బిజీగా ఉంటే వర్కౌట్ చేయడం ఎలా?

మీ బిజీ షెడ్యూల్లో వ్యాయామం చేయడానికి సరైన చిట్కాలు:  1. నడవటం లేదా చిన్నగా జాగింగ్ చేయడం, నీ గుండె ఆరోగ్యం కోసం సాయ పడుతుంది. మీరు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడానికి మామూలు నడక లేదంటే జాగింగ్ లాంటిది అలవాటు చేసుకోండి. పనికి వెళ్లేటప్పుడు క్రమంగా నడుస్తూ ఉండండి. మీ బుద్ధిబలం పెరగటానికి ఈ శారీరిక శ్రమ సాయ పడుతుంది.  2. పనిలో వ్యాయామం చెయ్యొచ్చు, మీ ఆఫీసు లో రోజువారీ పని […]

Share:

మీ బిజీ షెడ్యూల్లో వ్యాయామం చేయడానికి సరైన చిట్కాలు: 

1. నడవటం లేదా చిన్నగా జాగింగ్ చేయడం, నీ గుండె ఆరోగ్యం కోసం సాయ పడుతుంది. మీరు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడానికి మామూలు నడక లేదంటే జాగింగ్ లాంటిది అలవాటు చేసుకోండి. పనికి వెళ్లేటప్పుడు క్రమంగా నడుస్తూ ఉండండి. మీ బుద్ధిబలం పెరగటానికి ఈ శారీరిక శ్రమ సాయ పడుతుంది. 

2. పనిలో వ్యాయామం చెయ్యొచ్చు, మీ ఆఫీసు లో రోజువారీ పని చేస్తూ వ్యాయామాన్ని చెయ్యటం కూడా సాధ్యమే. మీ డెస్క్ వద్ద డంబెల్స్ లేదా వర్కౌట్ ట్యూబ్‌లను పెట్టుకుని మధ్య మధ్యలో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది.  డంబెల్ కర్ల్స్, ఓవర్‌హెడ్ ప్రెస్‌లు మరియు అబ్ క్రంచెస్‌లను 12 నుండి 15 సార్లు ఉపయోగిస్తూ, ప్రతి వ్యాయామం రెండు లేదా మూడు సార్లు చేయడానికి లక్ష్యంగా చూసుకోండి. 

సమయాన్ని షెడ్యూల్‌ చేసుకోవటం:  

1. ఉదయం (6-9 AM): మీ రోజును వ్యాయామంతో ప్రారంభించి ఆస్వాదించే ఉత్సాహం ఉన్నవారు ఈ సమయం లో మొదలు పెట్టొచ్చు. ఉదయాన్నే పని చేయడం వల్ల మన శరీర మెటబాలిజం బాగుంటుంది, రోజుకు కావాల్సిన శక్తి వస్తుంది, రోజంతా సానుకూలంగా ఉంటుంది. 

2. లేట్ మార్నింగ్ (10-11 AM) : కొంచెం ఆలస్యంగా రోజుని ప్రారంభించాలనుకునే వారికి మంచి సమయం. ఈ సమయానికి, శరీరం వేడెక్కుతుంది, ఫ్లెక్సిబిల్ అయ్యి మజిల్ బలం పెరుగుతుంది. 

3. భోజన సమయం (12-2 PM): కొంతమంది తమ భోజన విరామంలో వ్యాయామం చేయడం సౌకర్యంగా ఉంటుంది అనుకుంటారు. ఇలా చేస్తే పని వత్తిడి నుండి విరామంగా కూడా ఉపయోగపడుతుంది, మిగిలిన రోజు మొత్తం ఉత్సాహంగా జరిగేలా చేస్తుంది. 

4. మధ్యాహ్నం (3-5 PM) : మధ్యాహ్న సమయంలో సహజంగా శరీరంలో వ్యాయామం చేసే శక్తి ఎక్కువగా ఉంది అనుకున్నవారికి ఈ స్లాట్ అనుకూలంగా ఉంటుంది. అధిక-తీవ్రత ఉన్న వ్యాయామాలు లేదా ఒక టీమ్ గా వ్యాయామం చేసే వారికి ఇది మంచి సమయం, ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా  ఉంటుంది, కాబట్టి ఈ సమయం మెరుగైన పనితీరుకు దారితీస్తుంది. 

5. సాయంత్రం (5-7 PM) :చాలా మందికి, సాయంత్రం ప్రారంభం అయ్యే సమయం అనుకూలం. రోజంతా పని చేసిన తర్వాత, రోజు ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అదనంగా, ఈ టైమ్ స్లాట్ లో పార్టనర్స్ తో వ్యాయామం చేయడానికి బాగుంటుంది లేదా ఆఫీస్ అయ్యాక గ్రూప్ ఫిట్‌నెస్ క్లాసులకు వెళ్లే అవకాశాన్ని ఇస్తుంది. 

6. సాయంత్రం (7-9 PM) : నిద్రవేళకు దగ్గరగా వర్కవుట్‌ను ఇష్టపడే వారికి, సాయంత్రం ఆలస్యంగా వ్యాయామం చేసే సమయం ఉన్న వారికి ఇది మంచి ఎంపిక. అయితే నిద్రవేళకు, శరీరం అలసిపోతేనే మంచి నిద్ర పడుతుంది కాబట్టి వ్యాయామం చేసినా కాస్త సమయం (సుమారు గంట) గ్యాప్ ఉండేలా చూసుకోండి. 

7. రాత్రి ఔల్స్ (10 PM-అర్ధరాత్రి) : కొంతమందికి వాళ్ల పనుల వలన అర్థరాత్రి అయితే కానీ వ్యాయామం చేయదానికి అనుకూలించదు, వాళ్ళకోసం ఒత్తిడిని తగ్గించడానికి, శక్తిని పెంచడానికి ఇది మంచి సమయం అయినప్పటికీ, వ్యాయామం పూర్తి చేసిన తర్వాత తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం అని మర్చిపోకండి. 

కాబట్టి ఏదో ఒక టైం సెట్ చేసుకొని ఆ టైంలో ఎటువంటి ఎక్ససైజ్ చేస్తే మంచిది అని సెలెక్ట్ చేసుకోండి. మెరుగైన దినచర్య కోసం ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం ఎంతో మంచిది.