హీట్, కోల్డ్ ప్యాక్స్.. ఉప‌శ‌మ‌నానికి ఏది బెట‌ర్?

మనకు గాయాలు అయినపుడు మనం వెంటనే రిలాక్సియేషన్ కోరుకుంటాం. రిలాక్స్ అవడం కోసం కొన్ని రకాల పద్ధతులను కూడా అనుసరిస్తుంటాం. చాలా రకాల పద్ధతులు మనకు వెంటనే ఉపశమనాన్ని అందిస్తాయి. కొన్ని రకాల పద్ధతులు మాత్రం అంతగా సక్సెస్ కావు. మనం గాయం అయినపుడు ఉపశమనం కోసం హాట్ ప్యాక్ వాడడం మంచిదా లేదా కోల్డ్ ప్యాక్ వాడడం మంచిదా అని అంతా ఆలోచిస్తుంటారు. మనకు గాయాలయినపుడు ఏ ప్యాక్ వాడడం మంచిదో తెలపడం చాలా కష్టం. […]

Share:

మనకు గాయాలు అయినపుడు మనం వెంటనే రిలాక్సియేషన్ కోరుకుంటాం. రిలాక్స్ అవడం కోసం కొన్ని రకాల పద్ధతులను కూడా అనుసరిస్తుంటాం. చాలా రకాల పద్ధతులు మనకు వెంటనే ఉపశమనాన్ని అందిస్తాయి. కొన్ని రకాల పద్ధతులు మాత్రం అంతగా సక్సెస్ కావు. మనం గాయం అయినపుడు ఉపశమనం కోసం హాట్ ప్యాక్ వాడడం మంచిదా లేదా కోల్డ్ ప్యాక్ వాడడం మంచిదా అని అంతా ఆలోచిస్తుంటారు. మనకు గాయాలయినపుడు ఏ ప్యాక్ వాడడం మంచిదో తెలపడం చాలా కష్టం. మనకు అయిన గాయం స్వభావాన్ని బట్టి అప్పటికప్పుడు ఈ నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంటుంది. కొన్ని రకాల గాయాలకు హీట్ ప్యాక్ బాగా పని చేస్తే కొన్ని రకాల గాయాలకు మాత్రం కోల్డ్ ప్యాక్ చక్కటి రిలాక్సియేషన్ అందిస్తుంది. కావున హీట్ ప్యాకా లేక కోల్డ్ ప్యాకా అనేది ఎప్పుడో నిర్ణయించడం కష్టం. ఫలానా గాయాలకు ఇదే వాడాలని చెప్పలేం. 

అసలేంటీ ప్యాక్స్…

మనకు ఏదైనా గాయం అయినపుడు వెంటనే రిలాక్సియేషన్ కోసం మనం ఐస్ ప్యాక్ లేదా వేడి ఉప్పును ఉపయోగిస్తుంటాం. వాటినే ఈ ప్యాక్స్ అని సంబోధిస్తుంటారు. వీటిని మనం గాయాల మీద అప్లై చేసిన తర్వాత చాలా రిలాక్స్ డ్ గా ఉంటుంది. మనకు గాయాలు అనేవి సహజంగా అవుతూ ఉంటాయి. మనం ఏదైనా వర్క్ చేసేటపుడు లేదా ఏదైనా ఆట ఆడేటపుడు గాయాలు కావడం కామన్. అందుకోసం మనం గాయాలు కాకుండా ఇంట్లోనే కూర్చోవడం అంటే కుదరదు. 

నిపుణులేం చెబుతున్నారంటే… 

ఈ ప్యాక్స్ విషయంలో నిపుణులు ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతారు. మనకు అయిన గాయం స్వభావాన్ని బట్టి మనం ప్యాక్స్ ఉపయోగించాలనేది వారి అర్థం. అల గాయం స్వభావాన్ని బట్టి ప్యాక్స్ వాడితేనే బెటర్ గా ఉంటుంది. అలా కాకుండా మనకు ఇష్టం వచ్చినపుడు ప్యాక్స్ వాడితే అవి అంత ఎఫెక్టివ్ గా ఉండవు. కావున మనకు నొప్పి నుంచి ఉపశమనం లభించదు. మనకు వాపు వచ్చినపుడు మనం కోల్డ్ ప్యాక్ ను ఉపయోగించడం వలన అది మనకు ఎంతో రిలాక్సియేషన్ అందిస్తుంది. అది బాగా పని చేస్తుంది. అటువంటి సమయంలో మనం హీట్ థెరపీకి దూరంగా ఉండాలి. ఒక వేళ మనకు కండరాల నొప్పి వచ్చినా లేక వేరే ఇతర రకాల జాయింట్స్ కు సంబంధించిన నొప్పులు వచ్చినా కానీ మనం అప్పుడు హీట్ ప్యాక్ ఉపయోగించాలి. ఎప్పుడు హీట్ థెరపీ ఉపయోగించాలి. లేదా ఎప్పుడు కోల్డ్ థెరపీ ఉపయోగించాలనే విషయంలో కాస్త గందరగోళం ఉంటుంది. 

హీట్ థెరపీ చేసేదిదే… 

మనకు ఏదైనా నొప్పి వచ్చినపుడు మనం హీట్ థెరపీని వాడుతూ ఉంటాం. హీట్ థెరపీని ఉపయోగించగానే మనకు చాలా రిలాక్స్ గా అనిపిస్తుంటుంది. అసలు అంతలా హీట్ థెరపీ ఏం చేస్తుందని అంతా ఆశ్చర్యపోతుంటారు. మనం హీట్ థెరపీని అప్లై చేసినపుడు అది మన శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. అందువల్లే మన జీవక్రియ పెరిగి రక్తప్రసరణ కూడా పెరుగుతుంది. కాబట్టే మనకు నొప్పి తగ్గి రిలాక్సియేషన్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

క్రయోథెరపీ ఏం చేస్తుందంటే… 

కోల్డ్ ప్యాక్ లేదా క్రయో థెరపీ అన్నా ఒకటే అర్థం వస్తుంది. ఈ కోల్డ్ ప్యాక్ మనకు గాయాలయినపుడు ఏం చేస్తుందంటే… ఇది మన చర్మకణజాలం అలాగే కీళ్ల ఉష్ణోగ్రతలను కూడా తగ్గిస్తుంది. ఇలా తగ్గించడం వల్ల మనకు గాయం అయిన చోట దీనిని అప్లై చేయగానే భారీ ఉపశమనం కలుగుతుంది. కానీ మనం హాట్ ప్యాక్ వాడాలా లేక కోల్డ్ ప్యాక్ వాడాలా అనేది మనకు అయిన గాయం స్వభావాన్ని బట్టి ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఒక్కో రకం గాయం అయినపుడు ఒక్కో రకమైన ప్యాక్ ను వాడాలని వారు సూచిస్తున్నారు. మనం వారి సూచనలను కాకుండా వేరే విధమైన ప్యాక్ లను ఉపయోగించడం వలన ఉపశమనం సంగతి అటుంచితే మనకు వేరే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఏ గాయనికి ఎటువంటి ప్యాక్ ఉపయోగించాలో తెలుసుకుని వాడడం మంచిది. 

ఏ ప్యాక్ అయితే ఏంటంటే… 

కొంత మంది మాత్రం ఏ ప్యాక్ అయితే ఏంటి వాడితే అయిపోతుంది కదా.. మనకు గాయం అయినపుడు ఉపశమనం లభిస్తుందని అనుకుంటారు. కానీ అలా ఏదిబడితే అది వాడడం కరెక్ట్ కాదు. మనకు ఎటువంటి స్వభావం ఉన్న గాయమయిందో దానికి ఉపశమనం అందించే ప్యాక్ ను మాత్రమే వాడాలి. అలా కాకుండా వేరే రకమైన ప్యాక్ వాడితే ఉపశమనం కలగదు. కావున మనం ఉపశమనం కోసం ప్యాక్ ను వాడే ముందు దాని గురించి తెలుసుకోవడం చాలా అవసరం. పూర్తి సమాచారంతోనే ప్యాక్ లను వాడాలి. అలా కాకపోతే డాక్టర్ ను సంప్రదించి వారి నుంచి సలహాను తీసుకోవాలి.