యోగాతో వెన్నుముక సమస్య దూరం

చాలామంది ఎన్నో రకాలైన శరీర సమస్యలతో ఎంతో బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో డిప్రెషన్, అలసట ఇలాంటివి ఎన్నో మొదలయ్యాయి. ముఖ్యంగా బ్యాక్ బోన్ సమస్య ఆడవారిలో కనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఇప్పుడు ఆరు రకాల యోగ ఆసనాలు ఎలా ప్రయోజనకరంగా మారుతున్నాయో చూద్దాం.  బ్యాక్ బోన్ సమస్య ఇలా దూరం అవుతుంది:  యోగా చేయడం కారణంగా మన శరీరానికి ఎన్నో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎన్నో రీసెర్చ్ల ప్రకారం ఎన్నో రకాల […]

Share:

చాలామంది ఎన్నో రకాలైన శరీర సమస్యలతో ఎంతో బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో డిప్రెషన్, అలసట ఇలాంటివి ఎన్నో మొదలయ్యాయి. ముఖ్యంగా బ్యాక్ బోన్ సమస్య ఆడవారిలో కనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఇప్పుడు ఆరు రకాల యోగ ఆసనాలు ఎలా ప్రయోజనకరంగా మారుతున్నాయో చూద్దాం. 

బ్యాక్ బోన్ సమస్య ఇలా దూరం అవుతుంది: 

యోగా చేయడం కారణంగా మన శరీరానికి ఎన్నో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎన్నో రీసెర్చ్ల ప్రకారం ఎన్నో రకాల శరీర సంబంధిత వ్యాధులను దూరం చేసింది యోగ. చాలా మందికి తెలిని విషయం ఏంటంటే మన శరీరం అనేది మన మెదడు ప్రశాంతతకు కనెక్ట్ అయి ఉంటుంది. మన మైండ్ ప్రశాంతంగా ఉంటేనే మన శరీరంలో ఆరోగ్యం మరింత పెంపొందించుకునే వాళ్ళం అవుతాము. మనం ఎక్కువగా వ్యాయామం చెయ్యలేము హెల్త్ కేర్ గురించి అంత సమయం వ్యతించలేము అనే వారి కోసం, ఈరోజు కొన్ని యోగ ఆసనాలు గురించి తెలుసుకుందాం. ఇవి మన రోజు దినచర్యలో ఒక అరగంట చేయడం ప్రారంభిస్తే మన శరీరంలో మనం చక్కని మార్పు మనం చూడొచ్చు. ముఖ్యంగా బ్యాంక్ బోన్ సమస్యలు నివారించడానికి యోగా అనేది మంచి చిట్కా.

ప్రస్తుత జీవన శైలిలో, ఎక్కువసేపు ఆఫీసులో కూర్చుని ఉండడం అనేది ఒక భాగంగా మారిపోయింది. దీని కారణంగా చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తో బాధపడుతున్నారు. అంతే కాకుండా బ్యాక్ బోన్ ప్రాబ్లం తోనే ఎక్కువ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ముఖ్యమైన ఆసనాలు వేయడం ద్వారా, మనిషి శరీరంలో అనేక సమస్యలు దూరం అవుతున్నాయని యోగా నిపుణులు బాగా చెప్తున్నారు. ఎక్కువగా కూర్చుని ఉండడం వల్ల, ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల, బ్యాక్ బోన్ సమస్య అదే విధంగా జీర్ణ సమస్యలు కూడా తగిలితే అవకాశాలు ఉంటాయి.

ముఖ్యంగా ఎక్కువగా అలసటగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. బ్రీతింగ్ ఎక్ససైజ్, మెడిటేషన్ అనేవి యోగాలో ముఖ్యమైన భాగం. యోగ చేయడం వల్ల స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మన జీర్ణ సమస్య తగ్గి మనం తీసుకునే ఆహారంలోని పోషకాలు మన శరీరానికి పట్టేలా చేస్తాయి. మన పొత్తి కడుపులో చక్కగా బ్లడ్ సర్కులేషన్ సక్రమంగా జరగడానికి యోగ బాగా ఉపయోగపడుతుంది. మన వెన్నుముక స్ట్రాంగ్ గా ఉండటానికి తోహదపడుతుంది. అంతేకాకుండా ఇటువంటి యోగ ఆసనాలు వేయడం ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మన శరీరంలో బాగా పెరుగుతాయి. ప్రతి ఒక్కసారి రా అవయవాలలో బ్లడ్ సర్కులేషన్ అన్నది చాలా బాగా జరిగి మనం మరింత యవ్వనంగా అదే విధంగా ఉత్సాహంగా కనిపించడానికి తోహదపడతాయి. 

ఇప్పుడు ఐదు యోగ ఆసనాల గురించి తెలుసుకుందాం: 

భుజంగాసనం: 

భుజంగాసనం వెయ్యడం కారణంగా మన వెన్నుముక దృఢంగా మారి ఎందుకు, ముఖ్యంగా జీర్ణశక్తి మరింత మెరుపు పడడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా కండరాల్లో శక్తి పెంపొందించుకుంటుంది. 

పవనముక్తాసన: 

ఈ ఆసనం వల్ల పొత్తికడుపులోని కండరాలు బలపడతాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. గ్యాస్టిక్ సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా జీర్ణశక్తి మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

ధనురాసనం: 

ఇది కండరాలు బలపడడానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా, మన శరీరంలో ప్రతి అవయవం యొక్క శక్తి మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా వెన్నుముక బలంగా మారుతుంది. జీర్ణశక్తి మెరుగు పడుతుంది.  

అర్థ మత్స్యంద్రాసన: 

ఈ ఆసనం గమ్మత్తుగా ఉంటుంది. కాస్త వెనక్కి తిరిగి కూర్చున్నట్లు ఈ ఆసనం కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల మన కండరాళ్ళకి మసాజ్ అయినట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా మన శరీరంలో రక్తప్రసరణ ఈజీగా జరిగేలా ప్రోత్సహిస్తుంది. 

పశ్చిముత్తానాసనం: 

ఇది ముఖ్యం గా పొత్తి కడుపు కండరాల బలానికి ఎంతో ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. 

సూర్య నమస్కారం: 

ఉదయాన్నే ఈ సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల, మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క అవయవం ఉత్తేజ పడుతుంది. ముఖ్యంగా మనం వివరంగా కనిపించడానికి ఇది సహాయపడుతుంది. జీర్ణశక్తి పెంపొందించడానికి దోహదపడుతుంది. మన కండరాలు ఎముకలు బలంగా మారడానికి సూర్యకాంతి ఉపయోగపడుతుంది.