కరోనా వ్యాక్సిన్ తో హార్ట్ ఎటాక్ నిజమేనా

కరోనా… కరోనా… కరోనా… కొద్ది రోజుల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించింది. శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడి ఈ వ్యాధికి వ్యాక్సిన్ కనుక్కున్నారు కాబట్టి ప్రజలు సేఫ్ అయ్యారు. వ్యాక్సిన్స్ తీసుకుని అంతకు ముందులా సేఫ్ గా తిరుగుతున్నారు. లేకపోతే ప్రస్తుతం కూడా ప్రజలు భయం లేకుండా తిరిగే వారు కాదు. కానీ ఈ కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఎప్పటి నుంచో ఓ ప్రచారం నడుస్తోంది. మరీ ముఖ్యంగా హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదకర […]

Share:

కరోనా… కరోనా… కరోనా… కొద్ది రోజుల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించింది. శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడి ఈ వ్యాధికి వ్యాక్సిన్ కనుక్కున్నారు కాబట్టి ప్రజలు సేఫ్ అయ్యారు. వ్యాక్సిన్స్ తీసుకుని అంతకు ముందులా సేఫ్ గా తిరుగుతున్నారు. లేకపోతే ప్రస్తుతం కూడా ప్రజలు భయం లేకుండా తిరిగే వారు కాదు. కానీ ఈ కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఎప్పటి నుంచో ఓ ప్రచారం నడుస్తోంది. మరీ ముఖ్యంగా హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదకర జబ్బులు వస్తున్నాయని అంతా భయపడ్డారు. ఇప్పుడు ఈ వార్తలపై ప్రముఖ వైద్యులు స్పందించారు. వారేం చెప్పారంటే.. 

వ్యాక్సిన్ తో హార్ట్ ఎటాక్.. వైద్యులు చెప్పిందిదే

కరోనా వ్యాక్సిన్ తో హార్ట్ ఎటాక్ వస్తుందని జరుగుతున్న ప్రచారాన్ని వైద్యులు పూర్తిగా ఖండించారు. అటువంటిదేం లేదని వారు తెలిపారు.అసలు వాస్తవం చెప్పాలంటే అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందించడం వల్లే కరోనా కంగారు లేకుండా మనం జీవించగల్గుతున్నాం. అయినా కానీ ఈ వైరస్ అనేది రోజూ అభివృద్ధి చెందుతూనే ఉంది. కొత్త, కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ వైరస్ తీవ్రతను అడ్డుకోవడంలో వ్యాక్సిన్ ఎంతో పని చేసింది. కానీ కొంత మంది మాత్రం ఈ వైరస్ కు తీసుకునే వ్యాక్సిన్ వల్ల కొన్ని దుష్ప్రభావాలు వస్తాయని కొంత మంది రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ రూమర్స్ విషయంలో వైద్యులు, సైంటిస్టులు స్పందించారు. ఓ జర్నల్ లో మాట్లాడుతూ… కోవిడ్ వ్యాక్సిన్‌ లు కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ గుండెపోటుకు ప్రమాద కారకంగా ఉండవని మరియు వాస్తవానికి గుండెపై రక్షిత ప్రభావాన్ని చూపుతాయని ఈ అధ్యయనం నిర్ధారించింది. 

1578 మంది నుంచి డేటా

ఈ స్టడీని ఆగస్టు 2021 నుంచి ఆగస్టు 2022 మధ్య ఢిల్లీలోని GB పంత్ ఆసుపత్రిలో చేరిన 1,578 మంది వ్యక్తులపై నిర్వహించారు. వారి నుంచి డేటాను కలెక్ట్ చేశారు. వారిలో 1,086 (68.8 శాతం) మందికి కరోనా టీకాలు వేయగా, 492 (31.2 శాతం) మందికి టీకాలు వేయలేదు. టీకాలు వేసిన వారిలో 1,047 (96 శాతం) మంది టీకా యొక్క రెండు డోస్‌లను పొందారు. అలాగే 39 (4 శాతం) మంది ఒకే డోస్‌ను తీసుకున్నారు. కానీ వారెవరికీ టీకాల వల్ల గుండె పోటు అనేది రాలేదని వైద్యులు తెలిపారు. అంతే కాకుండా గుండెపోటు వచ్చిన రోగులను కూడా తాము విశ్లేషించామని వైద్యులు తెలిపారు. వారిలో కూడా చాలా మందికి టీకాలు వేయబడ్డాయని పేర్కొన్నారు. అప్పుడు తమకు చాలా ఆశ్చర్యం కలిగిందని అన్నారు. టీకాల వల్ల గుండెపోటుతో ముడిపడి ఉండే ముఖ్యమైన దుష్ప్రభావాలు ఏవీ లేవని గుర్తించినట్లు తెలిపారు. టీకాలు వేసుకుంటేనే గుండెపోటు సంభవిస్తుందనే విషయంలో ఎటువంటి నిజం లేదని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మరియు కార్డియాలజీ ప్రొఫెసర్ ఒకరు పేర్కొన్నారు. టీకాలు వేయని వారితో పోలిస్తే టీకాలు వేసిన వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని కూడా కనుగొన్నారు. గుండెపోటును ప్రేరేపించడంలో కోవిడ్ వ్యాక్సిన్ మరింత చురుకైన పాత్రను పోషిస్తుందనే వాదనను ఈ అధ్యయనం తోసిపుచ్చినప్పటికీ.. మహమ్మారి తర్వాత మాత్రం గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి.

ఈ కారణాలే కావొచ్చు… 

గుండెపోటు రావడానికి అసలు వ్యాక్సిన్ కారణం కాదు. గుండెపోటు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. కరోనా వ్యాక్సిన్ లేకముందు గుండెపోటు కేసులు లేవా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, ధూమపానం వంటి అనేక కారణాల వల్ల ఇండియాలో గుండెపోటు సంభవిస్తోంది. మేజర్ గా గుండెపోటు వచ్చే భారతీయులు ఇవే కారణాల వల్ల ప్రభావితం అవుతున్నారు. కోపం వంటి మానసిక సామాజిక ఒత్తిడి వంటి కారకాలు కూడా ఇప్పుడు గుండెపోటుకు కారణం అవుతున్నాయి. అందుకోసమే గుండెపోటు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా కానీ మనం చాలా పెద్ద ప్రమాదంలో పడాల్సి వస్తుంది. కావున జాగ్రత్త అనేది చాలా ముఖ్యం.