుర్తే ఉంటుంది. ప్రతిరోజు నవ్వుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతుంటాయి. 1000 మాటలలో చెప్పలేని భావాలు చిన్న చిరునవ్వుతో చూపించడం చాలా సులభం.. మరి ఇటువంటి నవ్వు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. 

హాయిగా నవ్వుకుందాం: 

ఆనంద క్షణాలలో, చిరునవ్వు మన పెదాలకు, పదాలకు అర్థం చెప్తూ ఉంటుంది. అయితే కష్టకాలంలో, చిరునవ్వు నిజానికి ఓదార్పు మరియు మద్దతును అందిస్తుంది, ఇతరుల కోసం ఉచితంగా ఇవ్వగల బహుమతి చిరునవ్వు మాత్రమే, మనం ఎదుట వారికి చూపించే చిరునవ్వు ఒక్కోసారి సంఘటనను తారుమారు చేస్తుంది. ప్రపంచ చిరునవ్వు దినోత్సవం రోజు హాయిగా నవ్వుకుందాం.

వరల్డ్ స్మైల్ డే ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో మొదటి శుక్రవారం జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్టోబర్ 6న జరుపుకుంటారు. 1963లో ఐకానిక్ స్మైలీ ఫేస్ సింబల్‌ను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన మసాచుసెట్స్‌లోని వోర్సెస్టర్‌కి చెందిన వాణిజ్య కళాకారుడు హార్వే బాల్ ప్రారంభించాడు. 1999లో అతను స్మైల్ డేని సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టాడు, నిజానికి ఎదుట వ్యక్తీ మీద దయతో ఉండాలని చెప్పడానికి.. అదే విధంగా నవ్వడం ద్వారా ఆనందాన్ని పంచడానికి ఒక మార్గంగా చాలామంది అభిప్రాయం

ఒక్క రోజుతో అనేక మార్పులు: 

ప్రపంచ చిరునవ్వు దినోత్సవం ఇతరులను చూసి ప్రశాంతంగా నవ్వడం, నవ్వుతూ మంచి పనులు చేయడానికి  ప్రోత్సహిస్తూ నిర్వహించే ఒకరోజు. అంతే కాకుండా ఒకరి రోజును ప్రకాశవంతం చేయడానికి మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరచడానికి సాధారణ చిరునవ్వుకు ఉన్న శక్తిని గుర్తు చేస్తుంది. కాబట్టి, ఈ ప్రపంచ చిరునవ్వు దినోత్సవం రోజున, మనకి తెలియని వారిని చూసి మనస్ఫూర్తిగా చిరునవ్వు నవ్వండి, మనకి ఈ రోజున ఎదురయ్యే ఇతరులను చూసి నవ్వమని ప్రోత్సహించండి, స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా తెలియని వారిపట్ల దయతో ప్రవర్తించమని తెలియజేయండి, వారి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావడానికి, కథలు, చిత్రాలు లేదా నవ్వులు పూయించే కొన్ని కోట్‌లను షేర్ చేసుకోండి. సోషల్ మీడియా ద్వారా సానుకూలతను వ్యాప్తి చేయడం, సంఘంపై సానుకూల ప్రభావం చూపేందుకు స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొనడం ఇటువంటి వాటి గురించి ప్రోత్సహించండి. 

మీకోసం నవ్వుల పూయించే ఒక జోక్: 

ఇద్దరు దొంగలు తమ దొంగతనాల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ, అర్ధరాత్రి ఎవరూ లేని ప్రాంతంలో జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారట. “సరేగాని, నిన్న ఎక్కడికి పోయావురా? నీకోసం చాలా చోట్ల వెతికాను, ఆఖరికి మీ ఇంటికి కూడా వచ్చాను.. దొంగతనానికి వెళ్లే వాడివి ముందు రోజే చెప్పి వెళ్తే బాగుంటుంది కదరా.. నేను వెతుక్కునే పని మానుకుంటాను” అన్నాడు అందులో ఒక దొంగ. ” పాపం నిన్నటి నుంచి నా గురించి వెతికి వెతికి అలిసిపోయావు అనుకుంటా.. ఈ రోజైనా ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో మరి” అన్నాడు మరో దొంగ. ” నీకు తెలుసు కదరా, మనం దొంగతనం చేసిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఇంటికి వెళ్ళాలి.. లేదంటే దొరికిపోతాం సుమీ..” అంటూ ఇద్దరూ ముచ్చట్లు చెప్పుకుంటారు. 

” సరే చెప్పడం మర్చిపోయాను.. నిన్న అనుకోకుండా చీకట్లో ఒకరి ఇంటికి వెళ్లాను.. నా అదృష్టం బాగుండి ఆ వీధిలో వారం రోజులుగా కరెంటు లేదని తెలుసుకొని వెళ్లాను.. ఇంకా అదృష్టం ఏమిటంటే, నేను వెళ్లిన ఇంట్లో ఎవ్వరూ లేరు.. కనీసం చిన్న దీపం కూడా లేదురా.. నా పని చాలా సులభం అయిపోయింది.. ఏమిటో ఎక్కడపడితే అక్కడ మూటలు తప్పిస్తే ఏమీ కనిపించలేదు.. ఒక రెండు మూడు మూటలు వేసుకొచ్చాను.. ఇంటికి వెళ్లి చూసేసరికి మూటనిండా బంగారం..” అంటూ ఒక దొంగ చెప్తూ ఉంటే మరొక దొంగ నిరాశలో ఉన్నాడు.” ఏమైందిరా? నేను ఇంతగా చెప్తుంటే నువ్వు ఆనందపడకుండా.. ఒక్కసారిగా దిగులు పడుతున్నావ్ ఏంటి..? ఇప్పటివరకు హాయిగా నవ్వుకున్నాం కదరా” అంటూ అనేసరికి..” ఒరేయ్ నువ్వు దొంగతనానికి వెళ్ళింది నా ఇంటికేరా.. మా వీధిలోనే వారం రోజులుగా కరెంటు లేదు, మూటల సంగతి చెప్పేసరికి నాకు కన్ఫర్మ్ అయింది” అనేసరికి, మరో దొంగకి పగలబడి నవ్వాలని ఉన్న.. దొంగలించిన సొమ్ము వృధా అవుతుందని బాధ మనసులోంచి తనుక్కువస్తుంది.