గుండెపోటు ఎందుకు వస్తుంది? గుండె నాళాలు మూసుకుపోవడం అంటే ఏమిటి?

గుండె గురించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువని నమ్ముతారు. బలహీనమైన గుండె ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశం గానీ, గుండె ఆగిపోయే అవకాశం గానీ ఉంది. అందుకోసమే గుండె గురించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువని నమ్ముతారు. బలహీనమైన గుండె ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశం గానీ, గుండె ఆగిపోయే అవకాశం గానీ ఉంది. ఇదివరకటి రోజులలో వృద్ధులకు మాత్రమే హార్ట్ ఎటాక్ […]

Share:

గుండె గురించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువని నమ్ముతారు. బలహీనమైన గుండె ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశం గానీ, గుండె ఆగిపోయే అవకాశం గానీ ఉంది.

అందుకోసమే గుండె గురించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువని నమ్ముతారు. బలహీనమైన గుండె ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశం గానీ, గుండె ఆగిపోయే అవకాశం గానీ ఉంది. ఇదివరకటి రోజులలో వృద్ధులకు మాత్రమే హార్ట్ ఎటాక్ వచ్చేది, కానీ ఈ రోజులలో 30, 40 సంవత్సరాల వయస్సులో ఉన్న యువకులకు కూడా గుండెపోటు వస్తోంది. అంతెందుకు, ఇరవైలలో వాళ్లకు కూడా గుండెపోటు వచ్చి చనిపోయిన సందర్భాల గురించి కూడా వింటున్నాం. ఇది చాలా విచారకరమే అయినా అసలు గుండెపోటు ఎందుకు వస్తుందని ఆలోచించాలి. కొంత మంది చెడు అలవాట్లు ఉన్న వారికి త్వరగా గుండె పోటు వస్తుంది. కానీ కొంత మందిలో ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినా కానీ గుండె పని చేయడం ఆగిపోతుంది. అందుకోసమే ఎటువంటి వారైనా సరే తమ గుండె ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ తనిఖీ చేసుకుంటూ ఉండాలి. గుండె విషయంలో ఏ మాత్రం లైట్ తీసుకున్నా కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతో మంది పనులు చేసుకుంటూ గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఘటనలు చూశాం. ఇవన్నీ జంక్ ఫుడ్ వల్లే అని మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ ఇందులో చాలా మట్టుకు మన జీవన విధానం సరిగ్గా లేకపోవడం వలన వస్తున్నాయి.  

గుండెపోటుకు ప్రధాన కారణం కరోనరీ ధమనులు లేదా గుండె నాళాలు మూసుకొని పోవటం.  ధమనులు మూసుకుపోయినప్పుడు గుండె వాటికి ఆక్సిజన్‌ని, రక్తాన్ని అందించదు. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. కరోనరీ ధమనులు మూసుకుపోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ సరైన జీవనశైలి లేకపోవటం దీనికి ప్రధాన కారణం.

కరోనరీ ధమనులు మూసుకుపోవడానికి గల కారణాలను తెలుసుకుందాం.‍‌

చలికాలంలో నాళాలు సంకోచిస్తాయి

చలికాలంలో ఉండే చల్లని వాతావరణం కారణంగా ఈ రక్తనాళాలు సంకోచించడం వల్ల చాలా వరకు గుండెపోటు కేసులు నమోదవుతాయి. అందువల్ల గుండె సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిదని డాక్టర్లు సలహా ఇస్తుంటారు.

వ్యాయామం తక్కువగా చేయడం

నేటి వేగవంతమైన ప్రపంచంలో ఎవరికీ వ్యాయామం చేసేటంత తీరిక లేదు. దీనివల్ల  కరోనరీ ధమని మూసుకుపోతుంది. శరీరానికి తగినంత వ్యాయామం లేకపోతే రక్త నాళాలు మూసుకుపోతాయి, ఫలితంగా కండరాలు, రక్త నాళాల ద్వారా రక్త ప్రవాహం నెమ్మదిగా జరుగుతుంది.

కొలెస్ట్రాల్

ఫాస్ట్‌ఫుడ్, వేయించిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు సరిగ్గా ఉండవు. దీనివల్ల కరోనరీ ధమనులు దెబ్బతిని మూసుకుపోతాయి. గుండెకు రక్తం సరిగ్గా అందకపోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది.

ఒత్తిడి, ఆందోళన 

ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా గుండెపోటు రావచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో మయోకార్డియల్ ఇస్కీమియా వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది.

అంటే, మనం ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు, గుండెలోని రక్త ప్రసరణ హెచ్చుతగ్గులకు గురవడం మొదలవుతుంది. అంతే కాకుండా, ఒత్తిడి వల్ల గుండె కండరాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇది గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని ఇంకా పెంచుతుంది.

అందువల్ల మనం కుదిరినంత వరకు చురుకుగా ఉంటూ, వ్యాయామం చేస్తూ ఉంటే గుండె జబ్బులు లేదా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. వీలైనంత వరకు ఆరోగ్యంగా ఉండేందుకు ట్రై చేసి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని నివారించుకోండి.