కుక్కలను పెంచుకుంటున్నారా?

సాధారణంగా ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో కుక్కలను పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు వీటి కోసం లక్షల రూపాయల ఖర్చు చేసి మంచి బ్రీడును తమ ఇంటికి తీసుకొస్తున్నారు. అయితే కుక్కలను ఇంటికి తెచ్చుకుంటే సరిపోదు. ఒక గార్డియన్ వాటి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కుక్కల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సరే ఒక్కొక్కసారి అవి ఇంటి యజమానులనే కరవడం ప్రారంభిస్తాయి. మరి దీనిపై ప్రముఖ వైద్యుడు అజయ్ సూద్  ఏం చెబుతున్నారు అనే […]

Share:

సాధారణంగా ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో కుక్కలను పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు వీటి కోసం లక్షల రూపాయల ఖర్చు చేసి మంచి బ్రీడును తమ ఇంటికి తీసుకొస్తున్నారు. అయితే కుక్కలను ఇంటికి తెచ్చుకుంటే సరిపోదు. ఒక గార్డియన్ వాటి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కుక్కల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సరే ఒక్కొక్కసారి అవి ఇంటి యజమానులనే కరవడం ప్రారంభిస్తాయి. మరి దీనిపై ప్రముఖ వైద్యుడు అజయ్ సూద్  ఏం చెబుతున్నారు అనే విషయం మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.

ప్రముఖ వైద్యుడు అజయ్ సూద్ ప్రకారం, కుక్కకాటు కేసుల్లో చాలావరకు అభద్రతాభావం కారణంగా జరుగుతాయి అని ఆయన ప్రస్తావించారు. సాధారణంగా ప్రతి కుక్క కూడా ఏదో కొంత ప్రాంతాన్ని తనదిగా భావిస్తుంది. ఇప్పుడు ఓవైపు మానవ జనాభా పెరిగిపోతుంది. మరోవైపు కుక్కల సంఖ్య కూడా చాలా వేగంగా పెరుగుతోంది.  ఇలాంటి పరిస్థితుల్లో కుక్కలు తమదిగా భావించే ప్రాంతం యొక్క  విస్తీర్ణం తగ్గిపోతుంది. దీంతో వాటిలో అభద్రతాభావం పెరుగుతోంది.. కాబట్టి మనుషులు తమ ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నారనే ఆలోచన భావం వాటిలో  పెరిగిపోతుంది. అలాంటి సందర్భంలో మాత్రమే అవి దూకుడుగా ప్రవర్తిస్తాయి. కొన్నిసార్లు ప్రజల్ని భయపెట్టడాన్ని కూడా కుక్కలు ఒక ఆటలా భావిస్తారు. అవి వెంటపడినప్పుడు ప్రజలు పరుగులు పెడతారు. అది చూసి మనుషులు తమకు భయపడుతున్నారని అవి తెలుసుకుంటాయి… అందుకే వెంటనే దాన్ని ఒక ఆటలా భావిస్తూ… ఈ క్రమంలో అవి ఒక్కోసారి కరుస్తాయి. అని ఆయన చెప్పారు.

మరోవైపు ఉష్ణోగ్రతలు పెరగడం, తిండి దొరకకపోవడం,  పెద్ద పెద్ద శబ్దాలు,  ప్రకాశవంతమైన లైట్లు వంటి వారు కారణంగా కూడా వీధుల్లో ఉండే కుక్కల లాగా దూకుడుగా ప్రవర్తిస్తాయి. పెంపుడు కుక్కలను వాటి యాజమానులే అలా తయారయ్యేలా చేస్తారని కూడా డాక్టర్ అజయ్ సూద్ తెలిపారు . రెండు లేదా మూడు నెలల వయస్సున్న చిన్న కుక్క పిల్లలు  ప్రతి వస్తువును తమ  నోటితో పట్టుకుంటాయి. వాటికి అప్పుడప్పుడే దంతాలు వస్తుంటాయి. అందుకే అన్నింటిని నోట్లోకి తీసుకుంటాయి. ఆ సమయంలో యజమానులు వాటిని నోటితో పట్టుకోకుండా ఆపరు పైగా అవి ఆడుకుంటున్నాయని, చూస్తూ ఆనందిస్తుంటారు. తర్వాత వాటికి అదొక అలవాటుగా మారుతుంది. నిజానికి ఇది వాటికి మంచి అలవాట్లు నేర్పించాల్సిన వయస్సు.

చాలామంది కుక్కలను తెచ్చుకొని వాటిని  ఇంట్లో ఒక మూలన కట్టేసి ఉంచుతారు. దీంతో అవి అభద్రతాభావానికి గురవుతాయి. వాటికి అంతగా పరిచయం లేని వ్యక్తులు ఎదురైనప్పుడు దూకుడుగా వ్యవహరిస్తాయి. ఇలాంటి సమయంలో ఒక్కోసారి కరవడం కూడా జరుగుతుందని, అజయ్ సూద్ విచారించారు. ప్రతి కుక్కను ఒక నిర్ణీతమైన వాతావరణంలో పెంచాల్సి ఉంటుంది.

ఉదాహరణకు  జర్మన్ షెఫర్డ్ ను ప్రతిరోజు వాకింగ్ కి తీసుకెళ్లాలి.రోజు దాన్ని నడిపించకపోతే దాని ఆరోగ్యానికి చెడు కలుగుతుంది. పరిమాణంలో పెద్దగా ఉండే ఫిట్ బుల్స్ వంటివి నిజానికి కాపలా కోసం ఉద్దేశించినవి మాత్రమే. మీకు విశాలమైన స్థలము ఉంటే వాటిని పెంచుకోవడంలో ఇబ్బంది లేదు. కానీ పరిమిత స్థలంలో వాటిని మాత్రం పెంచకూడదు. అలా చేస్తే వాటి ఆరోగ్యానికి మంచిది కాదు.పరిమిత స్థలం ఉంచే చిన్న పరిమాణంలో ఉండే వాటిని పెంచుకోవడం మంచిది. పెంపుడు కుక్కల యజమానులు కూడా కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి.

ముందుగా పెంపుడు కుక్కల యొక్క అభద్రత భావాన్ని తొలగించాలి అవి మనతో ఏం చెప్పాలనుకుంటున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయాలి వాటిని కొట్టడం లేదా వాటిని కుటుంబ సభ్యులకు దూరంగా చూడడం ఇలాంటి భేదప్రాయాలు చూపించకూడదు ఎందుకంటే అవి వెంటనే మీ భావాలను గుర్తుపట్టేస్తాయి కాబట్టి ఇటువంటి విషయంలో యజమానులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. . ఇక వాటి ఆరోగ్య విషయమై పెంపుడు కుక్కలను పూర్తిస్థాయిలో టీకాలు కచ్చితంగా ఇప్పించాలి. వ్యాక్సినేషన్ కార్డును కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. పెంపుడు కుక్కలను వదిలిపెట్టడం వాటిని హింసించడం ఎటువంటి చెడు అలవాట్లకు వాటిని దగ్గరకు చేయకూడదు.