చింతపండుతో చిగురించే ఆరోగ్యం 

ఎంతో పుల్లగా ఉండే చింతపండు మన ఆరోగ్యానికి సరిపడా ఎన్నో ఆరోగ్య గుణాలు ఉన్నాయట. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలను కూడా తీర్చగలిగే శక్తి చింతపండులో ఉంది. మరి ఈ చింతపండులో ఉండే మరిన్ని ఆరోగ్య సూత్రాలు గురించి ఈరోజు తెలుసుకుందామా..  చింతపండుతో చిగురించే ఆరోగ్యం:  చింతపండు మీ భోజనానికి రుచిని జోడించడమే కాకుండా, అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. చింతపండులో ఉండే అనేకమైన పోషకాలు మీ శరీర కొలెస్ట్రాల్ తగ్గించడం దగ్గర నుంచి […]

Share:

ఎంతో పుల్లగా ఉండే చింతపండు మన ఆరోగ్యానికి సరిపడా ఎన్నో ఆరోగ్య గుణాలు ఉన్నాయట. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలను కూడా తీర్చగలిగే శక్తి చింతపండులో ఉంది. మరి ఈ చింతపండులో ఉండే మరిన్ని ఆరోగ్య సూత్రాలు గురించి ఈరోజు తెలుసుకుందామా.. 

చింతపండుతో చిగురించే ఆరోగ్యం: 

చింతపండు మీ భోజనానికి రుచిని జోడించడమే కాకుండా, అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. చింతపండులో ఉండే అనేకమైన పోషకాలు మీ శరీర కొలెస్ట్రాల్ తగ్గించడం దగ్గర నుంచి జీర్ణ సమస్యలు వంటి వాటిని కూడా పరిష్కరిస్తుంది. చింతపండు యాంటీ ఆక్సిడెంట్లకు, ముఖ్యంగా విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్లు, విటమిన్ బి కాంప్లెక్స్‌కి మంచి మూలం. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

చింతపండు అనేది పొటాషియంకి అద్భుతమైన మూలం, కాబట్టి చింతపండు మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఫ్లేవనాయిడ్స్ వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి, వీటిలో కొన్ని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, ఇది రక్తపోటును నిర్వహించడానికి సహాయపడే మెగ్నీషియం అందించడంలో సహాయం చేస్తుంది. టామరిండినల్, అంటే ఇది చింతపండు నుండి తీసిన గుజ్జు ముఖ్యంగా, యాంటీ ఫంగల్ విధంగా కూడా ఉపయోగపడుతుంది.

చింతపండు టానిక్, కార్మినేటివ్, యాంటిసెప్టిక్, క్లీనింగ్ ఏజెంట్, అంతేకాకుండా ముఖ్యంగా ఫీబ్రిఫ్యూజ్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా జీర్ణశక్తిని పెంపొందించడానికి, మీ శరీర కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు సహాయపడుతుంది. చట్నీల నుండి కూరల వరకు, చింతపండు మీ భోజనానికి ఒక చక్కని రుచిని తీసుకువస్తుంది. అంతేకాకుండా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

శరీర కొలెస్ట్రాల్ తగ్గించుకోండి ఇలా:

వెల్లుల్లిపాయ:

వెల్లుల్లిపాయలో సల్ఫర్ అనేది ఉంటుంది. అందులో ఉండే అలసిన్ కాంపౌండ్, మన శరీరంలోని రక్తప్రసరణ జరిగే నరాలను విశాలంగా ఉండేలా చేస్తుంది. ఈ క్రమంలోనే, ప్రతి ఒక్క శరీర అవయవానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ముఖ్యంగా వెల్లుల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. ఆంటీ ఆక్సిడెంట్ అనేవి గుండె సంబంధించిన ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది, ముఖ్యంగా కొలెస్ట్రాల్ ను దూరం చేసి, అనారోగ్య సమస్యలను నిర్మూలిస్తుంది. అందుకే వెల్లుల్లి తినడం కారణంగా గుండెకు సంబంధించిన వ్యాధులు దూరం అవుతాయి. అంతేకాకుండా రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. 

తృణధాన్యాలు: 

తృణధాన్యాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తక్కువ చేయడమే కాకుండా, శరీరం మెదడు ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది. వోట్స్, బార్లీ వంటివి బీటా-గ్లూకాన్‌ను అందిస్తాయి, ఇది ‘చెడు’ LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా ప్రభావవంతమైన ఫైబర్.

గింజలు: 

చిక్కుళ్ళు, బీన్స్, ధాన్యాలు, అంతేకాకుండా చిక్‌పీస్ వంటివి ఈజీగా కరిగిపోయే ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలు. కూరగాయలలో ప్రోటీన్‌స్ పుష్కలంగా ఉంటాయి. కరిగే ఫైబర్ మీ జీర్ణవ్యవస్థలో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పాటు చేసి, కొలెస్ట్రాల్‌ను లాక్ చేసి మీ శరీరం నుండి దూరంగా ఉంచుతుంది. 

యాపిల్: 

రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం ఉండదు అనే సామెత నిజమే. ఎందుకంటే ఇందులో ఉండే పాలిఫినోల్స్ అనేవి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించేందుకు ఎంతగానో సహాయపడతాయి. అందుకే రోజు ఒక ఆపిల్ తినడం చాలా మంచి విషయం. 

సబ్జా గింజలు: 

సబ్జా గింజలలో శరీరంలోని వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా ఇది త్వరగా జీర్ణం అవ్వడమే కాకుండా, కొలెస్ట్రాల్ నిలువలను బయటికి పంపించే ప్రక్రియలో సహాయపడుతుంది.