పీరియడ్స్ క్రాంప్స్ నుంచి తప్పించే ఆహార పదార్థాలు

ప్రతి నెల పీరియడ్స్ కారణంగా మహిళలలో మూడ్ స్వింగ్స్, ఉబ్బరం అంతేకాకుండా పీరియడ్స్ క్రాంప్స్ సర్వసాధారణం. అయితే ఈ టైంలో ఆడవాళ్లు ప్రశాంతంగా ఉండటానికి అదే విధంగా శక్తివంతంగా ఉండటానికి మీరు మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు గురించి ఇప్పుడు తప్పకుండా తెలుసుకోవాల్సిందే..  ఉసిరికాయలు:  ఉసిరికాయలలో ముఖ్యంగా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ ఉసిరికాయలు అనేవి ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఈ ఉసిరికాయలు దివ్య ఔషధం. అంతేకాకుండా బ్లడ్ […]

Share:

ప్రతి నెల పీరియడ్స్ కారణంగా మహిళలలో మూడ్ స్వింగ్స్, ఉబ్బరం అంతేకాకుండా పీరియడ్స్ క్రాంప్స్ సర్వసాధారణం. అయితే ఈ టైంలో ఆడవాళ్లు ప్రశాంతంగా ఉండటానికి అదే విధంగా శక్తివంతంగా ఉండటానికి మీరు మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు గురించి ఇప్పుడు తప్పకుండా తెలుసుకోవాల్సిందే.. 

ఉసిరికాయలు: 

ఉసిరికాయలలో ముఖ్యంగా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ ఉసిరికాయలు అనేవి ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఈ ఉసిరికాయలు దివ్య ఔషధం. అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గించడానికి. రోగనిరోధక శక్తి పెంచడానికి శరీరంలో ఉన్న టాక్సిక్ లెవెల్స్ ను నిర్మూలించడానికి ఉసిరికాయ ఎంతగానో సహాయపడుతుంది. ఆడవారిలో ముఖ్యంగా శక్తివంతమైన ఆహార పదార్థాల పోషక విలువలు ఉండడమే ఎంతో అవసరం. అందుకే ఆడవారు ముఖ్యంగా ఉసిరికాయ తీసుకోవడం శరీరానికి ఆరోగ్యానికి ఎంతో మంచిది. 

అరటి పళ్ళు: 

అరటిపండ్లు మృదువుగా ఎలాంటి వయసు వారైనా తినడానికి సులభంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే, వాటిలో చాలా ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంది అరటి పండు పసుపు మరియు పండినవి తింటారు, కానీ ఆకుపచ్చ పండని అరటిపండ్లు కూడా తినడానికి చాలా మంచిది. పీరియడ్స్ టైం లో కూడా ఆడవాళ్లు అరటిపళ్ళు తినడం ఎంతో అవసరం. అయితే, కొందరు మాత్రమే వీటి రుచి అలాగే, ఈ అరటి పళ్ళు షేప్ చూసి తినడానికి ఇష్టపడరు కానీ, పచ్చ అరటి పళ్ళు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అరటిపండ్లు సాధారణంగా పచ్చగా ఉన్నప్పుడే పండిస్తారు. మీరు వాటిని కొనుగోలు చేసే ముందు పచ్చ అరటిపళ్ళను తీసుకోవడం మర్చిపోకండి. 

ఖర్జూరం: 

ఆడవారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క వయసు వారు కూడా ఖర్జూరం తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఖర్జూరాన్ని ఎండబెట్టి డ్రైఫ్రూట్ గా చేసుకునే, రాత్రి నానబెట్టుకుని ఉదయం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటున్నాయి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆడవారిలో పీరియడ్స్ సమయంలో శక్తిని పొంచుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు ముఖ్యంగా ఈ ఖర్జూరం ఔషధంగా పనిచేస్తోంది. అంతేకాకుండా బ్లడ్ లెవెల్స్ తగ్గకుండా ఉండేందుకు, ఖర్జూరం లో ఉండే ఐరన్ ఎంతగానో సహాయపడుతుంది. 

అల్లం: 

ఈ అల్లం లో ముఖ్యంగా నొప్పి నివారణ శక్తి అనేది చాలా బాగుంటుంది, ఆడవారిలో నొప్పిని తట్టుకునే శక్తిని పెంపొందించడంలో అల్లం ముఖ్య పాత్ర పోషిస్తుంది.  అంతేకాకుండా ఆడవారిలో పీరియడ్స్ సమయంలో, జీర్ణశక్తి పెంపొందించడానికి కూడా ఈ అల్లం అనేది చక్కగా పనిచేస్తుంది. 

హెర్బల్ టీ: 

చాలామందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది, కానీ నార్మల్ టీ తాగే బదులు హెర్బల్ టీ తాగడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయంటున్నారు నిపుణులు. వేడి నీళ్లల్లో మనకి కావాల్సిన కొన్ని మూలికలు వేసుకుని, ఉదయాన్నే తాకినట్లయితే ఒత్తిడికి దూరం అవుతాము, అంతేకాకుండా జీర్ణశక్తి పెంపొందించడంలో ఇది సహాయపడుతుంది. మూలికలలో ఉండే ఔషధ గుణాలు, ఆడవారిలో పీరియడ్స్ సమయంలో శక్తిని పొంచుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు ముఖ్యంగా ఔషధంగా పనిచేస్తోంది. 

వాల్నట్: 

డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు కదా. అయితే ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ లో వాల్నట్ అనేది ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ తో నిండి ఉండే ఒక మంచి ఆహార పదార్థం. ఇందులో ఉండే ప్రోటీన్.. ఫైబర్.. మెగ్నీషియం వంటివి మనకి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా ఎక్కువ సేపు ఎనర్జిటిక్ గా ఉండడానికి కూడా వాల్నట్ సహాయపడుతుంది. ఆడవారి పీరియడ్స్ సమయంలో ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.