టీనేజ‌ర్ల‌లో గుండెపోటు రాకుండా..

గుండెపోటు రాకుండా ఉండడానికి మనం పాటించాల్సిన ముఖ్యమైన చర్యలు ఇవే ! ఈమధ్య కాలం లో వయస్సు తో అసలు సంబంధమే లేకుండా గుండెపోటు రావడం అనేది మనం గమనిస్తూనే ఉన్నాము. మన కళ్ళ ముందే క్షణకాలం వరకు ఎంతో యాక్టీవ్ తిరిగే వాళ్ళు, వెంటనే గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయిన వీడియోలను గతం లో మనం ఎన్నో చూసాము. ఉదాహరణకి కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు వచ్చి చనిపోయిన ఘటన మన అందరినీ […]

Share:

గుండెపోటు రాకుండా ఉండడానికి మనం పాటించాల్సిన ముఖ్యమైన చర్యలు ఇవే !

ఈమధ్య కాలం లో వయస్సు తో అసలు సంబంధమే లేకుండా గుండెపోటు రావడం అనేది మనం గమనిస్తూనే ఉన్నాము. మన కళ్ళ ముందే క్షణకాలం వరకు ఎంతో యాక్టీవ్ తిరిగే వాళ్ళు, వెంటనే గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయిన వీడియోలను గతం లో మనం ఎన్నో చూసాము. ఉదాహరణకి కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు వచ్చి చనిపోయిన ఘటన మన అందరినీ ఎలాంటి శోకసంద్రం లోకి నెట్టేసిందో తెలిసిందే. ముందు రోజు వరకు కూడా తన అన్నయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చలాకీగా మాట్లాడుతూ, డ్యాన్స్ కూడా చేసిన ఆయన పక్కరోజు తెల్లవారు జామున ఛాతిలో నొప్పి ఉందంటూ హాస్పిటల్ కి కార్ లో వెళ్లిన ఆయన మళ్ళీ తిరిగి శవమై ఇంటికి వచ్చాడు. అలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి, మనం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత అయితే చిన్న చిన్న పిల్లలకు కూడా గుండె పోటు వచ్చేస్తుంది. డాక్టర్లు చెప్తున్నది ఏమిటంటే చాటి మధ్య భాగం లో నొప్పి వచ్చినప్పుడు వెంటనే డాక్టర్లకు చూపించామంటున్నారు. అలా మధ్య భాగం లో నొప్పి వస్తే గుండెపోటు రావడానికి సంకేతం అట. అంతే హృద్రోగ సంబంధిత సమస్యలు కలిగిన కుటుంబ చరిత్ర ఉన్నవారికి గుండెపోటు చాలా తేలికగా వస్తుందట:

ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు ఈసీజీ తీసుకొనుట తప్పనిసరి:

జన్యుపరంగానే యువకులకు గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. దీనితో పాటుగా జీవన శైలిలో వల్ల కూడా యువకులకు ఈ గుండె పోటు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఏ కారణం చేతనైనా ఛాతిలో నొప్పి ఉంటే వెంటనే ఈసీజీ తీసుకోవాలని అంటున్నారు డాక్టర్లు. ఈసీజీ లో స్పష్టంగా తెలియకపోతే వెంటనే 2D ఎకో తీసుకోవాల్సిందిగా సూచిష్టిస్తున్నారు. దీనిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని, అలా చేస్తే గుండెపోటు రాక తప్పదని అంటున్నారు.కాబట్టి ఎవరికైనా ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు మాత్రం మీ సమీపం లో ఉన్న డాక్టర్లను కలిసి ఈసీజీ తీసుకోండి. 

అలవాట్లు :

ఇక గుండెపోటు రావడానికి ప్రధానమైన కారణాలలో ఒకటి మనకి ఉన్న చెడు అలవాట్లు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ రిపోర్ట్స్ ప్రకారం , దాదాపుగా 25 శాతానికి చెందిన పాఠశాల మరియు కళాశాల విద్యార్థులతో పాటుగా, సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగులు ఎక్కువగా పొగాకుకు సంబంధించిన వివిధ రకమైన ప్రాడక్ట్స్ ని వాడుతుంటారని, అందువల్ల ప్రతీ ఏడాది 90 వేల మందికి పైగా గుండెపోటుతో మరణిస్తున్నారని తెలుస్తుంది. సాధ్యమైనంత తొందరగా ఈ చెడు అలవాట్లు మానేయడం మంచిది, లేకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో గుండెపోటు రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

కొవ్వు పేరుకొనిపోవడం :

ఇది ఉద్యోగం చేసేవారికి చాలా తేలికగా వస్తుంది. ఆఫీస్ లో లంచ్ సమయం లో భోజనం చేసిన వెంటనే కుర్చీలో కూర్చొని పని చెయ్యడం మొదలు పెడుతారు. మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు భోజనం చేసి వెంటనే నిద్రపోతారు. చేతి వేళ్ళకు తప్ప కదలకుండా శరీరానికి పని చెప్పట్లేదు మనం. ఇలా చేస్తే శరీరం లో కొవ్వు పేరుకొని పోతుంది, కొవ్వు కారణంగా గుండెపోటు రావడం అనేది చాలా కామన్ అనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతీ రోజు మితంగా వ్యాయామం చెయ్యడం , జాకింగ్ చెయ్యడం వంటివి తప్పనిసరి. డ్రై ఫ్రూప్ట్స్, గ్రీన్ టీ , వేడి నీళ్లలో తేనె కలుపుకొని త్రాగడం వంటివి చెయ్యడం వల్ల కొవ్వు ని బాగా కరిగించవచ్చు.