ఆరోగ్యకరమైన అలవాట్లతో ఎక్కువ కాలం జీవించొచ్చు…

ఉరుకులు పరుగుల జీవితంలో శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నేటి వేగవంతమైన జీవితంలో ఆరోగ్యం కోసం చాలా మంది పలు పద్దతులను అవలంభిస్తుంటారు … వయసు పై బడుతుంది అనేసరికి రక రకాల జబ్బులుని ఎదురుకోవాల్సి వస్తుంది … ఇప్పటికే అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా జీవితంపై ఆశ కోల్పోవాల్సిన అవసరం లేదు, మీ జీవిత కాలాన్ని పొడగించుకోవడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలో మనం తెలుసుకుందాం దీనికోసం కొన్ని ఆరోగ్యకరమైన […]

Share:

ఉరుకులు పరుగుల జీవితంలో శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

నేటి వేగవంతమైన జీవితంలో ఆరోగ్యం కోసం చాలా మంది పలు పద్దతులను అవలంభిస్తుంటారు … వయసు పై బడుతుంది అనేసరికి రక రకాల జబ్బులుని ఎదురుకోవాల్సి వస్తుంది … ఇప్పటికే అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా జీవితంపై ఆశ కోల్పోవాల్సిన అవసరం లేదు, మీ జీవిత కాలాన్ని పొడగించుకోవడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలో మనం తెలుసుకుందాం దీనికోసం కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించాలి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం 

ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించటానికి సమయం ఎప్పుడూ మించిపోదు. మీరు 50 లేదా 60 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పటికీ కూడా, ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా చురుకుగా ఉండవచ్చు. కొన్ని జీవనశైలి మార్పులతో మీ ఆయుష్షును మరిన్ని దశాబ్దాలు పొడగించుకోవచ్చు. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చునని ఒక తాజా పరిశోధనలో తేలింది. వెటరన్స్ అఫైర్స్ మిలియన్ వెటరన్ ప్రోగ్రామ్‌ అధ్యయనంలో 40 నుంచి 99 సంవత్సరాల వయస్సు గల 700,000 మందిపై అధ్యయనం చేశారు. 40, 50 లేదా 60 ఏళ్ల తర్వాత ప్రజలు ఏం చేస్తే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు అనే నివేదికను ది గార్డియన్ విడుదల చేసింది.

VA బోస్టన్ హెల్త్‌కేర్ సిస్టమ్‌లోని మిలియన్ వెటరన్ ప్రోగ్రామ్‌ ప్రధాన అధ్యయన రచయిత, ఆరోగ్య శాస్త్ర నిపుణుడు  జువాన్-మై టి న్గుయెన్ మాట్లాడుతూ ” వయసు మీరిన వారు, ఇప్పటికే అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా జీవితంపై ఆశ కోల్పోవాల్సిన అవసరం లేదు. కేవలం జీవనశైలిలో చిన్న మార్పులను చేయడం ద్వారా వారి జీవితకాలం పెంచుకోవచ్చు” అని చెప్పారు. అయితే టైప్ 2 మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, స్ట్రోక్, క్యాన్సర్ మొదలైన వ్యాధులను ఈ జీవనశైలి మార్పులతో నయం చేయగలం అని చెప్పడం లేదు గానీ, ఎలాంటి సమస్యలు రాని జీవితాన్ని అనుభవించడానికి ఇది సహాయపడుతుందని ఆయన చెప్పారు.

మిమ్మల్ని ఎక్కువ కాలం జీవించేలా చేసే ఆరోగ్యకరమైన అలవాట్ల కోసం ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం లేదు  కావాల్సింది బలమైన సంకల్పం ఉండడమే  అని పరిశోధకులు చెబుతున్నారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకుండటం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల తీవ్రత మరింత పెరగకుండా నియంత్రించవచ్చు అని ఆయన అన్నారు… క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, కాలేయ వ్యాధులు వంటి వ్యాధులు సిగరెట్లు తాగడం లేదా మద్యం సేవించడం వంటి అలవాట్లతో ముడిపడి ఉంటాయి, కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. అంతే కాకుండా వ్యాయామం చేయకుండా, శారీరక శ్రమ లేకుండా కూర్చోవడానికి బదులు ఎల్లప్పుడూ  హుషారు గ ఉండటానికి ప్రయత్నిస్తే ఆనందంగా  వందేళ్లు బ్రతకవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇది కాకుండా, అధిక స్థాయి ఒత్తిడి కొలెస్ట్రాల్ స్థాయిలు, బ్లడ్ షుగర్, రక్తపోటును పెంచుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశం అని స్పష్టం చేస్తున్నారు.

ఈ అధ్యయనం ప్రకారం మీ జీవిత కాలాన్ని పెంచుకోడానికి ఎలాంటి మారుపులు తీసుకోవాలి అన్నది తెలుసుకొని ఇకపై ఆ పద్దతులను అనుసరిద్దాం 

1.చిల్లర తిళ్ళు కాకుండా మంచి ఆహారాన్ని తినండి

2. ఎటువంటి స్ట్రెస్ లేకుండా రాత్రి పూత హాయిగా నిద్రపోవాలి 

3. అతిగా మద్యం తాగడం మానుకోండి

4. శారీరకంగా చురుకుగా ఉండండి

5. ఒత్తిడి తగ్గించుకోండి 

6. ఓపియాయిడ్ వ్యసనం నుండి విముక్తి పొందండి

7.ప్రతి ఒక్కరితో పోస్టివ్ రేలషన్ ని పెంచుకోండి 

8.సిగరెట్లు తాగడం  మానుకోండి

ఈ ఎనిమిది  ఆరోగ్యకరమైన మార్పులను పాటిస్తే పురుషులు, మహిళలు వారి జీవితకాలాన్ని అదనంగా 23.7 ఏళ్లు లేదా 22.6 సంవత్సరాల ఆరోగ్యం పొందగలరు అని ఒక  అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.